దేశంలోని మిగతా భాషల్లో కంటే తెలుగులో వెబ్ సిరీస్‌ల సంఖ్య తక్కువే. గత నెలలోనే అమెజాన్ ప్రైమ్‌లో నాగ చైతన్య హీరోగా నటించిన ‘దూత’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈటీవీ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈటీవీ విన్ తెలుగులో కొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘#90's ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’. బిగ్ బాస్ ఫేమ్ శివాజీ, ప్రముఖ యూట్యూబర్ మౌళి ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ట్రైలర్‌ను ఇప్పుడు విడుదల చేశారు.






‘#90's ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్ కథ 2007లో జరగనుంది. ఈ విషయాన్ని ట్రైలర్ ప్రారంభంలోనే చూపించేశారు. మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్న తండ్రి చంద్రశేఖర్ (శివాజీ) గురించి పెద్ద కొడుకు మౌళి... సుచిత అనే తన ఫ్రెండ్‌కి చెప్తూ ఉండటంతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. శివాజీ, వాసుకి భార్యాభర్తలుగా నటించగా... మౌళి, వసంతిక, రోహన్ వారి పిల్లలుగా కనిపించనున్నారు. మౌళి క్రష్ పాత్రలో స్నేహాల్ కామత్ నటించారు.


డైలాగ్స్ మీద కాకుండా సిట్యుయేషన్ బేస్డ్ కామెడీని పండించారు. అలాగే ఎమోషన్‌ని కూడా బాగా క్యారీ చేశారు. జనవరి 5వ తేదీన ఈటీవీ విన్ యాప్‌లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. ఆదిత్య హసన్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకులు నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం ఈ సిరీస్‌ను నిర్మించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. 


తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది కథానాయకులు అవకాశాలు రాకో, అదృష్టం బాలేకో సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత తమ సెకండ్ ఇన్నింగ్స్‌లో డిజిటల్ రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. వీరిలో కొంతమంది అగ్ర హీరోల సినిమాల్లో కీలకపాత్రను పోషిస్తుంటే మరి కొంతమంది నటులు డైరెక్ట్ ఓటీటీల్లో వెబ్ సిరీస్‌ల్లో నటిస్తున్నారు. ఇప్పటికే జేడీ చక్రవర్తి, వేణు తొట్టెంపూడి లాంటి నటులు డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ చేసి మంచి రెస్పాన్స్ అందుకున్నారు.


ఇప్పుడు ఒకప్పటి మరో హీరో శివాజీ కూడా అదే బాటలో వెళ్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత శివాజీ బిగ్ బాస్ షోతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. 'బిగ్ బాస్' సీజన్  7లో టాప్-3 స్థానంలో నిలిచాడు. తొలి రోజు నుంచి తన ఆటతీరు, తోటి కంటెస్టెంట్స్ తో వ్యవహరించే తీరుతో బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. శివాజీ నటుడిగా తన సెకండ్ ఇన్నింగ్స్‌ని కూడా ఇప్పుడు మొదలుపెట్టారు. 'నైన్ టీస్' (90's) అనే వెబ్ సిరీస్ తో రాబోతున్నారు.


Also Readబబుల్‌గమ్ రివ్యూ: రాజీవ్, సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా పరిచయమైన సినిమా... బావుందా? సాగిందా?