Karthika Deepam September 16th Episode 1460 (కార్తీకదీపం సెప్టెంబరు 17 ఎపిసోడ్)
ఎపిసోడ్ ప్రారంభంలోనే దీప..వాళ్ల అన్నయ్య ఇంటికి పరిగెత్తుకువస్తుంది.
అన్నయ్య: ఇదేంటమ్మా మందుకోసం వెళ్లాలి అన్నావ్..
దీప: అదంతా మోసం అన్నయ్యా..ఇదంతా మోనిత నాటకం..ఆటో డ్రైవర్ అక్కడ అలాంటి ఆశ్రమం లేదని చెప్పాడు. ఈ నాటకం ద్వారా నన్ను ఎక్కడికైనా పంపించేసి..డాక్టర్ బాబుని తీసుకెళ్లిపోయేందుకు ప్లాన్ చేసినట్టుంది
అన్నయ్య: ఇదేనా..ఇంకేమైనా ప్లాన్ ఉందా...
డాక్టర్ అమ్మ: నువ్వెళ్లు..అస్సలు ఇల్లు కదలొద్దు..
శివని పిలిచిన మోనిత... నేను వెళ్లొస్తాను నువ్వు కార్తీక్ ని జాగ్రత్తగా చూసుకో అంటుంది.
శివ: మీరు అస్సలు సార్ ని వదిలి ఉండలేరు కదా... సార్ ని కూడా తీసుకెళ్లొచ్చు కదా
మోనిత: ఎవరికో ఫోన్ చేసి నాకు ఒక కొత్త డ్రైవర్,అసిస్టెంట్ కావాలి...ఇప్పుడున్న వాడు ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు అని మాట్లాడుతుంది.
వెంటనే శివ...మోనిత కాళ్లు పట్టుకుని ఇంకెప్పుడూ అడగను మేడం అని బతిమలాడుతాడు. మోనిత వెళ్లిపోతుంది.
శివ: సార్ ని తీసుకెళ్లమంటే ఇలా మాట్లాడారేంటి...ఏదైనా మేడమే తేడా..వంటలక్కే బెటర్ ఒక మాట మీద నిలబడుతుంది
Also Read: వారంలో కథ ముగించేస్తానన్న దీప, వెయిటింగ్ అన్న మోనిత - ఇకపై గతం గుర్తుచేసుకునేదే లే అన్న కార్తీక్
ఇంద్రుడు తీసుకొచ్చిన సరుకులన్నీ చూసిన శౌర్య..హోటల్ పెడుతున్నారా ఏంటి అంటుంది. లేదమ్మా పక్కింటికి బంధువులు వచ్చారట.భోజనాలకి అడిగారు అని అంటుంది శౌర్య వాళ్ళ పిన్ని. అప్పుడు శౌర్య,డబ్బులు ఇస్తారు కదా అని అడుగుతుంది. ఇస్తారమ్మా కానీ ఇంత అని ఏమీ అనుకోలేదు, వాళ్ళు ఎంత ఇస్తే అంతా అని అంటుంది. మా అమ్మ కూడా అంతే అంటుంది. అంతేనమ్మా మంచోళ్లను ఎప్పుడూ దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతాడు అంటుంది. అప్పుడు శౌర్య ...వంటలక్క రాసిన సరుకుల లిస్ట్ చూస్తుంది. ఇందాక నువ్వు ఒకరితో ఫోన్లో మాట్లాడావు కదా ఆవిడదే అమ్మ అని అంటాడు శౌర్య వాళ్ళ బాబాయ్.
శౌర్య: నేను చెప్పాను కదా బాబాయ్, ఆవిడ మా అమ్మ గొంతులాగే ఉందని...ఇది మా అమ్మ చేతిరాతే.అమ్మ కచ్చితంగా ఇక్కడ ఉంది. ఎలాగైనా అమ్మని వెతకాలి అనుకుంటుంది.
సౌందర్య ఆనంద్ రావు, హిమ కారులో వెళతారు...
ఆనందరావు: మోనిత ఆనంద్ ని మన దగ్గర వదలకుండా అక్కడ ఎందుకు వదిలింది
సౌందర్య: మంచి పనులు చేస్తే అది మోనిత ఎందుకు అవుతుంది. అయినా మొన్న రెస్టారెంట్లో కలిసినప్పుడే అడుగుదాం అనుకున్నాను కానీ తనతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఆగిపోయాను
ఆనందరావు: అయినా మన మనవడు ఇంకొకళ్ల దగ్గర ఉండడం ఎందుకు తెచ్చేసుకుందాం
హిమ: లక్ష్మణ్ అంకుల్ ఒప్పుకుంటారా
సౌందర్య: వాడెలా ఒప్పుకొడో నేను చూస్తాను నువ్వేం భయపడొద్దు మనం ఆనంద్ నీ తీసుకొద్దాం
ఆ తర్వాత సీన్లో మోనిత, లక్ష్మణ్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆనంద్ ని తీసుకొని వస్తుంది.
