Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : న్యాయం చేస్తానని చెప్పి నర్సింహ ఇంటికి దీపని తీసుకెళ్లిన అనసూయ నట్టేట ముంచేస్తుంది. నర్సింహ రెండో భార్య శోభ ఆస్తి చూసి వాళ్లతో ఉండిపోవాలని దీపని ఇంటి నుంచి తరిమేస్తుంది. దీంతో దీప ఏడుస్తూ బయటకు వచ్చేస్తుంది.


దీప: ఏడుస్తూ.. ఇప్పటి వరకు భర్త చేతిలో మోసపోయిన భార్యగా మిగిలాను. ఇప్పుడు అత్త చేతిలో మోసపోయిన కోడలిని చేశావా అత్తయ్య. పురిట్లోనే తల్లి పోయింది. పెంచిన తండ్రి కూడా పోయాడు. ఆ రక్త బంధంలో మిగిలిన మీ ఇద్దరు కూడా నన్ను దూరం చేశారు. ఇప్పుడు నాకు నా కూతురు తప్ప మరెవరూ లేరు. ఇప్పుడు నేనేం చేయను. కూతుర్ని తీసుకొని ఊరు వెళ్లలేను. అలా అని ఆ ఇంటి వాళ్ల మీద ఆధారపడలేను. నా లాంటి బతుకు నా కూతురికి ఉండకూడదు అంటే నా కూతుర్ని  బాగా చదివించాలి. చదివించాలి అంటే నేను డబ్బు సంపాదించాలి. మళ్లీ చాలా రోజుల తర్వాత బతుకంటేనే భయంగా ఉంది. నాకు ఓ దారి చూపించు నాన్న అంటూ దీప ఏడుస్తుంది. 


ఇంతలో ఓ పెద్దాయన దీప దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. నువ్వు కూడా ఇక్కడికి బతకడానికి వచ్చావమ్మా అని అడుగుతాడు. దీంతో దీప రావడానికి కారణం వేరే ఉన్నా ఇప్పుడే నిర్ణయించుకున్నా ఇక్కడే బతకాలి అని అంటుంది. ఇక ఆయన దీపకు తాగడానికి నీరు ఇస్తాడు. 


దీప: బాబాయ్ నా బాధ నీకు కన్నీళ్లలో కనిపిస్తే నీ బాధ నాకు నీ మాటల్లో కనిపిస్తుంది. నువ్వు నాలాగే ఇక్కడికి వచ్చావా బాబాయ్. 


కడియం: వచ్చి చాలా రోజులు అవుతుంది. ఇక్కడ బతకలేం అని నాకు బాగా అర్థమైంది అందుకే వెళ్లిపోతున్నా. 


అతనికి దీప ఏమైందని అడిగితే.. తానో హోటల్ పెట్టుకున్నానని బాగా నడిచేది అని కానీ కరోనా తర్వాత పూర్తిగా నష్టం వచ్చిందని అంటాడు. అందుకే ఊరు వెళ్లిపోతున్నా అని చెప్తాడా పెద్దాయన. దీంతో దీప ఆయనను ఆపి తాను సాయం చేస్తాను అని అంటుంది. దీంతో కడియం సరే అంటాడు. దీపని తన హోటల్ దగ్గరకు తీసుకెళ్తాడు. 


కార్తీక్ శౌర్యతో ఆడుకుంటూ ఉంటాడు. ఇక అక్కడికి పారిజాతం, జ్యోత్స్న వస్తారు. చాక్లెట్ లాంటి మరదల్ని వదిలేసి నీ బావ చూడు ఆ పిల్లతో ఆడుకుంటున్నాడు అని పారిజాతం జ్యోత్స్నని రెచ్చగొడుతుంది. ఇక శౌర్య తన తల్లి ఇంకా రాలేదని కార్తీక్‌కు చెప్పుకొని బాధ పడుతుంది. నర్సింహను బూచోడు అనుకొని అతడు దీపని ఏమైనా చేస్తాడేమో అని భయపడుతుంది. ఇక పారిజాతం శౌర్య సంగతి తాను చూసుకుంటానని కార్తీక్‌ను తీసుకొని బయటకు వెళ్లమని జ్యోత్స్నకు సలహా ఇస్తుంది. 


