పెళ్లి మండపానికి కూడ బయల్దేరుతున్నారు కృష్ణకి ఇచ్చిన మాట తప్పినట్టే గౌతమ్ మొహం ఎలా చూడాలని మురారీ మనసులో అనుకుంటూ ఉండగా భవానీ వస్తుంది. పెళ్లి కొడుకు వాళ్ళు రాగానే మర్యాదలు చెయ్యి టైమ్ కి నేను నందిని తీసుకుని వస్తానని చెప్తుంది. అప్పుడే కృష్ణ రావడం చూసి తనకి ఏమి తెలియకూడదని అంటుంది. కృష్ణ వచ్చి ఏమి తెలియనట్టు కంగారుగా కనిపిస్తున్నారని మురారీని అడుగుతుంది. కావాలని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. కృష్ణ కావాలని మన పని డిస్ట్రబ్ చేయాలని వచ్చిందని ముకుంద అనేసరికి మురారీ అడ్డుపడతాడు. పెద్దత్తయ్య ఏసీపీ సర్ కి పని అప్పగిస్తే మరి నువ్వు ఎందుకు పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్తున్నట్టని కౌంటర్ వేస్తుంది. మీ పని మీద మీరు వెళ్ళండి నా పని మీద నేను వెళ్తాను ఎవరి పని ముందు అవుతుందో మధ్యలో నేను ఎందుకు ఆగిపోయే పెళ్ళికి భాజాల్లాగ అని సెటైర్ వేస్తుంది. వెళ్తూ వెళ్తూ కృష్ణ భవానీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది.


Also Read: ఆట మొదలెట్టిన రాజ్యలక్ష్మి- కండిషన్లు పెట్టి దివ్య, తులసిలను కలవకుండా చేసేసింది


కృష్ణ మాటల్లో చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడింది పెళ్లి విషయం తెలిసిపోయిందా ఏంటని భవానీ అనుమానపడుతుంది. నందినికి వేరే వాడితో పెళ్లి చేస్తున్నామని తెలిస్తే అసలు ఊరుకోదు రచ్చ రచ్చ చేస్తుందని ఈశ్వర్ సర్ది చెప్తాడు. కృష్ణ ఇంకా రాలేదని గౌతమ్ టెన్షన్ పడతాడు. ఇప్పుడు కృష్ణ రాలేదంటే రానివ్వడం లేదేమోనని గౌతమ్ ఫ్రెండ్ అంటాడు. ఇందులో కృష్ణమ్మని ఇన్వాల్వ్ చేసి చాలా పెద్ద తప్పు చేశానని భయపడతాడు.  మురారీ, ముకుంద కారుని కృష్ణ ఆటోలో ఫాలో అవుతుంది. దారి మధ్యలో మరొక కారు అడ్డం రావడంతో మురారీ వాళ్ళని కృష్ణ మిస్ అవుతుంది. కారు ఎటుపోయింది ఇప్పుడు ఏం చేయాలని కృష్ణ టెన్షన్ పడుతుంది. నందినిని ఎక్కడ దాచారని మురారీ ముకుందని అడుగుతాడు. తనకి తెలియదని చెప్తుంది. కృష్ణకి ఇచ్చిన మాట తప్పితే జీవితాంతం తనని ఫేస్ చేయగలనా అని మురారీ అనుకుంటాడు. నందినికి పెళ్లి చేయడం నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది.


మురారీ డల్ గా ఉండటం చూసి ఏమైందని పదే పదే అడుగుతుంది కానీ చెప్పకుండా వెళ్ళిపోతాడు. కృష్ణ ఒక్కతే గౌతమ్ దగ్గరకి వస్తుంది. హాస్పిటల్ లో ఉండకుండా భాను సర్ ఇంట్లో ఉన్నారు ఏంటని కృష్ణ గౌతమ్ ని అడుగుతుంది. వాళ్ళు మనుషులను తీసుకొచ్చి కొట్టి పడేస్తారని సేఫ్టీ కోసం ఇక్కడికి వచ్చానని చెప్తుంది. ఏసీపీ నందిని పెళ్లి జరిగే కళ్యాణ మండపంలో ఉన్నాడని చెప్పేసరికి గౌతమ్ షాక్ అవుతాడు. పెద్దత్తయ్య నందిని పెళ్లి ఏసీపీ సర్ చేతుల మీదుగా జరిపిస్తుంది. ఆ పెళ్లి ఆయనే చేయాలని మాట తీసుకుందని అనేసరికి కూలబడిపోతాడు. ఏది ఏమైనా నందిని పెళ్లి మీతోనే జరిపిస్తానని కృష్ణ కాన్ఫిడెంట్ గా చెప్తుంది. ఇన్నాళ్ళూ ఒంటరిగానే ఉన్నా ఇప్పుడు అలాగే ఉంటాను నువ్వు నా వల్ల ఇబ్బందుల్లో పడొద్దు వదిలేయమని చెప్తాడు. కానీ కృష్ణ మాత్రం నందిని పెళ్లి జరుగుతుంది కానీ వాళ్ళు చెప్పిన పెళ్లి కొడుకుతో కాదు మీతోనని ధైర్యం చెప్తుంది.


Also Read: అదిరిపోయే ట్విస్ట్, సూసైడ్ చేసుకోబోయిన స్వప్న- కావ్యకి మరొక అవకాశం ఇచ్చిన రాజ్


భవానీ వాళ్ళు పెళ్లి మండపానికి చేరుకుంటారు. కృష్ణకి మాత్రం తెలియకూడదని అంటారు. నందిని ఎక్కడని మురారీ అడిగితే తన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉందని ముహూర్తం టైమ్ కి వచ్చేస్తుందని భవానీ మురారీకి చెప్తుంది. అప్పుడే కిరణ్ అమ్మానాన్నని తీసుకుని మండపానికి వస్తారు. టైమ్ దగ్గరపడుతుంది కృష్ణ నాకోసం ఎదురు చూస్తుంది ఏం చేయాలా అని టెన్షన్ పడతాడు.