Aadujeevitham OTT Streaming Date & OTT Platform: విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న సినిమా 'ఆడు జీవితం'. సౌదీలో కూలీలు ప‌డే క‌ష్టాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించిన సినిమా ఇది. 'స‌లార్' న‌టుడు పృథ్వీ రాజ్ సుకుమార్ న‌టించిన ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఎంతోమంది ఈ సినిమా ఓటీటీ వెర్ష‌న్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఆ రోజు రానే వ‌చ్చింది. ఓటీటీలో రిలీజ్ కానుంది ఈ సినిమా. మ‌రి స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్క‌డో చూసేద్దాం. 


స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 


సౌదీలో కూలీలు ప‌డే క‌ష్టాల‌ను ఈ సినిమాలో చూపించారు. వాస్తవంగా జరిగిన కథ ఇది. బెన్యామిన్ రాసిన 'ఆడు జీవితం' నవల ఆధారంగా దీన్ని తీశారు. ఈ సినిమా మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మ‌లయాళి సినిమా డ‌బ్డ్ వెర్ష‌న్ డిస్ని + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మే 26న సినిమా ఓటీటీలోకి రానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 


మూడున్నర గంట సినిమా?


ఒక వ్యక్తి పడ్డ కష్టాలను చూపించారు ఈ సినిమాలో. దీంతో అనుకున్న‌ది అనుకున్న‌ట్లు చూపించేందుకు మూడున్న‌ర గంటలు వ‌చ్చింద‌ట‌. అయితే, థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు అంత‌సేపు చూడలేరు కాబ‌ట్టి.. దాన్ని ట్రిమ్ చేసి రిలీజ్ చేశార‌ట మేక‌ర్స్. అయితే, ఓటీటీలో మాత్రం మూడున్న‌ర గంటల నిడివితో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఓటీటీలో అయినా అంత‌సేపు చూస్తారో లేదో చూడాలిమ‌రి. 



రూ. 150 కోట్లు క‌లెక్ష‌న్.. 


ఈ సినిమాని ప్రేక్ష‌కులు బాగా ఆద‌రించారు. రికార్డుల మోత మోగించింది 'ఆడు జీవితం'. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు రూ. 150 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చాయి. ఇక ఈ సినిమాని బ్లెసీ డైరెక్ట్ చేశారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఎన్నోరోజులు క‌ష్టాలు ప‌డి, ఇబ్బందుల‌ను ఎదుర్కొని ఈ సినిమాని తెర‌కెక్కించారు. ఈ సినిమాలో పృథ్వీ రాజ్ కి జోడీగా అమ‌లాపాల్ న‌టించారు. హాలీవుడ్ యాక్ట‌ర్ జిమ్మీ జీన్ లూయిస్, కేఆర్ గోకుల్, అర‌బ్ యాక్ట‌ర్స్ తాలిబ్ అల్ బ‌లూషి, రిక్ ఆదే ఇత‌ర పాత్ర‌లు పోషించారు. తెలుగు వెర్షన్ ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. 


క‌ష్ట‌ప‌డ్డ హీరో.. 


ఇక ఈ సినిమా తీసేందుకు క్రూ మొత్తం బాగా క‌ష్ట‌ప‌డ్డారు. సినిమాలో క్యారెక్ట‌ర్ స‌రిగ్గా వ‌చ్చేందుకు హీరో ఏకంగా 31 కేజీలు బ‌రుతు త‌గ్గార‌ట‌. 'ఆడు జీవితం' సినిమా.. దాదాపు 16 ఏళ్ల త‌ర్వాత సెట్స్ పైకి వ‌చ్చింద‌ట‌. 16 ఏళ్ల నుంచి ఈ సినిమాపై వ‌ర్క్ చేసి.. 2018లో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఆ త‌ర్వాత క‌రోనా, అదే టైంలో సినిమా యూనిట్ మొత్తం ఎడారిలో దాదాపు మూడు నెల‌లు చిక్కుకుపోవ‌డంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ ప‌డింది. ఇక షూటింగ్ పూర్తైన త‌ర్వాత దాదాపు ఏడాది పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు నిర్వ‌హించార‌ట‌.


Also read: అలా చేస్తే తేడా అనుకుంటారేమో - అలాంటి వాళ్లకి స్వీట్ సినిమా ఇది: దర్శకుడు మారుతి