Krishna Mukunda Murari Today Episodes: ఆదర్శ్ ముకుందతో కశ్మీర్ వెళ్లిపోదాం అని చెప్తాడు. ఎందుకు అని ముకుంద అడిగితే మనం అక్కడికి కచ్చితంగా వెళ్లాలి అని అంటాడు. దానికి ముకుంద అత్తయ్య మిమల్ని ఇక్కడే ఉండమన్నారు కదా అని అంటుంది. ఇక ఆదర్శ్‌ అమ్మ వచ్చిన తర్వాతే వెళ్దామని అంటాడు. ముకుంద షాక్ అవుతుంది. 


ఆదర్శ్‌:  నువ్వు అక్కడికి రావాలి ముకుంద. అక్కడున్న ప్రశాంతత చూస్తే నువ్వు అస్సలు వదిలిపెట్టవు. 
ముకుంద: మనసులో.. నా మురారి ఉన్న చోటే నాకు ప్రశాంతత. మురారి లేని చోట స్వర్గమైనా సరే ప్రశాంతత ఉండదు. అక్కడ ఉంటే బాగుంటుంది కానీ ఇక్కడ ఇంత మంచి ఇళ్లు అయిన వారిని వదిలేసి ఎక్కడికి వెళ్తాం ఆదర్శ్‌. పైగా అక్కడ మీకు జాబ్ కూడా లేదు కదా.. అత్తయ్య వచ్చాక ఇక్కడే ఏదో వ్యాపారం చేసుకుందా.
ఆదర్శ్‌: అదేదో అక్కడే చేసుకుందాం ముకుంద దాని గురించి నువ్వేం వర్రీ కాకు. 
ముకుంద: రోజు రోజుకు ఎక్కువ ఊహించేసుకుంటున్నారు. లాభం లేదు టైం చూసుకొని నిజం చెప్పాల్సిందే. ఆదర్శ్‌ని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లి నిజం చెప్పేయాలి. 
కృష్ణ: ఏసీపీ సార్ మా చిన్నమ్మ దగ్గరకు వెళ్దామా.. 
మురారి: ఇప్పుడా..
కృష్ణ: రేపు పొద్దున్న.
మురారి: రేపు ఆలోచిద్దాం లే.
కృష్ణ: ఏంటి మీ వాళ్ల దగ్గరకు అంటే పరుగెత్తుకుంటూ వెళ్తారు. అదే మా వాళ్ల దగ్గరకు అంటే ఆలోచిద్దాం అంటున్నారు. చూశారా నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు మీ పాటికి ఏదో వెతుకుతున్నారు.
మురారి: అవును కర్ర ఏమైనా దొరుకుతుందా నిన్ను చితక్కొడదామని వెతుకుతున్నా. నువ్వు ఎక్కడికైనా వెళ్దామంటే నేను వద్దు అంటానా.. అందుకే పొద్దున్న అలా వెళ్లిపోదాం అని దాని గురించి ఆలోచించొద్దు అన్నా.. దానికి ఇంత రాదాత్తం చేస్తున్నావ్. అందుకే నిన్ను తింగరి అనేది.  
కృష్ణ: ఇదిగో ఇలా అన్నారు అంటే ఇప్పుడే పెద్దత్తయ్యకి కాల్ చేస్తా.. పదిరోజులు కాదు మరో నెల రోజులు మన శోభనం ఆపమని చెప్తా.
మురారి: నీకు దండం పెడతానే అంత పని చేయకు. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడిన సివిల్ కేసులా అయిపోయింది మన శోభనం. 
కృష్ణ: అది అలా రండి నా దారికి. 


ఉదయం అందరూ హాల్‌లో కూర్చొని ఉంటే కృష్ణ భవాని ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని వచ్చి అందరి ముందు ఓపెన్ చేస్తుంది. అందులో పాల పీక పెట్టుకున్న ఓ పాప బొమ్మ ఉంటుంది. అది చూసి కృష్ణ ఎమోషనల్ అవుతుంది. దానితో పాటు ఓ లెటర్ కూడా ఉంటుంది. దాన్ని మురారి చదువుతాడు. అందులో తింగరి నీలో ఒక అమ్మ ఉంది. నువ్వు నిజంగా అమ్మవైతే చూడాలి అని ఉంది.. అలాగే నేను వెళ్లాక ఈ ఇంటికి జడ్జివి నువ్వే. నా బాధ్యతలు అన్నీ నువ్వే తీసుకోవాలి. నేను తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ ఒక  అమ్మలా నువ్వే పరిష్కరించాలి. ఇట్లు నీ పెద్దత్తయ. అని రాసి ఉంటుంది.  


