Krishna Mukunda Murari Telugu Serial Today Episode: ముకుంద మురారి దగ్గర కాయిన్ తీసుకుంటుంది. ఇక కృష్ణ కూడా మురారికి కాయిన్ అడుగుతుంది. ముకుందకు తన కోరిక నెరవేరదు మన కోరికే నెరవేరుతుంది అని చెప్పాలి అని కృష్ణ ముకుందకు అర్థమయ్యేలా కాయిన్ నిలబెట్టాలి అనుకుంటుంది. మురారి మనసు మారాలి అని ముకుంద కోరుకుంటుంది. మురారి తాను జీవితాంతం కలిసి ఉండాలి అని ముకుంద మనసు మారాలి అని కృష్ణ కోరుకుంటుంది. అయితే కృష్ణ కాయిన్‌ పెట్టలేకపోతుంది. ముకుంద కాయిన్ నిలబడుతుంది. ముకుంద ఎగిరి గంతులేస్తుంది. 


ముకుంద: కృష్ణ నా కోరిక తీరబోతుంది. నువ్వు కూడా తీరే కోరిక కోరుకో అప్పుడే కాయిన్ నిలబడుతుంది. థ్యాంక్యూ మురారి కాయిన్ ఇచ్చినందుకు. 
కృష్ణ: ముకుంద కాయిన్ నిలబడింది. తను మీరు కావాలి అని కోరుకుంటుంది. అంటే మీరు తనకు దక్కుతారు అనే కదా అర్థం. 
మురారి: పిచ్చా నీకు.. నువ్వు నీ అర్థం పర్థం లేని ఆలోచనలు.
కృష్ణ: అలా అయితే ఇక్కడ కాయిన్స్ నిలబెట్టే వారు అంతా పిచ్చివాళ్లు ఏం కాదు కదా.. ముకుంద కాయిన్ నిలబడింది. నా కాయిన్ నిలబడలేదు. అంటే ముకుంద అనుకున్నది జరుగుతుంది. నేను అనుకునేది జరగదు. 
మురారి: ఆపుతావా ఈ మధ్య నీకు పనికిమాలిన నమ్మకాలు ఎక్కువ అయ్యాయి. కాయిన్ నిలబడటం జస్ట్ ఒక అదృష్టం మాత్రమే. కృష్ణ ప్లీజ్ ఇక్కడ సీన్ చేయకు. ఒక్క కాయిన్ కాదు వంద కాయిన్లు నిలబెట్టినా తను అనుకున్నది ఏదో జరగదు. అయినా తమ కోరిక నెరవేరుతుందా లేదా అని అనుమానం ఉన్నవాళ్లే ఇలాంటి టెస్టులు పెట్టుకుంటారు. నేను ఎప్పుడో నీ సొంతం అయిపోయాను కదా. ఇంకా నీకు ఎందుకు ఈ టెస్ట్‌లు. పోనీ విడిపోతాము అని నీకు ఏమైనా అనుమానం ఉందా. మరి ఎందుకు ఇలా ఆలోచించడం. ఏదో దాని పిచ్చి కోసం వంద చేస్తుంది. మనం ఏం చేయాలో అది చేద్దాం. ఎక్కువ ఆలోచించకుండా అమ్మావాళ్లని పిలువు పద.
ముకుంద: ఇప్పటికైనా నమ్ముతావా నాకోరిక నెరవేరుతుంది. నువ్వు నా వాడివి అవుతావు అని. 
మురారి: ఎందుకు.. 
ముకుంద: నా కాయిన్ నిలబడింది కదా..
మురారి: ఎక్కడ.. కాయిన్ కింద పడిపోయి ఉంటుంది. ముకుంద ఏమైంది నిలబడింది అన్నావ్ కాయిన్. ఇప్పటికైనా నమ్ముతావా నువ్వు కోరుకున్న కోరిక ఎప్పటికీ నెరవేరదు అని..
ముకుంద: నో నెరవేరుతుంది. నేను కోరుకొని నిల్చొపెట్టినప్పుడు నిల్చొంది. 
మురారి: తర్వాత పడిపోయింది కదా.. అంటే ఏమిటి అర్థం మనం ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు అన్ని తీరినట్లే అనిపిస్తాయి. కానీ అందులో కొన్నే తీరుతాయి. మిగతావి తిరగబడిపోతాయి. ఇదిగో ఇలా.. కాబట్టి ఎక్కువ ఆశలు పెట్టుకోకు. నీది ఎప్పటికీ తీరే కోరిక కాదు..
ముకుంద: తీరుతుంది. ఎలా అయినా తీరేలా చేస్తా.. ఈ రోజు శోభనం ఎలా ఆపాలో నువ్వు చూడు. లేదంటే నేను ఏం చేస్తానో నువ్వు ఊహించలేవు. 
కృష్ణ: ఏంటో ఏసీపీ సార్ నా మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. అటు చూస్తే పెద్దత్తయ్యకి మాట ఇచ్చాను. ఇటు చూస్తే ముకుంద ఇలా.. భయం వేస్తుంది ఏసీపీ సార్. 
మురారి: ఏదీ తను అనుకున్నట్లు జరగదు. తను నిలబెట్టిన కాయిన్ పడిపోయింది అది నువ్వు చూడలేదు. నీతి న్యాయం ధర్మం అనుకున్న కోరికలే తీరడం కష్టంగా ఉన్న కలికాలం ఇది. అలాంటిది తాళి కట్టిన భర్తను పంపించేసి ఇంకొకరి భర్తను ఇచ్చేయ్ మంటే దేవుడు తీరుస్తారా.. తీర్చడుకదా..


