Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode: దీప కడియం దగ్గరకు వస్తుంది. కడియం కార్తీక్‌ గురించి దీపను ప్రశ్నిస్తాడు. దీపని వాళ్ల ఇంట్లో పని మనిషి అనుకున్నాను అని మరి కార్తీక్ అండి అని పిలుస్తున్నాడు అని పనివాళ్లని అలా పిలవరు కదా అని అంటాడు. పైగా దగ్గరుండి కారులో తీసుకెళ్తున్నారు. అంత అవసరం ఉండదు కదా అని అంటాడు. 


కడియం: ఆ బాబు తలచుకుంటే నీ జీవితానికి ఇంత కంటే మంచి సాయమే చేయగలడు. అయినా నువ్వు నా దగ్గర పని చేయడం ఏంటి అమ్మ. ఏదో తెలుసుకోవాలి అని అడిగాను అంతే చెప్పాలి అంటే చెప్పు లేదంటే వద్దు అని అంటాడు. దాంతో దీప తాను సుమిత్రను కాపాడాను అని ఆవిడ మేనల్లుడే ఆయన అని అందుకే అలా మాట్లాడాను అంటుంది. 


ఇక కడియం నీ పని అయితే వెళ్లిపోతావా అని అంటే దీప తనకు ఎవరూ లేరు అని ఇక్కడే ఉండి పాపని చదువించుకుంటానని అంటుంది. 


నర్శింహ దీప గురించి తలచుకుని దాన్ని వదలను అంటాడు. పక్కనే ఉన్న అనసూయ నువ్వు సుఖంగా ఉన్నావు కదరా ఇక దాని గురించి ఎందుకని అంటుంది. ఇక అనసూయ శోభకు నీరు తీసుకురమ్మని అంటుంది. 


శోభ: తనలో తాను.. నేను నిన్ను ఇక్కడ ఉండనిచ్చి నీకు ఇలా సేవలు చేస్తుంది నువ్వు నాపై పెత్తనం చేస్తావని కాదే. ఆ దీప మా వైపు రాకుండా ఉండటానికి. ముందు నీతో దాన్ని వెళ్లగొట్టి తర్వాత నిన్నూ నీ కొడుకు చేతే ఛీ కొట్టించి ఇంటి నుంచి తరిమేస్తా. 
అనసూయ: నీరు అందుకుంటూ.. నువ్వే నా మొదటి కోడలు అయింటే బాగుండేదమ్మా.
శోభ: మొదటి కోడలు రెండో కోడలు ఏంటి అత్తయ్య. ఉన్నది నేను ఒక్కదాన్ని. ఏ మేనకోడల్ని మళ్లీ తెచ్చుకొనే ఆలోచన ఏమైనా ఉందా మీకు. పోనీ నేనూ మీతోనే ఉంటాను అని ఆవిడ ఏమైనా ఫోన్ చేసిందా.  
అనసూయ: అది అలాంటిది కాదులేమ్మా. వాళ్లనే వద్దు అనుకున్నాక వాళ్ల గురించి ఎందుకు ఆలోచిస్తావమ్మా. 
శోభ: మరి ఎందుకు మొదటి కోడలు అయింటే బాగుండేది అన్నారు.
నర్శింహ: మా అమ్మ ఏదో సరదాకి అన్నాదిలేవే.
శోభ: ఇప్పటికే నువ్వు చేసిన పనికి బస్తీలో తల ఎత్తుకొని తిరగలేకపోతున్నా. ఇప్పుడు మళ్లీ అది కూతుర్ని తీసుకొని వచ్చి ఇంటి ముందు కూర్చొని న్యాయం చేయమని అడిగితే ఏంటి పరిస్థితి. అత్తయ్య అన్నట్లే నలుగురూ అనకముందే ఏదో ఒకటి తేలాలి. విడాకులు తీసుకుంటావో దూరంగా తరిమేస్తావో నీ ఇష్టం. అది మాత్రం దగ్గర్లో ఉండటానికి వీళ్లేదు. 


శోభ భర్తని రెచ్చగొడుతుంది. అనసూయ మాత్రం దీప జోలికి వెళ్లొద్దని అంటుంది. ఇక మరోవైపు దీప శౌర్యకు ఉప్మా తినిపిస్తుంది. ఇంతలో శౌర్య అనసూయ గురించి అడుగుతుంది. అప్పుడే సుమిత్ర అక్కడికి వస్తుంది. 


