Pavithra Jayaram Daughter Sensational Comments Parents Divorce Rumours: 'త్రినయని' సీరియల్ నటి పవిత్ర జయరామ్, నటుడు చంద్రకాంత్ మరణం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇటవల జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరామ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రియులి మ్రతి తట్టుకోలేకపోయిన చందు రోజుల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆరేళ్లుగా సహాజీవనం చేస్తున్న ఈ వీరి రిలేషన్‌కు సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తుంది. పవిత్ర జయరామ్ తన భర్తకు విడాకులు ఇచ్చి చందుతో వివాహేతర సంబంధంలో ఉందంటూ నిన్నటి వరకు వినిపించిన వార్తలు. పవిత్ర జయరామ్, చందులకు వేరువేరుగా పెళ్లయ్యింది. ఇద్దరికి కూడా పిల్లలు ఉన్నారు.
పవిత్రతో పరిచయం వల్ల చందు తన భార్యను వదిలేసి ఆమెతో ఆరేళ్లుగా ఉంటున్నాడని అతడి తండ్రి,తల్లి, భార్య చెబుతున్నారు. మరోవైపు తన తల్లికి, చందు మధ్య ఏం లేదంటూ ఆమె కూతురు ఖండిస్తూ వస్తుంది. ఇదిలా ఉంటే పవిత్ర తన భర్తకు విడాకులు ఇచ్చిందని, ఈ క్రమంలోనే చందుతో పరిచయం వల్ల ఇద్దరు కలిసి ఉంటున్నారంటూ నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. కానీ అసలు తమ తల్లిదండ్రులకు విడాకులు కాలేదంటున్నారు పవిత్ర జయరాం కూతురు, కొడుకు. తాజాగా ఓ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన పవిత్ర కూతురు,కొడుకు సంచలన విషయాలు బయట పెట్టారు. అసలు పవిత్ర జయరామ్ తన భర్తకు విడాకులు ఇవ్వలేదట. స్వయం ఈ విషయం ఆమె కూతురే వెల్లడించింది.
విడాకులంటూ ఏవేవో వార్తలు రాస్తున్నారు
ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. అమ్మ చనిపోయాక ఏవేవో అంటున్నారు. అవన్ని మమ్మల్ని చాలా బాధిస్తున్నాయి. నాన్న అమ్మను చిత్రహింసలు పెట్టేవాడని, అందుకే నాన్నకు విడాకులు ఇచ్చిందంటూ ఎవరికి తోచినట్టు వారు వార్తలు రాస్తున్నారు. అసలు నిజమేంటని తెలియకుండ ఇలాంటి వార్తలు ఏలా రాస్తారు. తమ స్వలాభం కోసం ఇంకోకరి జీవితాలపై ఇలా తప్పుడు వార్తలు ఎలా రాస్తారు. అసలు మా అమ్మా,నాన్నకు విడాకులు కాలేదు. నాన్న అమ్మను చాలా బాగా చూసుకునేవారు. భార్యభర్తలు అంటే ఒకరు సీరియస్‌గా ఉండటం. లేదా ఎప్పుడూ గొడవలు పడుతూంటారు. కానీ అమ్మ, నాన్న అలా కాదు.
ఆ వార్తలకు నాన్న చాాాలా క్రుంగిపోయారు
వారిని చూస్తే ఫ్రెండ్స్‌లా అనిపించేది. నాన్న అమ్మను చాలా బాగా చూసుకునేవారు. ఇద్దరు మధ్య మంచి బాండింగ్ ఉండేది. అలాంటి వారి గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారు. అసలు వారిద్దరికి విడాకులు అయ్యాయని ఎవరూ చెప్పారు" అంటూ పవిత్ర జయరాం కూతురు షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తన తల్లిదండ్రులపై ఇలాంటి వార్తలు రావడంతో బంధువలంతా ఇది నిజమా అంటూ తమకు ఫోన్లు చేస్తున్నారని వారు వాపోయారు. అందరు అడుగుతున్న ప్రశ్నలు, ఈ వార్తలు చూసి నాన్న చాలా క్రుంగిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నేనేప్పుడు అమ్మను అలా హింసించాను, ఎందుకు ఇంత నెగిటివిటీ స్ప్రెండ్ చేస్తున్నారంటూ నాన్న చాలా ఎమోషనల్ అయ్యారంటూ ఆమె చెప్పుకొచ్చింది.
Also Read: పవిత్ర జయరాం, చందు రిలేషన్‌పై స్పందించిన ఆమె కూతురు - ఏం చెప్పిందంటే!