Krishna Mukunda Murari Today Episode: ముకుంద, నందూలు కృష్ణని శోభనానికి రెడీ చేస్తారు. రేవతి దగ్గరుండి చూస్తూ మురిసిపోతుంది. ముకుందలో మార్పు వచ్చిందని.. అనుమానించాల్సిన అవసరం లేదని అనుకుంటుంది. కృష్ణని అంత అందంగా రెడీ చేసినందుకు ముకుందకు రేవతి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటుంది. 


ముకుంద: వద్దు అత్తయ్య నాకు దయచేసి థ్యాంక్స్ చెప్పకండి.. ఇది నా ప్రాయశ్చిత్తంలో భాగం. నేను చేసిన వాటికి పరిహారంగా కృష్ణ, మురారిలకు జీవితాంతం సేవలు చేస్తూ గడిపేస్తాను.
రేవతి: ఆ మాట చాలమ్మా.. అవును మీ చిన్నమ్మ ఎక్కడ కృష్ణ.
కృష్ణ: తెలీదు.. అవుట్ హౌస్‌లో ఉండినట్లుంది. 
రేవతి: ముకుంద నువ్వు వెళ్లి చిన్నమ్మని తీసుకొస్తావా.. కృష్ణ ఈ క్షణం వరకు ముకుంద మారింది అని నేను నమ్మలేదు.
కృష్ణ: లేదు అత్తయ్య ముకుంద మారిపోయింది. తప్పు చేశాను అన్న అపరాధభావం తనలో స్పష్టంగా కనిపిస్తుంది. మీరు దాని గురించి ఏం ఆలోచించకండి.. 


గౌతమ్: అల్‌ ది బెస్ట్ మురారి.. ఇది సమయం సందర్భం కాకపోయినా నేను ఓ విషయం చెప్పాలి. మీరిద్దరూ మా పెళ్లి చేయడానికి ఎంతో కష్టపడ్డారు. మీ పెద్దమ్మని ఎదురించి మరీ మా పెళ్లి చేశారు. కానీ మీరు సమస్యల్లో ఉన్నప్పుడు మేం మాత్రం ప్రేక్షకుల్లా ఉండిపోయాం. 
మురారి: ఇప్పుడు అవన్నీ ఎందుకు మీ అందరి సపోర్ట్ వల్లే ఇక్కడి వరకు వచ్చాను.
మధు: బ్రో ముహూర్తం టైం అవుతుంది. ముచ్చట్లు పెట్టుకునే టైం కాదు. తెల్లారాక మాట్లాడుకుందామే.. మురారి వెళ్లు. 


మురారి తన గదిలోకి వెళ్లి డెకరేషన్ చూసి చాలా సంబరపడిపోతాడు. మరోవైపు కృష్ణని తీసుకొని రేవతి వాళ్లు వస్తారు. కృష్ణని చూసి భవాని హ్యాపీగా ఫీలవుతుంది.   కృష్ణ భవాని కాళ్లకు దండం పెడితే నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అంటుంది. ఇక కృష్ణ ముకుంద గురించి అడుగుతుంది. ముకుంద ఓ మూలన ఏడుస్తుండటం కృష్ణ చూస్తుంది. 


