Krishna Mukunda Murari Today Episode: ముకుంద గదికి వచ్చిన ఆదర్శ్‌ ముకుందకు సారీ చెప్తాడు. ఎందుకు అని ముకుంద అడగడంతో నిన్ను అపార్థం చేసుకొని వదిలేసి వెళ్లిపోయాను అని అంటాడు. నేను నిన్ను ప్రేమించాను ముకుంద.. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను ముకుంద అని అంటాడు. 


ఆదర్శ్‌: నేను ప్రేమించింది నిన్నే అని మురారికి చెప్పలేదు. ఒక అమ్మాయిని ప్రేమించాను అని తనతో చెప్పగానే సంతోషంతో పొంగిపోయాడు ముకుంద. ఎలా అయిన తనని పెళ్లి చేసుకో అన్నాడు. అప్పుడు నీ ఫొటో చూపించాను. ఎలాగోలా నిన్ను ఒప్పించి మన పెళ్లి జరిపించాడు. కానీ ఆ తర్వాత తెలిసింది ముకుంద మురారి కూడా నిన్నే ప్రేమించాడు అని. అసలు ఈ విషయం ముందే తెలిసి ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకునేవాడినే కాదు. నా ప్రేమ కోసం ఇద్దరు ప్రేమికుల్ని విడదీసిన పాపం నేను ఎందుకు చేస్తాను. అసలు చేసుండేవాడినే కాదు.


కానీ నిజం తెలీక జరగకూడనిది జరిగిపోయింది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మనసు విప్పి మాట్లాడుకోవాలి కదా అప్పుడే ఎవరి మనసులో ఏం ఉందో తెలుస్తుంది. లేదంటే మనుషుల మధ్య దూరమే మిగులుతుంది. ఇన్నాళ్లు మన మధ్య దూరంలా.. ప్రాణాలను అయినా వదిలేయొచ్చు కానీ ప్రేమని మాత్రం వదులు కోవడం కష్టం ముకుంద. కానీ మురారి నా ప్రేమ కోసం తన ప్రేమను త్యాగం చేశాడు. కారణం ఏంటో తెలుసా ఒకటి వాడికి నా మీద ఉన్న ప్రేమ.  


రెండోది వాడు ప్రేమించిన అమ్మాయికి తన కంటే ఎక్కువ ప్రేమని నేను పంచగలను అనే నమ్మకం. నిజం ముకుంద అంతే ఎక్కువగా ప్రేమించాను నేను నిన్ను. చెప్పాను కదా నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. నీ నుండి దూరంగా వెళ్లిన తర్వాత మర్చిపోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ప్రతీక్షణం నువ్వే గుర్తొచ్చేదానివి. నిన్ను మర్చిపోలేక ఆ నరకం అనుభవించలేక చచ్చిపోవాలి అనుకునేవాడిని.. అందుకే సైన్యంలో అందరి కంటే ముందెళ్లే వాడిని.


కానీ నీ తాళి గట్టిది ముకుంద. ఏం కానివ్వలేదు. ఎప్పటికీ నాకు ఏం కానివ్వదు. ఇక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్లను ముకుంద ఈ ప్రాణం ఉన్నంత వరకు నీతోనే ఉంటా. ఏం ముకుంద ఏం మాట్లాడటం లేదు. నా మీద కోపమా..


ముకుంద: కోపమా కోపం ఎందుకు అలా ఏం లేదు.
ఆదర్శ్‌: కోపం ఎందుకు ఉండదు. నువ్వు మారిపోయావ్ అని చెప్పావు కదా అయినా తప్పు అంతా నాదే.. అప్పుడు నువ్వు కోప్పడితే నేను ఎందుకు వెళ్లిపోవాలి. నేను కట్టిన తాళి నీ గుండెల మీద ఇప్పటి వరకు ఉంచుకున్నదానివి. నీ గుండెల్లో నాకు చోటు ఇచ్చేదానివి కదా.. నేను కాస్త ఓపికగా ఎదురు చూసుంటే అప్పుడే ఒప్పుకునేదానివి కదా.. సరే సరే జరిగినది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు దక్కింది కదా అది చాలు. దక్కింది కదా.. అయినా ఇప్పుడు మళ్లీ అనుమానపడుతున్నానేంటి. నువ్వు మారావు అని చెప్తేనే వచ్చాను.  మళ్లీ ఈ పిచ్చి ప్రశ్నలు ఏంటి.. ఇక మన జీవితంలో అనుమానాలు అపార్థాలకు చోటు లేదు. ఒక ప్రేమకు తప్ప. అంతే కదా.. 
ముకుంద: సరే జర్నీ చేసి వచ్చావు కదా వెళ్లి ఫ్రెష్ అయిరా.. 
ఆదర్శ్: సరే క్షణాల్లో వస్తాను.
 
