Lakshmi Nivasam Serial April 21st Episode Promo: తులసికి ఎలాగైనా తన ప్రేమ విషయం చెప్పాలని ట్రైలర్స్ వేస్తుంటాడు సిద్ధు. మరోవైపు, తన రాజకీయ జీవితంతో పాటు కొడుకు రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుందని ఎమ్మెల్యే మునుస్వామి కూతురితో.. సిద్ధుకి పెళ్లి చేయాలనుకుంటాడు బసవ. ఇదే క్రమంలో గుడిలో పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తారు. ఇరు కుటుంబాలు అమ్మవారి ఆలయానికి చేరుకుంటాయి. ఇదే సమయంలో తులసి సైతం అక్కడకు వస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందనే ప్రోమో తాజాగా రిలీజైంది.
సిద్ధు స్టైల్‌కు కనిష్క ప్లాట్
బసవ తన ఫ్యామిలీ మెంబర్స్‌కు కూడా తెలియకుండా ఎమ్మెల్యే మునుస్వామి కూతురు కనిష్కతో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. గుడికి వెళ్లిన తర్వాత ఈ విషయం విశాలాక్షి, నీలిమ తెలుసుకుంటారు. ఇదే సమయంలో తులసి సైతం ఆ గుడికి వస్తుంది. ఆమెను చూసిన విశాలాక్షి సంతోషంతో పలకరిస్తుంది. ఇక తప్పదన్నట్లు బసవ, అతని తల్లి కూడా తులసిని పలకరిస్తారు. తులసి పక్కకు వెళ్లిన తర్వాత విశాలాక్షిపై బసవ, అతని తల్లి కోప్పడతారు.
మరోవైపు.. సిద్ధు ఎక్కడంటూ ఎమ్మెల్యే మునుస్వామి బసవను అడుగుతాడు. కనిష్క అతని రాక కోసం ఎదురు చూస్తుంటుంది. అంతుకు ముందే సిద్ధు రౌడీలతో ఫైట్ చేసిన దృశ్యాన్ని ఆమె తలుచుకుని మురిపిపోతుంటుంది. ఇంతలో సిద్ధు అక్కడకు వస్తాడు. ఎమ్మెల్యే మునుస్వామిని చూసి కోపం తెచ్చుకుంటాడు. విషయం చెప్పలేదా? అంటూ బసవను అడుగుతాడు మునుస్వామి. ఇది చూసి సిద్ధును పక్కకు తీసుకెళ్లి పెళ్లి విషయం చెప్తాడు.
తులసికి అమ్మవారి చీర ఇచ్చిన సిద్ధు
ఇదే సమయంలో అమ్మవారి దగ్గర ఉంచిన శేషవస్త్రం చాలా పవిత్రమైనదని.. దాన్ని వరుడు వధువు చేతికి ఇవ్వాలంటూ పూజారి అంటాడు. ఆ చీరను సిద్ధు కనిష్క చేతికి ఇవ్వాలంటూ చెప్తాడు. ఆ టైంలో తులసి భక్తులకు ప్రసాదం పంచి పెడుతుంది. ఆమెను చూసిన సిద్ధు.. అమ్మవారి చీరను డైరెక్టుగా తీసుకెళ్లి ప్రసాదం తీసుకుంటున్నట్లుగా నటిస్తూ.. తులసి చేతికి అందిస్తాడు. ఇది చూసిన ఎమ్మెల్యే మునుస్వామి ఫ్యామిలీతో పాటు బసవ ఫ్యామిలీ కూడా షాక్ అవుతారు.
సిద్ధుపై తులసి ఆగ్రహం
సిద్ధు తనకు అమ్మవారి చీర ఇవ్వడంపై తులసి అతనిపై.. 'నీకేమైనా పిచ్చా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మీరు బాగుండాలని ఇచ్చానంటూ సిద్ధు ఆమెతో అంటాడు. ఆ చీరను పక్కన పెట్టేయబోగా.. పక్కనే ఉన్న పెద్దావిడ అడ్డుకుంటుంది. అమ్మవారి శేషవస్త్రం ఆమె ఆజ్ఞ లేనిదే నీ దగ్గరకు రాదని.. అది నీతోనే ఉంటే నీకు మంచి జరుగుతుందంటూ సలహా ఇస్తుంది.
ఇది చూసిన ఎమ్మెల్యే మునుస్వామి, కనిష్క.. తులసిపై కోపం తెచ్చుకుంటారు. శుభకార్యం కోసం ఉంచిన శేషవస్త్రాన్ని ఎలా తీసుకుంటావంటూ నానా మాటలు అంటారు. ఆ చీర తిరిగి ఇవ్వబోతుండగా కనిష్క వద్దంటుంది.
సిద్ధుకు కనిష్కతో పెళ్లి ఫిక్స్
అమ్మవారి సమక్షంలో తాంబూలాలు మార్చుకున్నా సరిపోతుందని.. బసవ తల్లి సలహా ఇస్తుంది. దీంతో బసవ, మునుస్వామి అలానే చేస్తూ తాంబూలాలు మార్చుకుంటారు. మరి కనిష్కతో సిద్ధు పెళ్లికి ఒప్పుకుంటాడా?, సిద్ధును విలన్‌లా చూస్తున్న తులసి అతని ప్రేమను అర్థం చేసుకుంటుందా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.