ముకుంద వాళ్లు ఇంటికి వస్తారు. ఆదర్శ్‌ కాలికి దెబ్బతగలడంతో ఇబ్బంది పడి నడవలేకపోతాడు. అయితే ముకుంద అది పట్టించుకోకుండా మురారి వాళ్లు ఇంకా రాలేదు ఏంటి అని ఆలోచిస్తుంది. ఇంతలో రేవతి ఆదర్శ్‌ని పట్టుకొని లోపలకి తీసుకని రమ్మని చెప్తుంది. వదిలేయాలి అని అనుకుంటే పట్టుకోమంటున్నారు అనుకొని ఇష్టంలేకుండా ఆదర్శ్‌ని ఇంటి లోపలికి తీసుకొని వస్తుంది. 


కృష్ణ మురారిలు కాఫీ షాప్‌కి వస్తారు. వెయిటర్‌ వచ్చి ఏం కావాలి అంటే కృష్ణ మనస్శాంతి కావాలి అంటుంది. దీంతో వెయిటర్ రెండు ప్లేట్‌లు తీసుకురావాలా అని అంటాడు. దీంతో కృష్ణ వెయిటర్‌ మాటలకు కనెక్ట్ అయిపోయి తన సమస్య ఏంటని అడుగుతుంది.


