Krishna Mukunda Murari Serial Today Episode


కృష్ణ: పరిమళ మేడం ఎప్పుడు వస్తారు ఏసీపీ సార్..
మురారి: ఏమైంది కృష్ణ..
కృష్ణ: ఎందుకో మనసంతా బెంగగా ఉంది. ఏదీ చేయాలి అనిపించడం లేదు. ఇక పెళ్లి మూడు రోజులే ఉంది.
మురారి: ఎందుకు కృష్ణ అంత టెన్షన్ పడుతున్నావు. ఇప్పుడు పరిమళ వస్తుంది. వచ్చేటప్పుడు ఆర్టిస్ట్‌ని కూడా తీసుకొస్తుంది అప్పుడు అది ఎవరో అని తెలిసిపోతుంది.
కృష్ణ: అవును అనుకోండి... ఇప్పుడు ఆ ఆర్టిస్ట్‌ వేసే బొమ్మలో ఉన్న వ్యక్తి మనకు తెలిసిన వాడు అయితే పర్లేదు. కేసు ఓ కొలిక్కి వచ్చేస్తుంది. కానీ ఆ వ్యక్తి ఎవరో అనుకుంటే అప్పుడు మూడు రోజుల్లో ఎలా తెలుస్తుంది. 


ముకుంద: దేవ్ పరిమళ వచ్చేస్తుంది.. ఆర్టిస్ట్‌ వచ్చేస్తాడు.. నువ్వేంటి తీరికగా కూర్చొన్నావ్..
దేవ్: ప్లాన్ చేస్తున్నా.. పరిమళని లేపేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా.. ఆవిడ ఒక్కర్తే లేకపోతే ఈ స్కెచ్‌లు ఉండవు కదా..
ముకుంద: స్టాపిట్ దేవ్.. ఇప్పటికే నువ్వు చేస్తున్న దానికి నాకు రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతుంది. ఇవన్నీ కాకుండా ఇంకా వేరే ఏదో ప్లాన్ చెయ్ దేవ్..
దేవ్: ముందు నువ్వు కిందకి వెళ్లు నా ప్లాన్ ఏదో నేను ప్లాన్ చేసుకుంటా.. 


ఇక మురారి, కృష్ణ, రేవతి, ముకుంద అందరూ హాల్‌లో పరిమళ కోసం ఎదురు చూస్తుంటారు. ఇక దేవ్ కూడా అక్కడికి వస్తాడు. ముకుంద ఎందుకు నువ్వు వచ్చావ్ అని దేవ్‌ని అడుగుతుంది. ఇక భవాని కూడా వస్తుంది. పరిమళ, ఆర్టిస్ట్ శ్రీధర్ కూడా వస్తారు. దేవ్ పరిమళ చూడకుండా పైకి వెళ్లిపోతాడు. ఇక పరిమళ పోలికలు చెప్తుంటే ఆర్టిస్ట్‌ బొమ్మ గీస్తాడు. దేవ్ పైనుంచి అంతా చూస్తుంటాడు. ఆర్టిస్ట్‌ బొమ్మ గీసి మురారి చేతిలో పెడతాడు. మురారి దొరికాడు అని అంటాడు. ఇక మురారి ఆ బొమ్మను భవానికి చూపిస్తాడు. 


భవాని: ఇతను నాకు తెలుసు నాన్న. నాకే కాదు అందరికీ తెలుసు. 
రేవతి: ఎవరు అక్కా ఆ దుర్మార్గుడు.
భవాని: దుర్మార్గుడు కాదు రేవతి చాలా మంచోడు. పైగా మూగవాడు. మన ఫాంహౌస్ రాజనర్శ్‌ పెద్ద కొడుకు.  


ఇక ఆ బొమ్మ చూసి పరిమళ తాను చెప్పింది ఇతను కాదు అంటుంది. ఇక మురారి ఆర్టిస్‌ మీద కోపంతో అరుస్తాడు.
భవాని: మురారి ఎందుకు నువ్వు ఇంత దిగజారిపోయావు. (కృష్ణతో..)మిమల్ని తప్పించాలి అని మా మనుషులను ఇరికించి మమల్ని ఇరుకున పెట్టాలి అనుకున్నావా.. 
దేవ్: నా ప్లాన్ సూపర్‌గా వర్క్‌ అవుట్ అయింది.
మురారి: పెద్దమ్మ ఏం మాట్లాడుతున్నారు. నాకు కుట్ర చేయాలి అన్న ఉద్దేశం కానీ అలాంటి ఆలోచన కానీ లేదు. 
భవాని: నువ్వు ఎన్ని అయినా చెప్పు కానీ పరిమళ ఆయన కాదు అని చెప్తుంది. 
మురారి: పెద్దమ్మ రేపు ఇంకో ఆర్టిస్ట్‌ని పిలుస్తాను.
భవాని: అప్పుడు ఇంకో బొమ్మ గీయిస్తావు. తర్వాత ప్రభాకర్ కాదు కదా పెద్దమ్మ పెళ్లి చేసుకోను అంటావు. 
రేవతి: మనసులో... భగవంతుడా ఏంటయ్యా.. నా బిడ్డ జీవితంలో ఇన్ని మలుపులు పెట్టావు. 


ముకుంద: అసలు ఏం మాయ చేశావ్‌రా దేవ్.. మొత్తం తలకిందులుగా చేసి వాళ్లనే దోషులుగా నిలబెట్టావు.
దేవ్: దట్‌ ఈజ్ దేవ్.. మొన్న ఒక రోజు ఫ్రెండ్స్ వచ్చారు అని ఫాం హౌస్ అడ్రస్ అడిగి నీ దగ్గర తీసుకున్నా గుర్తుందా.. అక్కడ అప్పుడు రాజనర్శ్ కొడుకును చూశా.. మాకు సిగరెట్లు తీసుకొచ్చి ఇచ్చాడు. వాడు గుర్తొచ్చి నిన్న ఉదయం వాడి ఫొటో ఇచ్చా.. నేను నిన్న ఆర్టిస్ట్‌ శ్రీధర్ వాళ్ల ఇంటికి వెళ్లి.. (మురారి పరిమళకు ఆర్టిస్ట్ నెంబరు ఇవ్వడం దేవ్ చూసి ఆ నెంబరు తాను తీసుకోవడం గుర్తు చేసుకుంటాడు.) ఇక ఆర్టిస్ట్ ఎకౌంట్‌కి డబ్బు పంపించి తాను చెప్పినట్టు చేయమని ఫొటో చూపిస్తాడు. దాన్నే మురారి వాళ్ల దగ్గర వేయమని చెప్తాడు. ఇక ముకుంద చాలా హ్యాపీగా ఫీలవుతుంది. దేవ్‌ని పొగిడేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Readగోపీచంద్ సినిమాకు 'వెంకీ' కామెడీ టచ్ - ఇంట్రెస్టింగ్ మేటర్ రివీల్ చేసిన శ్రీను వైట్ల