గుప్పెడంత మనసు  శుక్రవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu September 16 Today Episode 557)


నాలుగైదు రోజులుగా జగతి-మహేంద్ర పెళ్లిరోజు హడావుడి నడుస్తోంది. జగతి పేరెత్తితేనే మండిపడే రిషి ఎట్టకేలకు వసుధార మాట విని తల్లిదండ్రుల పెళ్లిరోజు ఇంట్లో సెలబ్రేట్ చేసేందుకు ఒప్పుకుంటాడు. గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాడు. ఈ సంతోషంలో వసుధార హగ్ చేసుకుని మరీ థ్యాంక్స్ చెబుతుంది. ఆ తర్వాత ఫంక్షన్ హాల్లోకి వచ్చిన రిషి...నేరుగా తన పెద్దమ్మ దేవయాని దగ్గరకు వెళ్లి నువ్వు భోజనం చేయి పెద్దమ్మా..ఇదంతా జరిగిందంటే నీవల్లే అంటాడు. ఆ తర్వాత దేవయాని ఏ కుట్ర చేసిందో...రిషికి తెలియ కూడదని విషయం ఏదైనా తెలిసిందో కానీ ఒక్కసారిగా అందరిపై ఫైర్ అవుతాడు రిషి. దేవయాని ఏదో చెప్పేందుకు ప్రయత్నించినా మీరు మాట్లాడొద్దు పెద్దమ్మా అని కోపంగా  అనేసి అక్కడినుంచి వెళ్లిపోతుంటాడు. జగతి-మహేంద్ర చూస్తూ నిల్చుండిపోతారు. ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్ అని వసుధార ఎంత అడిగినా..అడ్డుతప్పుకో వసుధార అంటాడు.  






Also Read: వారంలో కథ ముగించేస్తానన్న దీప, వెయిటింగ్ అన్న మోనిత - ఇకపై గతం గుర్తుచేసుకునేదే లే అన్న కార్తీక్
జరిగిన కథ
రిషి ఇచ్చిన చీరకట్టుకుని అద్దంలో చూసుకుని మురిసిపోతున్న వసుధార దగ్గరకు వస్తాడు రిషి.
రిషి: ఈ రోజు నేను కాఫీ కి దూరంగా ఉంటాను,మళ్ళీ నువ్వు కాఫీ ఒంపితే డ్రెస్ మార్చే ఓపిక నాకు లేదు
వసు: సారీ సార్ ..ఆ డ్రెస్ మీకు బాలేదు
రిషి: ఆ డ్రెస్ నచ్చకపోతే బాలేదు సార్ అని చెప్పు. అంతేగాని పొద్దు పొద్దున్నే వేడివేడి కాఫీతో నాకు స్నానం చేయించడం అవసరమా, నువ్వు  ఏ విషయం గురించీ మనసులో సంకోచిచకుండా నాకు చెప్పు. మన ఇద్దరి మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు, నాకు కోపం తెప్పించే పనులు ఏవి చెయ్యొద్దు, చేసినా నాకు ముందే చెప్పే ఓపెన్ గా..అప్పుడు మనకు గొడవలు రావు 
వసు: రిషిని చూస్తూ మైమరిచిపోయిన వసుధార...కళ్లలోకి చూస్తూ ఊ కొడుతుంది కానీ ఏమీ మట్లాడదు...
ఒకర్నొకరు చూసుకుని ఎక్కడున్నారో కూడా మర్చిపోతారిద్దరూ..అప్పుడే ఎంట్రీ ఇస్తుంది దేవయాని. ఇక్కడేం చేస్తున్నావ్ రిషి..ఇప్పుడు నీ డ్రెస్ చాలా బావుంది..ముందు వేసుకున్నలాంటి డ్రెస్సులు ఇంకెప్పుడూ వేసుకోవద్దని చెప్పి చేయిపట్టుకుని కిందుకు తీసుకెళ్లిపోతుంది. 


వసుధార-రిషిని చూసి జగతి-మహేంద్ర మురిసిపోతారు. వాళ్లిద్దరూ చిలుకా గోరింకల్లా ఉన్నారు కదా! మన పెళ్లి రోజులా లేదు, వాళ్ళిద్దరి పెళ్లిలా ఉందనుకుంటారు. వీళ్లను చూసి భరించలేకపోయిన దేవయాని...ఇప్పుడు నీ టైం నడుస్తోంది జగతి.. నా టైమ్ వస్తుంది అప్పుడు చెబుతానంటుంది. ఆ తర్వాత గౌతమ్ కేక్ తీసుకొస్తాడు... సంతోషంగా కేక్ కట్ చేస్తారు. మహేంద్ర ముందు జగతికి కేక్ తినిపించాలి అనుకుంటే..చేయిని రిషివైపు చూపిస్తుంది జగతి. రిషి మాత్రం ముందు ఆమెకే పెట్టమని మహంద్రకి చెబుతాడు. ఆ తర్వాత రిషి తండ్రికి కేక్ తినిపించి తల్లి చేతికి అందిస్తాడు..జగతి ఇచ్చిన కేక్ కూడా తీసుకుంటాడు.
 
Also Read: వసుధారకు చాలా చాలా ద గ్గ ర గా రిషి, ఈగోమాస్టర్లో మరో యాంగిల్!


జగతి పేరెత్తితేనే మండిపడే రిషి..ఇంత కూల్ గా ఉండడం చూసి వసుధార, గౌతమ్ సంతోషిస్తారు. వసు రిషికి సైగ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ పొగరు ఎక్కడుందో అని వెతుక్కుంటూ వెళతాడు రిషి. వెనుకనుంచే వచ్చి హగ్ చేసుకున్న వసుధార.. జగతి-మహేంద్ర సార్ ల పెళ్లిరోజు ఇంత బాగా చేసినందుకు కృతజ్ఞత సార్ అంటుంది. వీళ్లద్దరూ కనిపించడం లేదేంటని మహేంద్ర-జగతి-గౌతమ్ అనుకునేలోగా ఎంట్రీఇస్తారు ప్రేమ పక్షులు. అప్పుడు గౌతమ్ కూడా రిషిని హగ్ చేసుకుని చాలా థాంక్స్ రా నీ వల్లే అంకుల్,మేడంల పెళ్లిరోజు ఇలా జరిగిందంటాడు. ఇది నా బాధ్యత అని హుందాగా సమాధానం చెప్పిన రిషి..నేరుగా దేవయాని దగ్గరకు వెళ్లి పెద్దమ్మా మీరు ముందు భోజనం చేయండి. ఇదంతా జరిగిందంటే మీవల్లే అంటాడు. గురువారం ఎపిసోడ్ ఇక్కడే ముగిసింది..పైన పోస్ట్ చేసిన ప్రోమో...ఈ స్టోరీకి కొనసాగింపు..అంటే ఈ రోజు(శుక్రవారం) ప్రసారం కాబోయే ఎపిసోడ్ ది...