Trinayani Today Episode  : తిలోత్తమ, వల్లభలు అఖండ స్వామి దగ్గరకి వస్తారు. వల్లభ కంగారు చూసి అఖండ స్వామి ఏమైందని ప్రశ్నిస్తారు. దీంతో తిలోత్తమ గుర్రపు కొండ నుంచి పార్సిల్ వచ్చిందని అందులో రెండు గుర్రం కాళ్లు ఉన్నాయని చెప్తుంది.  


అఖండ: నీ కోసం పంపించారా?


వల్లభ: ఆ గుర్రం కాళ్లు మా మమ్మీ ఆడుకోవడానికి కాదు స్వామి.. మా మమ్మీతోనే ఓ ఆట ఆడుకోడానికి ఎవరో వాటిని పంపించారు.


తిలోత్తమ: ఎవరు పంపించారు  అన్నది నాకు తెలియాలి స్వామి.


అఖండ: నీ శత్రువులు అయి ఉంటారు.


వల్లభ: అంతే కాదు స్వామి అందులో లెటర్ కూడా రాశారు. 22 ఏళ్ల క్రితం ఏం జరిగిందో అదే మళ్లీ రిపీట్ అవ్వబోతుందంట. 


అఖండ: నువ్వు చేసిన పాపమే మళ్లీ నీకు జరగబోతోంది తిలోత్తమ.


వల్లభ: ఏం చేశావ్ అని మా మమ్మీని అడుగుతుంటే చెప్పుకోలేనని అంటుంది స్వామి.


అఖండ: చెప్పుకోలేదులే వల్లభ. 


వల్లభ: మరి నేను ఎలా మా మమ్మీని కాపాడు కోవాలి స్వామి.


అఖండ: అక్కడ జరిగే పరిణామాన్ని అంగీకరించి జరగబోయే నష్టం నుంచి తప్పించుకుంటే ఆయుష్షు పెంచుకోవచ్చు తిలోత్తమ. లేదంటే..


తిలోత్తమ: నేను చచ్చిపోతాను లేదా చంపేస్తుంది..


ల్లభ: ఎవరు మమ్మీ.


తిలోత్తమ: వాయు.


వల్లభ: వాయు అనేది ఓ గుర్రం కదా..  అది ఎప్పుడో కన్ను మూసిందని నువ్వే చెప్పావు.


అఖండ: మీకు వచ్చిన లెటర్ రాసింది మనిషి.


వల్లభ: అందుకే స్వామి మా మమ్మీ తెగ భయపడుతుంది. 


అఖండ: ఎందుకు తిలోత్తమ అంత భయపడుతున్నావ్.


తిలోత్తమ: నేను చేసిన దుశ్చర్య అలాంటిది స్వామి. అది తలుచుకుంటే నేను ఎంత కిరాతకురాలినో అని నాకే నేనంటే భయ వేస్తుంది.  


వల్లభ: ఇలాంటి అమ్మ కడుపులో పుట్టడం మంచిదంటారా కాదంటారా స్వామి.  


అఖండ: ఇప్పుడు ప్రశ్నించి ఏం లాభం లేదు వల్లభ.  


వల్లభ: చిన్న క్లూ దొరికినా మా మమ్మీ జాగ్రత్త పడుతుంది స్వామి.


అఖండ: ఆధారం అంటే అది రాసిన వారి పేరు మూడు అక్షరాలు ఉంటుంది.


అఖండ స్వామి ఆధారం మూడు అక్షరాలు అని చెప్పడంతో తిలోత్తమ వల్లభతో సహా ఇంట్లో ఎవరెవరి పేర్లు మూడు అక్షరాలు ఉన్నాయో వాళ్లందరిని అనుమానిస్తుంది. ఎవరైనా సరే కనిపెట్టి తన జాగ్రత్తలో తాను ఉండి వారి అంతు చూస్తానని అంటుంది.  


మరోవైపు తిలోత్తమ, వల్లభలు హాల్‌ ఉంటే సుమన వారి కోసం నీరు తీసుకొని వెళ్తుంది. హాసిని చూసి ఏంటి చిట్టీ కొత్తగా సేవ చేస్తున్నావు అని అడిగితే సుమన నీ భర్త, అత్తయ్య కోసమే మంచి నీరు తీసుకెళ్తున్నా అని చెప్తుంది.  దీంతో హాసిని షాక్ అవుతుంది. సుమన వెనకాలే హాల్ లోకి వెళ్తుంది. ఇక తిలోత్తమ తనకు లెటర్ రాసింది ఎవరో తెలుసుకొని చెప్పిన వారికి రూ. 50 లక్షలు బహుమతి ఇస్తానని బంపర్ ఆఫర్ ఇస్తుంది. 


