Naga Panchami Today Episode : పంచమి ప్రసవం టైంలో కరాళిని సుబ్రహ్మణ్య స్వామి తన త్రిశూలాన్ని ప్రయోగించడంతో కరాళి కొండ మీద నుంచి పడిపోతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కరాళి పాడుబడిన ఓ గుహలో మంత్రాలు ధ్యానిస్తూ ఇప్పుడు కళ్లు తెరుస్తుంది. కరాళి మొత్తం తన గతం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. గుహ నుంచి బయటకు వస్తుంది. మొత్తం వింతగా చూస్తుంటుంది. ఈరోజే ఇన్నేళ్ల తర్వాత వెలుగును చూస్తుంది. 


కరాళి: ఇన్ని సంవత్సరాలుగా నేను చేసిన పూజలు అన్నీ కలిసి నాకు శక్తిని ఇచ్చాయి. ఆ శక్తే ఇప్పుడు నాకు నిద్ర లేపింది. ఆ శక్తి కారణంగానే నేను ఇప్పుడు ధ్యానంలో నుంచి బయటకు రాగలిగాను. నేను స్ఫృహాలోకి రావడానికి నా పూజలే నాకు సాయం చేశాయి. పొగొట్టుకున్న శక్తులు అన్నీ తిరిగి పొందడానికి ఇన్నేళ్లు పట్టింది.  


ఒక రఘురాం, వైదేహి ఇద్దరూ మనవరాళ్లును ఒడిలో పెట్టుకొని ప్రేమగా ఆటలు ఆడిస్తూ పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉంటారు. వైశాలి, ఫాల్గుణి ఇద్దరూ అయిగిరి నందిని అంటూ దేవుడి పాట పాడుతారు. అది చూసి రఘురాం, వైదేహి పొంగిపోతారు. మరోవైపు నాగేశ్వరి పాము పంచమి ఇంటి దగ్గరకు వస్తుంది. 


నాగేశ్వరి: పిల్లల్లో ఎవరు నాగాంశతో పుట్టారో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ పాపను నాగలోకం తీసుకెళ్లి రాణిని చేయాలి. అప్పుడే నా కార్యం పూర్తి అవుతుంది. మహారాణి విశాలాక్షి కోరిక నెరవేర్చాలి. ఇద్దరు పిల్లల్లో ఎవరు విశాలాక్షి అంశో కనిపెట్టడం నాకు పెద్ద పరీక్ష అది తెలుసుకుంటే ఆ పాపని నాగలోకం తీసుకెళ్లిపోవచ్చు. అనుకుంటూ విశాలాక్షి పాములా మారి ఇంటిలోపలి వైపు వెళ్లుంది. 


ఇక పంచమి కిచెన్‌లో వంట చేస్తూ ఉంటుంది. రఘురాం, వైదేహీలు పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. నాగేశ్వరి పాము మెట్ల మీద నుంచి రావడం బుసలు కొడుతూ ఉంటుంది. ఆ శబ్ధం పంచమి విని కంగారు పడుతుంది. కిచెన్‌ నుంచి తొంగిచూస్తుంది. 


పంచమి: కచ్చితంగా ఆ పాము ఇష్టరూప జాతి పామే. నాగలోకం ఇంకా నన్ను వదిలిపెట్టేలా లేదు. నేను నా పిల్లల్ని కాపాడుకోవాలి. పంచమి హడావుడిగా ఇంటి తలుపులు మూసేస్తుంది. ఇక నాగేశ్వరి పాముని చూసి అక్కడికి కోపంగా వెళ్తుంది. ఆగు నాగేశ్వరి. నాగేశ్వరి ఇప్పుడు ఎందుకు వచ్చావో చెప్పు. చెప్పు నాగేశ్వరి నీకు ఇక్కడ ఏం పని. నిన్నే అడిగేది నాగేశ్వరి. నాకు నాగలోకానికి సంబంధం తెగిపోయింది. ఇప్పుడు నాలో నాగ లక్షణాలు కానీ నాగలోక వాసనలు కానీ ఇసుమంత లేవు. అయినా నువ్వు ఇంకా నన్ను అనుసరించి తిరగడం ఏమంత సమంజసం కాదు నాగేశ్వరి. 


నాగేశ్వరి: మనసులో.. సంబంధం తెగిపోలేదు నాగేశ్వరి సంబంధం మరింత బలపడింది. నీ కడుపున నాగాంశ పుట్టుంది. నాగలోక మహారాణిని నువ్వు కన్నావు. మీ అమ్మకు జన్మనిచ్చి నాగలోకాన్ని కాపాడబోతున్నావ్.