కృష్ణ: ఎంత ప్రేమించాడు పోనిలే ఇప్పటికీ మించిపోయింది లేదులే ముకుంద మనసు మార్చుకుందిగా.. అందరం హ్యాపీగా ఉండొచ్చు. 
మురారి: కృష్ణ నువ్వు మామూలుదానివి కాదు మన కథను సుఖాంతం చేశావు. నాకు ఏసీపీ సార్ కంటే కృష్ణ మొగుడి పోస్టే చాలా పవర్ ఫుల్‌గా ఉంది.
కృష్ణ: ఏంటి సార్ నన్ను తెగ మోసేస్తున్నారు. 
మురారి: సరే కానీ ఆదర్శ్‌ ఎలాగూ రిజైన్ చేశాడు కాబట్టి వాడితో ఓ బిజినెస్ పెట్టించాలి. 
కృష్ణ: వేరే బిజినెస్ ఎందుకు పెద్దత్తయ్య హాస్పిటల్ కట్టించారు కదా అది ఇద్దరం చూసుకుంటాం. పెద్దత్తయ్య చేత చెప్పిద్దాం అప్పుడు ఆదర్శ్‌ తప్పకుండా ఒప్పుకుంటాడు. అత్తయ్య భోజనాలు రెడీయా..
రేవతి: రెడీ కానీ వాడు ఎక్కడే..
కృష్ణ: వాడు అంటే ఎవరు అత్తయ్య.
రేవతి: నీ మొగుడు నా కొడుకు.
కృష్ణ: అంటే ఏంటి అత్తయ్య మీ అబ్బాయి ఎప్పుడు నా కొంగు పట్టుకొని తిరుగుతారా ఆయనకు వేరే పని ఉండదా.. ఇన్ డైరెక్ట్‌గా అదే అర్థం. 
రేవతి: ఆపుతావా అన్ని నీకు నువ్వే అనేసుకొని మళ్లీ అందరూ అన్నారు అంటావు. అందుకే నిన్ను అందరూ తింగరి..
కృష్ణ: అత్తయ్య ఆపేయండి నేను పెద్ద పెద్ద సమస్యలు పరిష్కరించాను నేను తింగరి ఎలా అవుతాను.
భవాని: నువ్వు ఎప్పటికి తింగరి దానివే. మురారి నీ వెనక తిరిగితే ఏంటి. నీ కొంగు పట్టుకొని తిరిగితే ఏంటి నష్టం. భార్యభర్తలు అన్నాక అలాగే ఉండాలి. అప్పుడే అన్యోన్యంగా ఉంటారు. మధ్యలో ఎవరూ దూరకుండా ఉంటారు. మనసులో ముకుంద, ఆదర్శ్‌లను చూసి వీళ్ల అన్యోన్యత మీద నాకూ అనుమానంగా ఉంది. నాన్న రా కూర్చో ఈరోజు నీకు నచ్చినవన్నీ వడ్డిస్తాను నా చేతులతో నేను వడ్డిస్తాను కూర్చొ.
కృష్ణ: మరి మాకు పెద్దత్తయ్య సారీ సారీ ముందు మీ అబ్బాయికి ఆ తర్వాత మాకు.  
ముకుంద: మనసులో.. అందర్ని నవ్విస్తుంది. తనూ నవ్వుతూ ఉంటుంది. ఏదీ మనసులో పెట్టుకోకుండా సంతోషంగా ఉంటుంది.  నేను కూడా కృష్ణలా అన్ని మర్చిపోయి సంతోషంగా ఉండగలనా.. నా జీవితంలో సంతోషం అనే పదం ఉందా.. ఎప్పుడూ ఇలా పరిస్థితుల మధ్య నలిగిపోవడం ఏనా..
రేవతి: కృష్ణ ఇంతకీ ఇందాక మా అక్కకి ఏం సలహా ఇద్దామనుకున్నావ్.
కృష్ణ: ఎందుకులే అత్తయ్య చెప్పకముందే నోరు మూయించారు. చెప్తే ఇంకా ఏం చేస్తారో. ఏం లేదు ఆదర్శ్‌కి ముకుంద వడ్డిస్తే ఎలా ఉంటుందా అని..
భవాని: తిను నాన్న ఇంకా ఏం ఆలోచిస్తున్నావ్. ఓ ముందు నువ్వు రోటి పచ్చడితో తింటావ్ కదా ఆ పచ్చడి ఇవ్వండి.  
కృష్ణ: తనలో తాను.  అర్థమైంది ముకుందకు నో చాన్స్ అన్నమాట. 
ఆదర్శ్‌: నువ్వు కూర్చో అమ్మ కలిసి తిని ఎన్ని రోజులు అయిందో. ఇక ఆదర్శ్ తన తల్లికి వడ్డించగా భవాని ఆదర్శ్‌కి గోరు ముద్దలు తినిపిస్తుంది. అందరూ ఎమోషనల్ అవుతారు. ఆదర్శ్‌ కూడా భవానికి తినిపిస్తాడు.  
భవాని: సరే నాన్న నీ గురించి చెప్పు. సరే ఎందుకు సడెన్‌గా రిజైన్ చేశావు. అని అడగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్ జనవరి 25th: మిస్సమ్మపై కాళీ అత్యాచారయత్నం.. అరుంధతిని బంధించిన ఘోర!