శౌర్య: అమ్మా నానమ్మ ఏది అంటే మాట్లాడవేంటి.
దీప: నానమ్మ ఊరు వెళ్లిపోయిందమ్మా. 
సుమిత్ర: దీపని దూరంగా తీసుకెళ్లి.. ఇప్పుడు చెప్పు మీ అత్తయ్య ఎక్కడ? మీరిద్దరూ నర్శింహ ఇంటికి వెళ్లారా. నీ కాపురం నిలబెడతాను. కొడుకుకు బుద్ధి చెప్పాను అని రాత్రి నాతో చెప్పింది కాదా ఏం చేసింది.  మాట్లాడారా.. మీ అత్తయ్య మీ ఆయనతో మాట్లాడిందా లేదా. ఇంతలో కార్తీక్ అటుగా వస్తాడు.
కార్తీక్: వీళ్లు ఈ టైంలో ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు.
సుమిత్ర: మీ ఆయనకు రెండో పెళ్లి గురించి అడిగిందా.
కార్తీక్: అంటే దీపకు వాడు చేసిన అన్యాయం ఇదా. ఆ అమ్మాయితో మాట్లాడిందా. మామూలుగా అయితే మాట్లాడటం కాదు. భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకున్నందుకు నీ భర్త మీద కేసు పెట్టాలి. 
కార్తీక్: అందుకే దీప వాడిని వదిలేసింది. వాడే తండ్రి అని ఇంకెప్పుడూ కూతురికి తెలియకూడదు అనుకుంటుంది.
దీప: రాత్రి మీ దగ్గర శపథాలు చేసిన మనిషి అక్కడికి వెళ్లిన తర్వాత నాకు చివాట్లు పెట్టింది. తాళి కట్టి భార్యని వదిలిసి అప్పులు చేసి ఊరి నుంచి పారిపోయిన తన కొడుకుది ఏ తప్పు లేదంట. తప్పంతా నాదే అంట. చివరికి తన కొడుకు రెండో పెళ్లిని కూడా సమర్దించింది. 
సుమిత్ర: అలా ఎలా సమర్దిస్తుంది దీప. పైగా ఆవిడ నీ మేనత్త కదా.
దీప: మేనత్త కాబట్టే ముఖం మీద తిట్టిందమ్మా. నీకు నీ కూతురికి మాకు ఏ సంబంధం లేదని చెప్పింది. ఎలా బతుకుతారో పోయి బతకండి అంది. ఇప్పుడు మా అత్తయ్యకి ఆ రెండో ఆవిడే కోడలు అంట. నాన్న పోయినప్పుడు కూడా నేను అనాథ అని ఫీలవలేదమ్మ. ఎందుకంటే మేనత్త ఆవిడ కొడుకు ఉన్నారు కదా. కానీ ఇప్పుడు మేం నిజంగానే అనాథలమయ్యాం అమ్మ. అలా అని నేను ఏడుస్తూ కూర్చొనమ్మా. నాకు ఎవరూ లేరు కానీ నా కూతురికి నేను ఉన్నాను. ఈ ఆకలి కష్టాలు ఏంటీ దానికి తెలీకూడదమ్మా. అందుకే నేను ఒక హోటల్‌లో పనిలో చేరాను. ఇంకా నా దగ్గర ఏదైనా ఉంది అంటే అది నా ప్రాణం ఒక్కటే. అది నా కూతురు. దానికి ఇవేమీ తెలీకూడదమ్మ. 
సుమిత్ర: నువ్వు ఇంత చెప్పిన తర్వాత ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు దీప. ఇంత జరిగిన తర్వాత మనం వాళ్లని వదలకూడదు. నీ భర్త మీద పోలీస్ కేసు పెట్టి నాలుగు తగిలిద్దాం.
కార్తీక్: పోలీస్ కేసు పెడితే కానీ ఆ వెధవకి బుద్ధి రాదు. 
దీప: వాళ్లే వద్దు అనుకున్నప్పుడు ఇక కేసులు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. వదిలేయండి అమ్మ. 
సుమిత్ర: నువ్వు ఎప్పటికీ అనాథ కాదు దీప. నువ్వు ఎక్కడా పని చేయనవసరం లేదు నేను నిన్ను చూసుకుంటాను. 
దీప: వద్దమ్మ ఉండటానికి ఇళ్లు ఇచ్చారు. తిండి పెడుతున్నారు. ఇది చాలమ్మ.
సుమత్ర: నీతో నాకు ఎక్కడో ఏదో తెగిపోయిన బంధాన్ని ఆ భగవంతుడు ఇలా ముడి వేశాడు. ఆ ముడి ఇక తెగిపోదు. నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఇలాగే ఉండు. నువ్వు సంతోషంగా ఉంటే చాలు దీప. నీకు ఈ అమ్మ ఉందన్న విషయం ఎప్పటికీ మర్చిపోకు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: బ్యాడ్‌న్యూస్‌ చెప్పిన విశ్వక్‌ సేన్‌ - మళ్లీ వాయిదా పడిన 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి', కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే