Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప ఇంటికి మల్లేశ్ వస్తాడు. కారులో వచ్చిన వాడెవడితో(కార్తీక్) నన్ను కొట్టించావు. ఇవాళ నా మగతనం ఏంటో నీకు చూపిస్తానే అని దీపను మల్లేశ్ బెదిరిస్తాడు. లోపలికి నడవవే అంటూ మల్లేశ్ దీపని అంటాడు.. దీంతో దీప ఒక్కసారి పక్కకు తప్పుకుంటుంది. అంతే మల్లేశ్ ఎదురుగా అతని భార్య కనకం నిల్చొంటుంది. షాక్ అయిపోతాడు మల్లేశ్.
మల్లేశ్: కనకం నువ్వేంటే ఇక్కడ..
కనకం: నీ మగతనం ఏంటో చూడటానికి వచ్చానురా. ఏంటిరా అన్నావ్ దీపకు మొగుడు అవుతావా అని లాగి ఒక్కటిస్తుంది.
మల్లేశ్: మనసులో.. ఇది నా పెళ్లానికి పట్టించేసింది. ఇప్పుడేం చేయాలి.
కనకం: తూ.. అప్పులు తీసుకునే వాళ్ల పెళ్లాలను పక్కలోకి పిలిస్తే పుట్టగతులు లేకుండా పోతావురా. ఆ ఉసురు మన పిల్లలకు తగులుతుంది. నాతోనేమో కింద పడి దెబ్బ తగిలింది అన్నావు. దీపతో ఏమో వాడెవడితోనో కొట్టించావ్ అన్నావు. నీలాంటి వంకర బుద్ధి ఉన్నవాడిని ఇలా కాదురా అని చెప్పు తీస్తుంది.
దీప: వద్దు అక్క నా బాధ నీకు అర్థమైతే చాలు.
కనకం: మగతోడు లేని ఆడదాని బతుకు తలుపు తెరిచిన ఇళ్లు లాంటిది దీప దారిన పోయిన ప్రతీ కుక్క దూరాలి అనుకుంటుంది. మంచోడు అయినా చెడ్డొడు అయినా మొగుడు మన పక్కనే ఉండాలి. నరసింహా యాడ ఉన్నాడో తెలుసుకొని నువ్వు తీసుకురా.. నువ్వు పదరా నీ తిమ్మిరి వదలగొడతా.. దీప కనకం మాటలు తలచుకొని ఆలోచిస్తుంది.
మరోవైపు పారిజాతం తన భర్త శివనారాయణ దగ్గరకు వచ్చి రెండు లక్షలు డబ్బులు అడుగుతుంది. దీంతో శివనారాయణ పారిజాతంతో నీ దుభారా మేకప్
ఖర్చులకు నెలకు మూడు లక్షలు అవుతుంది అని నువ్వే నాకు లక్ష ఇవ్వాలి అని ఎప్పుడిస్తావ్ అని అడుగుతాడు. పెట్టింది తింటూ ఇంట్లో ఉండమని లేదంటే ఇంటి నుంచి పంపేస్తా అంటాడు.
ఇక పారిజాతం బయటకు వెళ్లగానే తన పనివాడు బంటు వచ్చి డబ్బులు అడుగుతాడు. దీంతో పారిజాతం బంటుని కొడుతుంది. తన భర్తని డబ్బులు అడిగితే తిని ఓ మూలన కూర్చొమన్నాడు అని చెప్తుంది. ఇక సాయంత్రం పార్టీ ఉందని ఆ ఏర్పాట్లు చూడమని చెప్తుంది.
సాయంత్రం పార్టీలో అందరూ తాగి డ్యాన్సులు వేస్తారు. అందరూ జ్యోత్స్నను సినిమాల్లో ట్రై చేయమని అంటే జ్యోత్స్న మాత్రం తాను తన బావకు భార్యని అవుతాను అంటుంది.
ఇంతలో కార్తీక్ కారులో బొకే తీసుకొని పార్టీ దగ్గరకు వస్తాడు. జ్యోత్స్న కార్తీక్‌ని చూసి సర్‌ఫ్రైజ్ అవుతుంది. కార్తీక్ జ్యోత్స్నకు బొకే ఇచ్చి కంగ్రాట్స్ చెప్తాడు. తర్వాత రింగ్ ఇచ్చి విల్ యూ మ్యారీమీ అంటాడు. జ్యోత్స్న రింగ్ తీసుకొని నేను ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నా బావ అంటుంది. దీంతో కార్తీక్ బావ ఎవరు అని అడుగుతాడు. నువ్వే బావ అని జ్యోత్స్న అనగానే ఎదురుగా మరో అబ్బాయి నిల్చొని నేను నీ బావని కాదు నీ ఫ్రెండ్ గౌతమ్‌ని ఫ్యాషన్ టెక్నాలజీలో నీతో పాటు చదువుకున్న నీ ఫ్రెండ్‌ని అని అంటాడు. దీంతో జ్యోత్స్న గౌతమ్ ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తుంది. తనకు తన బావ కార్తీక్ అంటే ప్రాణమని చెప్తుంది. తాను పుట్టుకముందే తన బావతో పెళ్లి అయిపోయింది అని తాను మిసెస్ కార్తీక్ అని చెప్తుంది. దీంతో గౌతమ్ సారీ చెప్పి వెళ్లిపోతాడు.
అంత ఖరీదైన రింగ్ ఎందుకు ఇచ్చేశావ్ అని పారిజాతం జ్యోత్స్నను అడుగుతుంది. దీంతో సుమిత్ర అత్తయ్యపై సీరియస్ అవుతుంది. దొరికిపోయిన
పారిజాతం కవర్ చేస్తుంది. శివనారాయణ పారిజాతాన్ని తన మనవరాలు జ్యోత్స్నకు దూరంగా ఉండమని చెప్తాడు. ఉదయం సుమిత్ర అత్తయ్య అత్తయ్య అని అరుచుకుంటూ కిందకి వస్తుంది. పారిజాతం వచ్చి ఏమైంది అని సుమిత్రని అడిగితే మీ బంటు ఎక్కడ ఉన్నాడని అడుగుతుంది. పారిజాతం బంటుకి కాల్ చేస్తుంది. బంటు కాల్ కట్ చేసి ఇంట్లోకి వస్తాడు. సుమిత్ర బంటుని పట్టుకొని కొడుతుంది. మోసం చేశాడని క్యాసియర్‌కి అబద్ధం చెప్పి తన పేరున మూడు లక్షలు తీసుకున్నాడు అని లక్ష క్యాసియర్‌కి ఇచ్చాడని చెప్తుంది. కొంప ముంచావని పారిజాతం మనసులో అనుకుంటుంది. సుమిత్ర బంటుని బయటకు వెళ్లిపోమని అంటుంది. పారిజాతం బంటు వెళ్లిపోతే తన పనులు ఎవరు చేస్తారనుకొని బంటు మీద రివర్స్ అయి నాలుగు కొట్టి రివర్స్ డ్రామా ప్లాన్ చేసి బంటు ఇంటి నుంచి వెళ్లకుండా ఆపుతుంది.
మరోవైపు దీప తన తండ్రి ఫొటో పట్టుకొని బాధ పడుతుంది. ఇక కొంతమందిని తీసుకొని మల్లేశ్ తీసుకొని వస్తాడు. అప్పు ఇవ్వడం లేదని అడిగినందుకు అత్తాకోడళ్లు కొట్టారని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.