karthika deepam 2 Telugu Serial Today Episode : నర్సింహ పెనుగులాటలో దీపకు దెబ్బ తగులుతుంది. దీంతో శౌర్య ఆంయిట్‌మెంట్ తీసుకొచ్చి దీపకు పూస్తుంది. నేను చదువుకోనని నీకే తోడుగా ఉంటానని చెప్తుంది. దీంతో దీప అదంతా లేదని నువ్వు స్కూల్‌కు వెళ్లాల్సిందేనని కలెక్టర్ కావాల్సిందేనని చెప్పడంతో శౌర్య అలాగే అంటుంది. తర్వాత దీప పని చేసుకుంటుంటే డాక్టర్ బాబు వస్తాడు. మెడకు ఏదో దెబ్బ తగిలినట్లుంది అనుకుంటాడు.
బాబు: దీప ఇప్పుడు గాయం ఎలా ఉంది.
దీప: ఏంటీ బాబు
బాబు: మెడ మీద ఏదో గాయం అయినట్లుందిగా..
దీప: మనిషి అన్నప్పుడు ఏదో ఒక గాయం అవుతుంది బాబు. దానికి మీరు పని మానుకుని వచ్చి అడగాల్సిన అవసరం లేదేమో?
అనగానే డాక్టర్ బాబు బాధగా మాట్లాడి టిఫిన్ సెంటర్‌లో ఏం జరిగిందో నాకు తెలుసని చెప్తాడు. దీంతో దీప కుక్క కథ చెప్పి ఎవరికి బుద్ది చెప్పాలో మీకు అర్థం అయింది అంటుంది దీప. శౌర్యను స్కూల్‌లో చేర్పించి పాప తండ్రి సంతకం పెట్టాల్సిన చోట మీరు సంతకం పెట్టారు అందుకే టిఫిన్ సెంటర్ దగ్గర గొడవ జరిగింది అని చెప్తుంది దీప.
బాబు: నా బదులు రౌడీని స్కూల్‌లో చేర్పించేందుకు ఎవ్వరూ వెళ్లినా ఆక్కడే సంతకం పెట్టేవారు. అప్పుడు కూడా వాడు అనేవాడా? కూతురు భవిష్యత్తు గురించి వాడికి బాధ లేదు కానీ సంతకం గురించి బాధపడుతున్నాడా?
దీప: మీలా ఆగి ఆలోచించే ఓపిక అతనికి లేదు. నాకు కానీ నా కూతురుకు కానీ సంబంధించిన విషయాల్లో మీరు కల్పించుకోవద్దు బాబు.
బాబు: ఈ సమస్యలకు అన్నింటికి కారణం నీ భర్తే దీప. వాణ్ని ఊరికే వదిలేయకూడదు.
దీప: చాలు బాబు చాలు నా పరిస్థితులు చక్కబడే వరకు ఇక్కడ ఉండనిచ్చేటట్లు లేరు. మీ వల్ల ముందే ఇక్కడి నుంచి వెళ్లేలా చేస్తున్నారు.
అంటూ దీప ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. నీ బాధకు కారణం ఆ నర్సింహ్మ గాడు వాడికి ఎలా బుద్ది చెప్పాలో నాకు తెలుసు అనుకుంటాడు డాక్టర్ బాబు. తర్వాత నర్సింహ భోజనం చేస్తుంటే.. పోలీసులు వచ్చి బలవంతంగా నర్సింహను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తారు. దీంతో అనసూయమ్మ, నర్సింహ భార్య దీపను తిట్టుకుంటారు.
మరోవైపు పారిజాతం బంటుగాడితో దీప గురించి ఎంక్వైరీ చేయిస్తుంది. వాళ్ల ఊరిలో అప్పులు చేసి అవి తీర్చలేక హైదరాబాద్ వచ్చారని వాడు చెప్పడంతో మరి కార్తీక్ గురించి నువ్వే తెలుసుకోవాలి అని చెప్తుంది. అయితే ఈ బంటు గాడు లోపల ఉండాలని అడుగుతాడు. దీంతో బంటు గాడి తల పగులగొడుతుంది పారిజాతం. బంటు గట్టిగా అరుస్తుంటే. అరవొద్దు అని సైగ చేస్తుంది పారిజాతం.
బంటు: చావగొట్టి అరవొద్దు అంటారేంటి అమ్మగారు.
పారిజాతం: చావగొట్టడం కాదురా! ఇదే ఐడియా సుమిత్ర మీద వాడితే పని చేయలేదు కదా? అందుకే మనం వాడుకుందాం.
బంటు: అమ్మా రక్తం వస్తుంది అమ్మగారు
పారిజాతం: ఈ మాత్రం దానికే భయపడితే ప్రాణాలు ఎలా తీస్తావురా? ముందు చెయ్యి తల మీద పెట్టుకో.. నిన్ను లోపలికి ఎలా రానివ్వరో నేను చూస్తాను.
అంటూ లోపలకి బంటును తీసుకెళ్తుంది. లోపల సుమిత్ర, జ్యోష్న అందరూ మాట్లాడుకుంటుంటారు. పారిజాతం కంగారుగా బంటు గాడి ప్రాణం పోయేలా ఉందని నాటకం ఆడుతుంది. పారిజాతం భర్త వీణ్ని మళ్లీ లోపలికి ఎందుకు తీసుకొచ్చావని ప్రశ్నిస్తే.. ఎవరో దొంగ వెధవ నా నగలు ఇవ్వకపోతే నా తల పగులగొడతాననగానే వీడు వచ్చి నా ప్రాణాలు కాపాడాడు అని కట్టు కథ చెప్పగానే ఎవ్వరూ నమ్మరు. కట్టు కట్టావుగా ఇక పంపించేయ్.. అనగానే పంపించనని పారిజాతం చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.