Vithika Sheru Says She Faced Problems Like Commitment: వితికా షేరు.. హీరోయిన్ గా కెరీర్ మొదులుపెట్టిన ఈమె.. ఇప్పుడు న‌టన‌కు దూరంగా ఉన్నారు. బిగ్ బాస్ తో ఫేమ‌స్  అయ్యి.. ఇప్పుడు ఇక సోష‌ల్ మీడియా ద్వారా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్నారు. అయితే ఇటీవ‌ల ఆమె చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చేలా  చేస్తున్నాయి. 'నిఖిల్ తో నాట‌కాలు' పాడ్ కాస్ట్ లో పాల్గొన్న వితికా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. తన తల్లి ఎదురుగానే తనని కమిట్‌మెంట్ అడిగార‌ని, అది కూడా త‌న త‌ల్లి ఎదురుగా అని అన్నారు. 


ఓపెన్ సీక్రెట్.. 


"ఇండ‌స్ట్రీలో ఎవ‌రైనా క‌మిట్ మెంట్స్ లాంటివి అడిగారా?" అని నిఖిల్ అడిగిన ప్ర‌శ్న‌కు వితికా బదులిస్తూ.. "అది ఓపెన్ సీక్రెట్. అలాంటివి చాలానే జ‌రుగుతాయి. నేను 16 ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌ప్పుడు న‌న్ను క‌మిట్ మెంట్ అడిగారు. నేను దీని గురించి క‌చ్చితంగా చెప్పాలి. క‌చ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే.. మ‌న ఇండ‌స్ట్రీలోనే కాదు అన్ని ఇండ‌స్ట్రీల్లో ఉంటుంది" అని చెప్పారు వితిక.


16 ఏళ్ల‌కే క‌మిట్ మెంట్.. 


"నేను ఆడిష‌న్స్ కి వెళ్లాను. నాకు తెలిసిన వాళ్లే. కానీ వాళ్ల పేర్లు చెప్ప‌కూడ‌దు అంతే. అక్క‌డ అన్ని అయిపోయాయి. మాట్లాడారు. స్టోరీ చెప్పారు. ఆ త‌ర్వాత "ఒక‌సారి పాపను బ‌య‌టికి పంపండి" అని అన్నారు. నేను బ‌య‌టికి వెళ్లిపోయాను. అప్పుడు మా అమ్మ‌ని అడిగారు అంట "అంతా ఓకే అండి. పాప‌కి మంచి టాలెంట్ ఉంది. కానీ, క‌మిట్ మెంట్ ఇవ్వాలి. ప్రొడ్యూస‌ర్ నుంచి బాగా ప్ర‌ెజ‌ర్ ఉంది" అని అన్నారంట‌. అప్పుడు మా అమ్మ పాప‌తోనే మాట్లాడండి.. పాప‌నే అడ‌గండి అని చెప్పి.. న‌న్ను లోపలికి పిలిచింది. "అడ‌గండి ఏదో చెప్తున్నారు క‌దా" అని అంది అమ్మ‌. అమ్మ నాతో చాలా ఓపెన్ గా, క్లోజ్ గా ఉంటుంది. నేను అప్ప‌టికే చాలా మెచ్యూర్డ్. గుడ్ ట‌చ్, బ్యాడ్ ట‌చ్, ఆ లుక్స్ అన్ని తెలుసు. ఎవ‌రు ఎలా చూస్తారు? ఏం చేస్తారు? ఎలా మాట్లాడ‌తారు? అన్ని తెలుసు నాకు అప్ప‌టికే. అదే క‌మిట్ మెంట్ అడుగుతున్నారు అని చెప్పింది. వెంట‌నే.. నేను నాకు అలాంటివి న‌చ్చ‌వు, "మేం అలాంటివాళ్లంకాదు" అని చెప్పి నేను అమ్మ బ‌యటికి వ‌చ్చేశాం’’ అని తెలిపింది.


చెప్ప‌కూడ‌దు అని అప్పుడు తెలిసింది.. 


"ఆడిష‌న్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేసి.. మాకు ఎవ‌రైతే ఆడిష‌న్ గురించి చెప్పారో వాళ్ల‌కు చెప్పాను. ఇలా అడుగుతున్నారు అని. ఆ త‌ర్వాత ఆ డైరెక్ట‌ర్ ఫోన్ చేసి "మీరు అలా ఎలా చెప్తారు" అని అడిగారు. మీరు అడిగింది చాలా పెద్ద మాట. చెప్పాలి క‌దా అన్నాను. దానికి ఆయ‌న అలా చెప్ప‌కూడ‌దు అని అన్నారు. అప్పుడు అర్థమయ్యింది. ఏమి జ‌రిగినా మ‌న‌సులో ఉంచుకోవాలి. చెప్ప‌కూడ‌దు అన్నమాట అని" అని తన ఎక్స్పీరియన్స్ చెప్పారు వితిక. 


Also Read: 'ఆడు జీవితం' స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే - ఎక్క‌డంటే?