పంచమి: ఏంటి నాగేశ్వరి ఆలోచిస్తున్నావ్. నేను చెప్పింది అబద్ధమా. నాకు నాగలోకానికి ఏమైనా సంబంధం ఉందా. 


నాగేశ్వరి: సృష్టిలో చాలా విచిత్రాలు జరుగుతూ ఉంటాయి పంచమి. అందులో నీ జన్మ కూడా అద్భుతం. ఒక లోకంతో సంబంధం తెంచుకోవడం ఎవరి వల్ల కాదు.


పంచమి: అది నేను సంపాదించుకున్నాను నాగేశ్వరి. పూర్తిగా నాగలోకంతో  సంబంధం తెంచుకొని భూలోకం మాతృమూర్తిగా మారిపోయాను. భర్తతో సంతోషంగా ఉన్నాను. మా పిల్లలు కూడా మానవ రూపంలో పుట్టి ఆనందంగా ఉన్నారు. తిరిగి నాకు నా జన్మ గుర్తు చేయకు. రెండు లోకాల మధ్య నేను అనుభవించిన కష్టాలు చాలు. 


నాగేశ్వరి: నేను నిమిత్త మాతృరాలిని పంచమి, నాగదేవత ఆజ్ఞ పాటించడమే నా కర్తవ్యం.


పంచమి: ఒకప్పుడు అంటే నువ్వు నాకు రక్షణగా ఉంటూ నాగలోకం తీసుకెళ్లే ప్రయత్నం చేశావు. కానీ నేను నాగలోకం వచ్చే అవకాశం లేదు అని నీకు తెలుసు. ఇక నాతో నీకు ఏం పని ఉంది నాగేశ్వరి. నా పిల్లలకు నా గతం తెలీకూడదు నాగేశ్వరి. నువ్వు ఈ ఇంట్లో ఎవరి కంట పడినా మళ్లీ నన్ను అవమానించి అనుమానిస్తారు. మళ్లీ నాకు అలాంటి పరిస్థితి తీసుకురాకు. వెళ్లిపో నాగేశ్వరి. నా పిల్లల దయవల్ల నాకు గౌరవం దక్కింది. అత్తమామలు నన్నూ నా పిల్లల్ని ప్రేమగా చూసుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ ఇంట్లో పాము జాడ కనిపించింది అంటే నన్ను వెలెత్తి చూపడానికి నా తోటి కోడళ్లు కాచుకొని కూర్చొన్నారు. నువ్వు నాగలోకం వెళ్లిపో. ఇక నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు. ఇది నా ఆజ్ఞ అనుకుంటావో లేక నా విన్నపం అనుకుంటావో నీ ఇష్టం నాగేశ్వరి. నువ్వు మాత్రం ఇంకెప్పుడు నాకు కనిపించకూడదు. మా పిల్లలకు పాములు అంటే చాలా కోపం అలాంటిది నేను పాము జాతి అని తెలిస్తే నా దగ్గరకు కూడా రారు. నాకు అలాంటి సంకట స్థితి కల్పించకు నాగేశ్వరి. నీకు చేతులెత్తి మొక్కుతున్నాను దయచేసి వెళ్లిపో. ఇంకెప్పుడూ నాకు కనిపించకు. నువ్వు నాకు అన్యాయం చేయవు అని నమ్ముతున్నాను. 


నాగేశ్వరి: నన్ను క్షమించు పంచమి నేను మీ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నాగదేవత ఆజ్ఞ పాటించాలి. ఇద్దరు పిల్లల్లో నాగాంశతో పుట్టింది ఎవరో తెలుసుకొని నాగలోకం తీసుకెళ్లిపోవాలి. 


కరాళి నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు తన కర్తవ్యం ఏంటో నిర్ణయించుకోవాలి అనుకుంటుంది. ఎటు వెళ్లాలో ఏంటో అనుకుంటుంది. ముందు ఓ చోట ఉండటానికి చోటు చూసుకోవాలి అనుకుంటుంది. ఇంతలో ఓ అమ్మాయి కర్రలు ఏరుకొని తల మీద పెట్టుకొని వెళ్తుండగా ఆమెను చూస్తుంది. ఆ అమ్మాయి గుడ్డిది. కొండ మీద నుంచి పడిపోతుండగా కరాళి పట్టుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: మా అమ్మనాన్న విడాకులు తీసుకోలేదు - సంచలన విషయాలు బయటపెట్టిన పవిత్ర జయరామ్‌ కూతురు, భర్త ఎమోషనల్‌