మరోవైపు గాయత్రీ పాప మేడ మీద నిల్చొని ఉంటుంది. పార్శిల్‌లో వచ్చిన గుర్రం కాళ్లకు దారం చుట్టి తిలోత్తమ మీదకు వచ్చేలా దారంతో లాగుతుంది. దీంతో తిలోత్తమ షాక్ అయిపోయి గట్టిగా అరుస్తుంది. బయటకు వచ్చిన విశాల్ గాయత్రీ పాప చేతిలో ఉన్న దారం పక్కన పడేసి పాపని ఎత్తుకొని కిందికి వస్తాడు. ఏమైందని ప్రశ్నిస్తాడు. దాంతో తనని భయపెట్టడానికి ఎవరో గుర్రం కాళ్లకు దారం కట్టి వేలాడదీశారని చెప్తుంది. 


వల్లభ: మమ్మీ గుర్రం కాలు చూస్తుంటే భయం వేస్తుంది కదా.


తిలోత్తమ: వల్లభ గుర్రం కాలు చూస్తుంటే భయంకరమైన ఆ సంఘటనే గుర్తొస్తుందిరా. 


విక్రాంత్: ఏ సంఘటన అమ్మ ఎప్పుడు జరిగింది. 


తిలోత్తమ: ఏం లేదు ఏం జరగలేదు. నేను ఏదో కంగారులో ఏదో అనేశా.


సుమన: వాయు పేరుతో లెటర్ రాసింది ఎవరో తెలుసుకుంటే వారికి 50 లక్షల నగదు బహుమతిగా ఇస్తారట.


విశాల్: అమ్మా అంత అవసరం ఏంటి. ఆ వాయుకి నువ్వే శత్రువువా.


తిలోత్తమ: కాదు.. కాదు.. మనల్ని భయపెట్టే వారికి చెక్ పెట్టడానికి ఎంత ఖర్చు అయినా పర్లేదు అనుకున్నా అంతే. వల్లభ పదరా.


సుమన: తప్పు చేస్తే కదా భయపడాలి.


విక్రాంత్: ఏం చేశారో మనం చూస్తే కదా తెలిసేది. అర కోటికి ఆశపడి ఇబ్బందుల్లో పడకు.


విశాల్: వదినా ఇదంతా అమ్మ పనే వాళ్లు చూడలేదు కదా..


మరోవైపు నయని గాయత్రీ దేవి చీరలు తీసుకొని బాల్కానీలో ఉంటుంది. అక్కడికి విశాల్ వస్తాడు. దాంతో నయని ఆ చీరలతో గాయత్రీ అమ్మగారికి లంగావోణీలు కుట్టిస్తాను అంటుంది. గాయత్రీ పాపకు ఎందుకు అని విశాల్ అడుగుతాడు. దాంతో నయన నేను త్వరలో రాబోయే గాయత్రీ దేవి గారి గురించి అంటే మీరు గాయత్రీ పాప గురించి అంటారు ఎందుకని ప్రశ్నస్తుంది. ఇక నీడగా కనిపించిన గాయత్రీ దేవి ఇంటికి వస్తే పేరు పెట్టడం నుంచి అన్నీ పుట్టినరోజు వరకు అన్నీ మళ్లీ పండగలా చేస్తానని అంటుంది. 


ఇక ఉదయం నయని బయటకు వెళ్తుంది. దారిలో నయనికి కాషాయి రంగు చీర ధరించిన ఓ మహిళ కనిపిస్తుంది. ఆమె నయనితో నీ మనసులో తొలుస్తున్న ప్రశ్నకు సమాధానం కావాలి కదా అంటుంది.


నయని: కావాలి. గాయత్రీ అమ్మగారు ప్రాణంగా చూసుకున్న వాయు జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణం ఏంటో తెలియాలి. 


మహిళ: అవును ఆ ఒక్క విషయం తెలిస్తే దానితో ముడి పడి ఉన్న చాలా విషయాలు బయటకు వస్తాయి నయని. నువ్వు గాయత్రీ అమ్మగారి కోడలు అని తెలిశాక నా ఎదురు చూపులు ఫలించాయి అమ్మ. గాయత్రీ అమ్మగారు తన కోడలు వస్తుందని నాకు ఎన్నో కబుర్లు చెప్పారమ్మా. 


నయని: షాక్ అవుతూ.. అవునా.. నా గురించి మీకు చెప్పారా.. 


మహిళ: అమ్మగారి ఆనందాన్ని ఆవిరి చేసింది ఎవరో నీకు తెలిసే ఉంటుంది. ఆమె మెడలో ఈ పూల దండ వెయ్యు.


నయని: తిలోత్తమ అత్తయ్య మెడలోనా.


మహిళ: సరిగ్గా చెప్పావు. తను దండ వేసుకున్నాక మెల్లగా దండ బరువు పెరిగిపోయి మత్తులోకి వెళ్తుంది. అప్పుడు ముఖానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టు. అప్పుడు వాయు చావుకి కారణం ఎవరో ఏంటో అన్నీ తెలియడానికి దారి దొరుకుతుంది. మరోవైపు పావనామూర్తి, డమ్మక్క గాయత్రీ పాపని హాల్‌లో ఆడిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: 'నాగ పంచమి' సీరియల్: పుట్టగానే బిడ్డను తీసుకెళ్లిపోతానన్న విశాలాక్షి మాటలకు కుప్పకూలిపోయిన పంచమి.. మోక్ష ఆవేదనకు ఏడ్చేసిన రఘురాం!