వెయిటర్: మామూలుగా అయితే నేను ఎవరికీ నా సమస్య చెప్పను సిస్టర్ కానీ మీరు నా బాధని అర్థం చేసుకున్నారు అందుకే  మీకు చెప్తున్నా.. మొన్న నాకు పెళ్లి అయింది సిస్టర్. నిన్న శోభనం..
మురారి: వావ్.. మొన్న పెళ్లి.. నిన్న శోభనం నీ పని బాగుందిగా.. కొంత మందికి పెళ్లయి రెండేళ్లు అయినా ఆ ఊసే ఉండదు. దేనికైనా రాసి పెట్టి ఉండాలి. 
కృష్ణ: ఏసీపీ సార్..
మురారి: సారీ సారీ నువ్వు చెప్పు.. అయినా రాత్రే పెళ్లి అయి పొద్దున్నే డ్యూటీకి వచ్చేశావ్ ఏంటి.
వెయిటర్: నాకు ఎప్పటికీ డ్యూటీనే సార్. రాత్రి శోభనం గదిలో నుంచి నా భార్య వెళ్లిపోయింది. 
కృష్ణ: ఎందుకు ఏమైనా గొడవ పడ్డారా..
వెయిటర్: గొడవ పడటానికి అయినా ప్రేమను పంచడానికి అయినా ముందు కలిసి ఉండాలి అనే ఆలోచిన ఉండాలి కదా సిస్టర్. నేను అంటే తనకు ఇష్టం లేదు అంట. నేను అసలు నచ్చనే లేదు అంట ముఖం మీద చెప్పి వెళ్లిపోయింది. ఇష్టం లేకపోతే పెళ్లిచూపులప్పుడు, లేదంటే పెళ్లి పీటల మీద అయినా చెప్పొచ్చు కదా సార్.. కానీ పెళ్లి అయిపోయి అందరికీ తెలిసిపోయి శోభనం గదిలో చెప్పింది నేను అంటే ఇష్టం లేదు. ఎవరితో చెప్పుకోను సార్ నా బాధ చచ్చిపోవాలి అనిపించింది. కానీ నాకు ఒక చెల్లి ఉంది. నేను పోతే తనకు ఎవరూ ఉండరు సార్. అందుకే నలుగురూ ఏమైనా అనుకోని అని బాధ్యత గుర్తొచ్చి ఆగిపోయా. సారీ సిస్టర్ మీరు అడిగే సరికి ఎమోషనల్ అయిపోయా.
కృష్ణ: ఇదేంటి ఏసీపీ సార్ మన కథలా ఉంది. 
మురారి: ముకుంద కూడా శోభనం గదిలో ఆదర్శ్‌కి ఇలానే చెప్తే..
కృష్ణ: తట్టుకోలేడు ఏసీపీ సార్. 
మురారి: కానీ ఆదర్శ్‌.. 
కృష్ణ: ఏసీపీ సార్ ఆ మాట అనొద్దు.. అదర్శ్‌కి ఏం కాదు. ఏం కాకుండా మనమే ఏదో ఒకటి చేయాలి. 


రేవతి: మధు ఫోన్‌లో బిజీగా ఉంటే రోజంతా ఫోన్ చూడకపోతే పనులు చూడొచ్చు కదరా..
మధు: ఏం పనులు ఉన్నాయి పెద్దమ్మ శోభనం పనులే కదా అదేమైనా పెళ్లా.. రోజంతా పనులు చేయడానికి డెకరేషన్ ఫ్రూట్స్, స్వీట్సే కదా.. 
రేవతి: రేయ్ అక్కడితో ఆపేయ్..జరగని శోభనానికి పువ్వులు పళ్లు అని అది ఇదీ వాగితే దెబ్బలు పడతాయి. 
మధు: నువ్వే అన్నావు కదా పెద్దమ్మ ఇంకా నేను ఎందుకు వాగుతాను అయినా నేను చెప్పాలి అనుకున్నది అది కాదు. ముందు ఒక శోభనం అనుకొని తర్వాత రెండు అయ్యాయి. అన్నీ డబుల్ చెప్పేశా ఏం పర్లేదు లే..


ఇంతలో మురారి, కృష్ణలు ఇంటికి వస్తారు. రేవతి పిలిచినా కృష్ణ పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. దీంతో రేవతి ఏయ్ తింగరి ఇలా రా అని పిలిచి ఏమైంది ముఖం మాడ్చుకొని ఎందుకు వెళ్లిపోతున్నావ్ అని అడుగుతుంది. దీంతో కృష్ణ మురారిని ఇరికించేస్తుంది. మురారి తనని కొట్టాడు అని అబద్ధం చెప్తుంది. మురారి షాక్ అయిపోతాడు. నేను కొట్టలేదు అని అంటాడు. ముందు కొట్టి నన్ను కొట్టారు అని అంటుంది. మధు, రేవతి షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read:   గామా అవార్డ్స్ 2024: దుబాయ్‌లో సందడి చేసిన టాలీవుడ్ స్టార్స్ - గామా అవార్డ్స్ 2024కి ఎవరెవరు వెళ్లారో చూడండి