నందూ: నువ్వు వెళ్లు కృష్ణ మేం మాట్లాడుతాం.
కృష్ణ: ముకుంద బాధ పడుతుంది. ఈ బాధ ఎటుదారితీస్తుందో.. తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో.. నేను అందుకే ఏసీపీ సార్‌కి ముహూర్తం పెట్టొద్దని చెప్పాను. లేదు చిన్నత్తయ్య నేను ఏసీపీ సార్ దగ్గరకు వెళ్లను. 
సుమలత: నువ్వేం మాట్లాడుతున్నావ్ కృష్ణ నీకేమైనా పిచ్చా.
భవాని: ఏమైంది ఎందుకు ఆగారు.. 
కృష్ణ: మధు వెళ్లి ఏసీపీ సార్‌ని పిలుచుకురా.. అత్తయ్య నన్ను క్షమించండి.. 
భవాని: ఏమైంది కృష్ణ. ఏంటీ పిచ్చి మాటలు.. 
కృష్ణ: ముకుంద ఏడుస్తుంది చూడండి.. ఎదుటివాళ్ల దురదృష్టంలో అదృష్టాన్ని వెతుక్కోవడం కరెక్ట్ కాదు అత్తయ్య. ఏసీపీ సార్ ఇలాంటి పరిస్థితుల్లో ముకుందని అలా వదిలిపెట్టి మనం సంతోషంగా ఉండటం ఎంత వరకు కరెక్ట్. 
భవాని: రేవతి ఆవిడగారి బాధ ఏంటో కనుక్కో. 
కృష్ణ: వద్దు అత్తయ్య.. ఆ బాధ ఏంటో మనందరికీ తెలుసు. వెళ్లి కనుక్కుంటే గాయం రేపడమే తప్ప మానదు. శోభనం మానేస్తాను.. 
భవాని: మురారి ఏంటీ ఇదంతా.. శుభమా అని కార్యం జరుతుంటే ఎవరో బాధ పడతారని మీరు..
మురారి: నిజమే పెద్దమ్మా.. అప్పటికీ కృష్ణ చెప్తునే ఉంది. శోభనం జరిగితే ఏం అవుతుందా అని. నేనే వినకుండా తన నోరు మూయించాను. ఆదర్శ్ వచ్చాక అన్నీ సర్దుకుంటాయి. 
భవాని: వద్దు వాడిని తీసుకురావొద్దు. వాడు వస్తే అన్నీ సర్దుకుంటాయి అనే నమ్మకం నాకు లేదు. అదే మీరు పరిష్కారం అనుకుంటే ఇది ఆపాల్సిన పని లేదు.
కృష్ణ: ఉంది పెద్దత్తయ్య కచ్చితంగా ఉంది. మనమందరం రొటీన్ జీవితాల్లో పడిపోతే ఇక ముకుంద గురించి ఆలోచించేది ఎవరూ.. 
రేవతి: కృష్ణ మేం ఆలోచిస్తాం కదా మీరు వెళ్లండి..
కృష్ణ: ఇంత కాలం ఆలోచించాం కదా వచ్చాడా.. కొన్నాళ్లు మనం అంతా వెతికాం ఇక రాడు అనుకొని కాలం గడిపేస్తున్నాం. కానీ ఇప్పుడు ఆదర్శ్ రావాల్సిన అవసరం ఉంది. ఆదర్శ్ రాక మీదే మా జీవితాలు ఆధారపడి ఉన్నాయ్. అలా ఎందుకు మీరు ఆలోచించడం లేదు మీరు. చూడండి పెద్దత్తయ్య ఈరోజు ఇది జరిగిపోతే నిజంగా చెప్తున్నా నేను కూడా ఆదర్శ్‌ గురించి ముకుంద లైఫ్‌ గురించి ఇంత సీరియస్‌గా ఆలోచించలేను. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్.
భవాని: సరే మీ ఇష్టం. కానీ ఒక్క విషయం ఆదర్శ్ వచ్చాక అయినా అప్పుడు ఎదురయ్యే పరిణామాల పూర్తి బాధ్యత నీదే. ఇక నీ ఇష్టం.
కృష్ణ: అలాగే పెద్దత్తయ్య.


ముకుంద: కృష్ణ నువ్వేంటి ఇక్కడ.. 
కృష్ణ: నేను ఏసీపీ సార్‌కి వద్దు అని చెప్పాను. ఆదర్శ్ వచ్చాకే ముహూర్తం అని చెప్పాను. కానీ అత్తయ్య వాళ్లు వినలేదు. ఇలా మేం సంతోషంగా ఉంటే నీకు ఆదర్శ్ గుర్తొస్తాడు అని తెలుసు. మనసు పాడు అవుతుంది అని తెలుసే అత్తయ్య వాళ్లతో వద్దు అన్నాను ముకుంద. 
ముకుంద: నా బాధలకు మీ సంతోషాలను బలిపెట్టడం ఏంటి కృష్ణ. పద వెళ్దాం. 
కృష్ణ: మేమేం బలిపెట్టడం లేదు ముకుంద. ఎదుటి వాళ్ల సంతోషంలో నేను పాలు పంచుకోకపోయినా. బాధలో మాత్రం పంచుకుంటా ముకుంద.
ముకుంద: వద్దు కృష్ణ ప్లీజ్. నా మాట విను. దయచేసి ఈ ముహూర్తాన్ని వాయిదా వేయొద్దు. నీకు దండం పెడతాను.
కృష్ణ: వద్దు ముకుంద నేను ఏసీపీ సార్‌కి అత్తయ్యకి ముందే చెప్పేశాను. ఆదర్శ్ వచ్చాకే.. నీ జీవితానికి అర్థం పరమార్థం ఆదర్శ్ అప్పుడే ఈ ఇళ్లు కలకల్లాడుతుంది. ఇది నీకే కాదు మనందరకీ మంచిది. ముఖ్యంగా మనద్దరి జీవితాలకు చాలా మంచిది. ఆదర్శ్‌ని తెచ్చే వరకు ముహూర్తం పెట్టనివ్వను. 


కృష్ణ: ఉదయం పడుకున్న మురారిని చూస్తూ.. సారీ ఏబీసీడీల అబ్బాయ్ నిన్ను చాలా డిసప్పాయింట్ చేశాను. నిజానికి మీరంతా ముకుంద పెద్ద అడ్డంకి అనుకుంటున్నారు. కానీ మీకు తెలీదు ఏసీపీ సార్ అలాంటి సమస్య సాల్వ్ చేయకపోతే దాని ప్రభావం మన ఫ్యామిలీ మొత్తం మీద పడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి అనుకుంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  
 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్ జనవరి 17th: టైలరింగ్ మానేస్తానని మాటిచ్చిన సీత, కోడలికి చుక్కలు చూపిస్తానన్న మహాలక్ష్మి