Actress Ashi Roy Comments on Bengaluru Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ ఇండస్ట్రీలో సంచలనం రేపుతుంది. ముఖ్యంగా ఈ సంఘటన టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ పార్టీకి టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారంటూ వార్తలు రావడంతో ఇది ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌ మారింది. ఇందులో ప్రధానం నటి హేమ, శ్రీకాంత్‌ల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రేవ్‌ పార్టీలో తాను లేనంటూ నటి హేమ స్వయంగా వెల్లడించింది. అంతేకాదు రెండు రోజులుగా తాను హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ వీడియో కూడా రిలీజ్‌ చేసింది. ఇక ఈ రేవ్‌ పార్టీకి సంబంధించిన వీడియోలు, పట్టుబడిన నటీనటులు ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


ప్రస్తుతం దీనిపై ఇండస్ట్రీలో వాడివేడిగా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఓ నటి అది రేవ్‌ పార్టీ కాదని, బర్త్‌డే పార్టీ అంటూ ట్విస్ట్‌ ఇచ్చింది. ఆమె మరేవరో కాదు నటి ఆషీ రాయ్‌. తెలులో కేఎస్‌100(KS 100), మిస్టరీ ఆఫ్‌ సారిక (Mystery Of Sarika) వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. అయితే రేవ్‌ పార్టీలో ఆమె పేరు రావడంతో తాజాగా నటి వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఆ రోజు జరుగుతుంది బర్త్‌డే పార్టీ అని, లోపలకు తనకు ఏం జరుగుతుందో, అక్కడ ఏం ఉందనేది తనకు అస్పలు తెలియదంంటూ వీడియో చెప్పుకొచ్చింది. వాసు అన్నయ్య పార్టీ అని పిలిస్తే వెళ్ళానని, తాను అది బర్త్‌డే పార్టీ అనుకునే వెళ్లానంటూ చెప్పడం కొసమెరుపు. తను ఒక ఆడిపిల్లని, అది గుర్తించి తనకు అందరు సపోర్టు చేయాలని కోరింది.


ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.  కాగా బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో హెబ్బగోడిలోని జీఆర్ ఫాంహౌస్ లో వాసు బర్త్‌డే పేరుతో సన్ సెట్ టూ సన్ రైస్ అనే సబ్ టైటిల్‌తో ఈ పార్టీ నిర్వహించారు. ఈ రేవ్‌ పార్టీలో దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెంది పలువురు సినీ నటీనటులతో పాటు వ్యాపార, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్లు తెలిసిందే. అయితే పోలీసులు సమాచారం ప్రకారం మొత్తం ఈ రేవ్‌ పార్టీలో దాదాపు 150 మంది వరకు పాల్గోన్నట్టు సమాచారం. అయితే ఫాంహౌస్‌లో పట్టుబడిన సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చలేదని తెలుస్తోంది.






దీనిపై విచారణ చేపట్టిన బెంగళూరు పోలీసులు ఈ కేసును ఎప్పుగూడ పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశామన్నారు. బట్టుబడిన వారి దగ్గరి నుంచి శాంపిల్స్‌ సేకరించామని, వాటిని టెస్ట కోసం ల్యాబ్‌కు పంపించామన్నారు. నివేధికలు వచ్చిన తర్వాత డ్రగ్స్ కొనుగోలుదారుల ప్రత్యేక చట్టం ద్వారా చర్యలు తీసుకుంటామని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద పేర్కొన్నారు. హెబ్బగోడిలోని జీఆర్ ఫాంహౌస్ లో వాసు బర్త్‌డే పేరుతో సన్ సెట్ టూ సన్ రైస్ అనే సబ్ టైటిల్‌తో ఈ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో నిషేధిత డ్రగ్స్‌ ను గుర్తించారు. ఎండీఎంఏ పిల్స్ తో పాటు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు వాడినట్లు పోలీసులు గుర్తించామన్నారు.