Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : దీప తన తండ్రి కుభేరకు పిండం పెడుతుంది. అయితే ఒక్క కాకి కూడా పిండం తినడానికి రాదు. దీంతో దీప కంగారు పడుతుంది. ఇంతలో ఓ ఘోర బతికున్న ప్రాణానికి పిండం పెడితే ఎలా తింటాయమ్మా అని అంటాడు. దీప హడావుడిగా ఆయన దగ్గరకు వెళ్తుంది.
దీప: బతికి ఉండటం ఏంటి? మా అమ్మానాన్నలు ఎప్పుడో చనిపోయారు.
ఘోర: చనిపోలేదు. నిన్ను కన్న తల్లి దండ్రులు బతికే ఉన్నారు. ఇంకా పిండాన్ని కాకులు ముట్టవు.
దీప: తనలో తాను.. చనిపోయిన అమ్మానాన్నలకు బతికే ఉన్నారు అంటున్నాడేంటి. ఈయన అన్న దానికి అత్తయ్య మాటలకు సంబంధం ఉందా. (అనసూయ గతంలో దీపతో.. నా తమ్ముడు నీ విషయంలో చాలా చాలా పెద్ద పొరపాటు చేశాడే అన్నది తలచుకొని) ఇలా లేనిపోనివన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే ప్రస్తుతం కళ్ల ముందు ఉన్న దాని గురించి ఆలోచించడం మంచిది. ఏ నాన్న నిన్ను నాకు దూరం చేసిన మనిషిని ఏం చేయలేదు అని నా మీద కోపంగా ఉందా.. అతని పాపాన అతనే పోతాడు అని వదిలేశాను నాన్న. దేవుడే అతన్ని శిక్షిస్తాడు.
శ్రీధర్ కార్తీక్‌ని నిలదీయాలి అని అనుకుంటాడు. కాంచన వద్దు అని చెప్పినా వినదు. శ్రీధర్ దీప గురించి కార్తీక్‌ని అడుగుతాడు. దీప నీకు ముందే పరిచయం ఉందా అని అడుగుతాడు. కార్తీక్ ముందే పరిచయం ఉంది అని చెప్పడంతో కార్తీక్ తల్లిదండ్రులు ఇద్దరూ షాక్ అవుతారు.
కార్తీక్: ఒక మనిషి మీద మనకున్న నమ్మకం చేతిలో గాజు గ్లాస్ లాంటిది. కావాలని వదిలేసినా.. పొరపాటున చేయి జారినా ముందులా మాత్రం ఉండదు. అర్థం చేసుకోండి. అది సాయమా.. ప్రాయశ్చిత్తమా ముందు ముందు మీకే తెలుస్తుంది.
కాంచన: చూశారా వాడు ఎంత బాధ పడ్డాడో అడగొద్దు అంటే విన్నారా.
శ్రీధర్: మనసులో.. సాయం అంటే సరే ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటి. దీప గురించి వీడు ఇంత లోతుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి.
దీప హోటల్‌లో టిఫెన్లు చేస్తుంటుంది. ఇంతలో ముగ్గురు ఆడవాళ్లు కారులో వస్తారు. వాళ్లని చూసిన దీప కడియంతో వీళ్లని చూస్తే ఇక్కడ టిఫెన్ చేసేవాళ్లలా లేరు అని అంటుంది. ఇక ఆ ముగ్గురిలో కావేరి అనే ఆవిడ ఇక్కడ ఉప్మా తినకపోతే లైఫ్ వేస్ట్ అని సోషల్ మీడియాలో ఒక రీల్ చేసింది ఈ టిఫెన్ సెంటర్ గురించే కదా అని ఆ టేస్ట్ చేద్దామని అనుకుంటారు. స్పెషల్‌గా ఉప్మా బిర్యాని అని దీప అంటే ఓవర్‌గా ఉందని కావేరి అంటుంది. బాగుంటే డబ్బులు ఇస్తానని లేకపోతే ఇవ్వను అని కావేరి అంటుంది. ఇక అటు తిరిగి ఇటు తిరిగి కావేరి దీపకు మధ్య మాటా మాటా పెరుగుతుంది. దీంతో కావేరి హర్ట్ అయిపోతుంది. తనకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అని కడియం, దీపల సంగతి చెప్తాను అని అంటుంది. ఇక కావేరి బేబీ అంటూ శ్రీధర్‌కి కాల్ చేసి వెంటనే రమ్మని పిల్లుస్తుంది. శ్రీధర్ దీప హోటల్ దగ్గరకు వస్తాడు. దీపని చూసి షాక్ అవుతాడు.