కృష్ణ: అయినా ఇది నా ఒక్కదానికే కాదు ముకుందకు కూడా. 
ముకుంద: మళ్లీ నా దగ్గరకు వచ్చింది ఇలాగే ఉంటే వెంటనే శోభనం అని పిల్లల్ని కనమనేలా ఉన్నారు. ఇంక ఆలస్యం చేయకూడదు. వెంటనే ఆదర్శ్‌కి నిజం చెప్పాలి. బయటకు వెళ్లేలా ప్లాన్ చేయాలి.
కృష్ణ: ముకుంద ఏం ఆలోచిస్తున్నావ్.. అత్తయ్య మన ఇద్దరి దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో అర్థమవుతుందా.
ముకుంద: అర్థమవుతుంది కానీ అత్తయ్య ఇది నీకోసం రాసింది తింగరి. ముందు నువ్వే బిడ్డను కని ఇవ్వాలి. 
కృష్ణ: ఏమన్నావ్.. 
ముకుంద: మీరే ముందు బిడ్డను కనిఇవ్వాలి అన్నాను.
కృష్ణ:  దాని కంటే ముందు.
ముకుంద: తింగరి అన్నాను.
కృష్ణ: అత్తయ్య విన్నారా.. నన్ను ఇంత ప్రేమగా ఫస్ట్ టైం పిలిచావ్. అంటే ప్రేమ లేదు అని కాదు. నీలో మార్పు వచ్చింది అనడానికి ఇదే నిదర్శనం. 
ముకుంద: సరే గానీ అత్తయ్య వచ్చే వరకు నీదే ఈ ఇంటి బాధ్యత కాబట్టి నిన్ను ఓ మాట అడగనా. ఆది వచ్చాక మన నలుగురం కలిసి ఎక్కడికైనా ట్రిప్‌కి వెళ్తే బాగున్ను అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు వెళ్దామా. 
కృష్ణ: తప్పకుండా వెళ్దాం ముకుంద.. అత్తయ్య రేపు ఉదయం వెళ్లి ఒకరోజు ఉండి వచ్చేస్తాం.
రేవతి: ఒకరోజు కాకపోతే నాలుగు రోజులు ఉండండి. 
ఆదర్శ్‌: నాతో కలిసి కశ్మీర్ వెళ్లడం ఇష్టం లేదు అంది. ఇప్పుడేంటి ట్రిప్ అంటోంది. ముకుంద మనసులో నిజంగానే నాకు చోటు ఉందా.. 


కృష్ణ: పెద్దత్తయ్యకి నేను అంటే ఎంత ప్రేమ ఏసీపీ సార్. ఇంట్లో ఇంత మంది ఉండగా నాకు పెత్తనం అప్పగించింది. వారసుల్ని ఇమ్మని ఇదిగో ఈ పాపాయి బొమ్మని ఇచ్చింది.
మురారి: ఆ బొమ్మ తీసుకొంటే సరిపోదు. పెద్దమ్మ మన మీద పెట్టుకున్న ఆశలన్నీ తీర్చాలి.
కృష్ణ: ఎందుకు తీర్చను. చూశారా ఇంటిని ఎంత చక్కగా చూసుకుంటున్నానో.
మురారి: నువ్వు తింగరివి కాదు అనుకునే లోపు కాదు తింగరివే అని ఫ్రూవ్ చేస్తావ్. వారసుల్ని ఇమ్మని ఇంత పెద్ద బొమ్మని ఇస్తే అది వదిలేసి బాధ్యతలు అంటున్నావ్. నీకు పెత్తనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంటిని బాగానే చూసుకుంటావ్. అది కాదు కదా.. అసలు మ్యాటర్‌లోకి రా.. పాపని ఇవ్వడం గురించి ఆలోచించు. అంటూ మురారి కృష్ణతో రొమాంటిక్‌గా మాట్లాడుతాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read:  'త్రినయని' సీరియల్ ఫిబ్రవరి 16th: విశాలాక్షికి పాలాభిషేకం చేసిన ఉలూచి.. కూతురికి విషం పెట్టేందుకు సిద్ధమైన సుమన!