ఇక జ్యోత్స్న కార్తీక్‌ను బయటకు రమ్మని పిలుస్తుంది. కార్తీక్ రాను అంటాడు. కానీ జ్యోత్స్న వదలదు. దీంతో సరే అంటాడు. ఇక శౌర్య నేను వస్తాను అంటే పారిజాతం ఆపి మనం ఆడుకుందామని అంటుంది. కార్తీక్ పారిజాతానికి జాగ్రత్తలు చెప్తాడు. ఇక పారిజాతం జ్యోత్స్నకు కన్ను కొడితే అది శౌర్య చూసేస్తుంది. జ్యోత్స్నని ఇలా అంటే ఏంటి అని కన్ను కొట్టడం గురించి అడుగుతుంది. దీంతో పారిజాతం నీతో జాగ్రత్తగా ఉండాలి అనుకొని కాసేపు శౌర్యతో ఆడుతుంది. 


దీప కడియం మూసేసిన బండి తీయిస్తుంది. టీ పెడుతుంది. కార్తీక్ జ్యోత్స్నలు కూడా అటుగా వస్తారు. ఇక జ్యోత్స్న కేఫ్‌కి వెళ్లి టీ తాగుదామని అంటుంది. దీంతో కేఫ్‌కి వెళ్తే మూడు గంటలు జ్యోత్స్న వదలదని తప్పించుకోవడానికి రోడ్డు సైడ్ వెరైటీగా టీ తాగుదామని అంటాడు. జ్యోత్స్న చీప్ అని తనకు వద్దు అనేస్తుంది. కార్తీక్‌నే తాగమని తనకు వద్దనేస్తుంది. సరే అని కార్తీక్ వెళ్తాడు. 


ఇక టీ కోసం ఆగిన కార్తీక్ ఆ షాపులో దీపని చూసి షాక్ అవుతాడు. కార్తీక్‌ని చూసిన కడియం మొదటి కస్టమర్ వచ్చేశాడని అంటాడు. దీప కూడా షాక్ అయిపోతుంది. కార్తీక్‌కి టీ చేసి దీప ఇస్తుంది. కడియం టీ ఎలా ఉందని అడిగితే కొత్తగా ఉంది చాలా బాగుందని కార్తీక్ చెప్తాడు. దీంతో కడియం దీపమ్మా మనం పాస్ అయ్యామని అంటాడు. 


మరోవైపు కార్తీక్ ఇంకా రావడం లేదని జ్యోత్స్న కార్తీక్‌ని పిలుస్తూ దీపని చూస్తుంది. దీప ఇక్కడ ఉంది ఏంటా అని అనుకుంటుంది. 


జ్యోత్స్న: మనసులో.. నీకు టీ తాగాలని అనిపించడానికి కారణం అర్థమైందని బావ. కారులో నన్ను కూర్చొపెట్టి నువ్వు దీపతో కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతున్నావా. నేనంటే నీకు మరీ ఇంత నిర్లక్ష్యమా.. అంటే దీపకు ఉన్న విలువ కూడా నాకు లేదా.. 


కార్తీక్: రౌడీ ఇంటి దగ్గర మీ గురించి భయపడుతుందండి. ఇంటికి రండి.


దీప: మీరు వెళ్లండి నేను వస్తాను. 


కార్తీక్: ముందు మీరు రండి చెప్తాను. 


దీప: కడియం బాబాయ్ నేను మళ్లీ వస్తాను. మీరు ఎక్కడికి వెళ్లిపోవద్దు. నేను వెళ్లిపోతున్నా అనుకొని మళ్లీ రాను అనుకోవద్దు. మనం టిఫెన్ సెంటర్ నడిపిస్తున్నాం. నేను మీ దగ్గర పని చేస్తున్నాను అంతే. 


ఇక కార్తీక్‌ మొదటి బోని అని దీపకు డబ్బులు ఇస్తాడు. ఇక కార్తీక్ దీపని తీసుకొని వస్తాడు. కారు దగ్గరకు వచ్చేసరికి జ్యోత్స్న కనిపించదు. కార్తీక్ కాల్ చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడో పూర్తవుతుంది. 


AlSO Read: నాకు 16 ఏళ్లు ఉన్న‌ప్పుడే న‌న్ను క‌మిట్ మెంట్ అడిగారు: వితిక షేరు