శ్రీధర్: దీప ఇక్కడుంది ఏంటి.
దీప: ఈయన కార్తీక్ బాబు నాన్న కదా ఈమెతో ఉన్నారు ఏంటి.
శ్రీధర్: పోయి పోయి దీని కంట్లో పడ్డాను వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. శ్రీధర్ కావేరి వాళ్లని పంపేస్తాడు. నా కొంప ముంచావ్ అని ఎలా కవర్ చేసుకోవాలి అని మనసులో అనుకుంటాడు.
దీప: మీరు చేసింది తప్పు అనిపించడం లేదా.. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నా.. ఈ విషయం అమ్మగారికి తెలుసా.
శ్రీధర్: ఇది చెప్పదగిన విషయం కాదు కదమ్మా.
దీప: మరి ఎందుకు ఆవిడకు మోసం చేస్తున్నారు.
శ్రీధర్: మీ ఆంటీ నడవలేదు కదమ్మా.. ఏదో పాత పరిచయం అలా అయిపోయింది.
దీప: నేను ఇలా అంటున్నాను అని ఏమీ అనుకోవద్దు సార్. అమ్మగారి పరిస్థితి మీకు వచ్చి అమ్మగారు మీలా ప్రవర్తిస్తే. వినడానికే కష్టంగా ఉంది కదా సార్. ఇప్పుడు మీ విషయం తెలిసినా అమ్మగారికి కూడా కష్టంగా ఉంటుంది. నాకే ఇలా జరిగింది అనుకున్నా నాలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని అర్థమైంది.
శ్రీధర్: నువ్వు చూసిన విషయం ఎవరి దగ్గర అనొద్దు.
దీప: కాంచనమ్మ గారు మిమల్ని చాలా నమ్ముతారు. ఈ విషయం తెలిస్తే మీ ముఖం మీద ఉమ్మేస్తారు. ఆ పరిస్థితి రానివ్వకండి.
శ్రీధర్: ఇంటికి వచ్చి.. కారు దిగే ముందే చూసుకోవాల్సింది. దీప ఎవరికి చెప్పదు అని అర్థమైంది కానీ అనవసరంగా ఆవిడతో కూడా నీతులు చెప్పించుకోవాల్సి వచ్చింది. ఈ సారి ఎప్పుడైనా ఎదురు పడితే తప్పు చేసినట్లు తల దించుకోవాల్సి వస్తుంది. దీప వెళ్లిపోయే వరకు ఆ ఇంటికి వెళ్లకూడదు.
ఇక ఇంటికి వచ్చిన శ్రీధర్‌కు కాంచన షాక్ ఇస్తుంది. టీవీలో దీప కథ లాంటి కథ చూశాను అని చెప్తుంది. శ్రీధర్ ఎఫైర్ లాంటి కథనే చెప్తుంది. ప్రేమగా చూసుకొని భర్త మరో ఆడదానితో కలిసి ఉండి రెండో పెళ్లి చేసుకొని ఆమెతో పిల్లల్ని కూడా కన్నాడని, ఆ విషయం తెలిసి మొదటి భార్య చనిపోయిందని అంటుంది. దాంతో శ్రీధర్ షాక్ అయిపోతాడు. రేపు ఎప్పుడైనా కాంచనకు నిజం తెలిస్తే కాంచన కూడా చనిపోతుందా అని కంగారు పడతాడు. ఇంతలో రఘురామ్ కాంచనకు కాల్ చేసి రేపు ఇంటికి రమ్మన్నాడు అని చెప్తుంది. దీంతో శ్రీధర్ తనకు వేరే పని ఉందని రాను అని అంటాడు. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. కార్తీక్ కూడా తన తండ్రిని రమ్మని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.