మోనిత: బాబుని చాలాబాగా చూసుకున్నారు...నేను తీసుకు వెళ్తున్నానని మీరు ఆస్తినేమీ తిరిగి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గరే ఉంచుకోండి
అరుణ: బాబుని వదిలి వెళ్ళడం మాకు చాలా బాధగా ఉంది..బాబే లేనప్పుడు మాకు ఆస్తి వద్దు
మోనిత: డబ్బు కన్నా బంధానికి అంత విలువ ఇస్తారా...ఆస్తిని వాళ్లకే వదిలేశాను కదా ఈ మంచిపనికైనా దేవుడు మమ్మల్ని చల్లగా చూస్తాడు. అప్పుడప్పుడు బాబుని ఇక్కడికి తీసుకు వస్తాను మీరు బాబు గురించి బెంగపడొద్దు అనేసి బాబుని తీసుకెళ్లిపోతుంది..
మోనిత అటు వెళ్లగానే సౌందర్య వాళ్లు వస్తారు...బాబు గురించి అడగడంతో లక్ష్మణ్, అరుణలు ఇలా జరిగిన విషయం అంతా చెప్తారు. మోనిత తీసుకువెళ్లిపోయిందా అని అనుకుంటుంది. అప్పుడు ఆనందరావు, పోనీలే సౌందర్య, మోనితే తీసుకెళ్లింది, లేకపోతే మనం తీసుకొద్దాం అనుకున్నాము అని అనగా సౌందర్య వాళ్ళతో,మళ్ళీ మోనిత ఇటు వైపు వచ్చిన, ఆనంద్ ని తెచ్చినా మాకు వెంటనే చెప్పండి అనేసి సౌందర్య వాళ్లు వెళ్లిపోతారు...
Also Read: అడ్డుతప్పుకో వసుధార అని రిషి ఆగ్రహం, జగతి-మహేంద్ర పెళ్లిరోజు వేడుకలో ఏం జరిగింది!
మోనిత అటు వెళ్లగానే దీప ఆ ఇంటికి వెళుతుంది. ఇంట్లోంచి ఎవరూ రావడం లేదు పోవడం లేదు..డాక్టర్ బాబుని తీసుకెళ్లిపోయిందా అని టెన్షన్ పడుతుంటుంది. లోపల కార్తీక్ పాత పాటలు పాడుతూ ఉంటాడు. అప్పుడు శివ, సార్ మీకు గతం మర్చిపోయిన సరే పాత పాటలు బాగా గుర్తున్నాయి అని అంటాడు. మొన్న విన్నాను లేరా అని కార్తీక్ అనగా లేదు సార్ మేడం వెళ్లిపోయిన ఆనందంలో మీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి అని అంటాడు శివ.
కార్తీక్: శివ నీ చెంప మీద కొట్టి, మేడం వెళ్ళిపోతే హ్యాపీగా ఉన్నానని చెప్పానా...నీలాంటి వాళ్ల వల్లే భార్యభర్త మధ్య గొడవలు వస్తాయి
శివ: మేడం తిట్టిన విషయం మర్చిపోయారా..లేదా మేడంపై కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందా...
ఇంతలో దీప రావడంతో...లోపల ఎవలు లేరు ఆగు అంటాడు.. డాక్టర్ బాబు లోపల ఉన్నారుకదా నువ్వెళ్లొద్దు..
దీప: నేను వచ్చింది డాక్టర్ బాబు కోసం కాదు..మీ మేడం కోసమే..
శివ: మేడం లేరు
దీప: బయటకు ఎక్కడికో వెళ్లారు వెయిట్ చేస్తానులే అంటుంది...
అప్పుడు శివ అసలు విషయం చెబుతాడు...
అది ఏదో పనిఉండి చెన్నై వెళ్లింది..ఆ టైమ్ లో నేనిక్కడ ఉంటే డాక్టర్ బాబుకి దగ్గరవుతానేమో అనే ఇలా చేసింది.. నన్ను రెచ్చగొట్టావ్ కదా.. చూస్తుండు అనుకుంటుంది దీప...
ఎపిసోడ్ ముగిసింది....