Actor Shivaji Raja About Roja: యాక్ట‌ర్ శివాజీ రాజా.. పేరు చెప్ప‌గానే గుర్తొచ్చేది 'అమృతం' సీరియ‌ల్. ఆ సీరియ‌ల్ లో ఆయ‌న క్యారెక్ట‌ర్ ఎప్ప‌టికీ గుర్తిండిపోతుంది. అది మాత్ర‌మే కాదు.. వంద‌ల సినిమాల్లో ఎన్నో మంచి మంచి క్యారెక్ట‌ర్లు చేశారు ఆయ‌న‌. ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. సినిమాలు, టీవీ సీరియ‌ళ్లు, టీవీ షోలు చేశారు. ప్రొడ్యూస‌ర్ గా కూడా స‌క్సెస్ అయ్యారు శివాజీ రాజా. అయితే, 'మొగుడ్స్ పెళ్లామ్స్' షో కి సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు ఆయ‌న‌. రోజా త‌న‌కు ఎంతో హెల్ప్ చేశార‌ని అన్నారు. 


ప్రొడ్యూస‌ర్ గా ఎంజాయ్ చేశాను... 


త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్ తో ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శివాజీరాజా త‌న కెరీర్ కి సంబంధించి చాలా విష‌యాలు పంచుకున్నారు. అమృతం టీమ్ అద్భుత‌మైన టీమ్ అని, ఆ సీరియ‌ల్ త‌న‌కు మంచి గుర్తింపు తెచ్చింద‌ని అన్నారు ఆయ‌న‌. "అమృతం టీమ్ అద్భుత‌మైన టీమ్. మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సీరియ‌ల్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాను. అప్పుడే 'మా' టీవీ కొత్త‌గా పెట్టారు. మొగుడ్స్, పెళ్లామ్స్ అనే ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. న‌న్ను దానికి చేయ‌మ‌ని అడిగారు. అప్పుడు నాకు టీవీ షోలు కొత్త‌. సురేఖ వాణికి కూడా కొత్త‌. అందుకే, దానికొక కామెడీ టైమింగ్ ని యాడ్ చేసి కొత్త‌గా నా స్టైల్ లో చేశాను. పాత పాట‌లు పెట్టి డిఫ‌రెంట్ గా ప్లాన్ చేశాం. తెలుగులో అలాంటి షో రావ‌డం మొద‌టిసారి. మా టీవీలో అది పెద్ద హిట్ షో. 'అమృతం'కి ఎంత పేరు వ‌చ్చిందో ఆ షోకి అంత పేరు వ‌చ్చింది. ఆ త‌ర్వాత‌ 'ఆల‌స్యం, అమృతం విషం' కి ప్రొడ్యూస‌ర్ గా మారాను. అప్పుడే అర్థం అయ్యింది డైలీ సీరియ‌ల్ చేయ‌డం ఎంత ఈజీ, ఏ ఎపిసోడ్ కి ఆ ఎపిసోడ్ చేయ‌డం ఎంత క‌ష్టం అనేది. సినిమాల్లో సంపాదించింది మొత్తం అందులో పెట్టేశాను. ప్రొడ్యూస‌ర్ గా ఎంజాయ్ చేశాను. ఆరు నంది అవార్డులు వ‌చ్చాయి" అని త‌న ప్రొడ్యూస‌ర్ జీవితం గురించి,  స‌క్సెస్ గురించి చెప్పారు శివాజీ రాజా. 


రోజా చాలా హెల్ప్ చేసింది.. 


"కొన్ని కార‌ణాల వ‌ల్ల‌.. సురేఖ వాణి షో మానుకోవాల్సి వ‌చ్చింది. ఆమె తిరుప‌తి మొక్కు ఇంకా వేరే కార‌ణాల వ‌ల్ల మానేసింది. ఆమె ప్లేస్ లో ఎవ‌రినైనా తీసుకురావాలి. నిజానికి అప్ప‌టికే మేం ఇద్ద‌రం ఆడియెన్స్ కి క‌నెక్ట అయ్యాం. ఎంత‌లా అంటే.. మేం ఇద్ద‌రు నిజంగా మొగుడు పెళ్లాలం అన్న‌ట్లుగా అయిపోయింది టాక్. ఇక ఆ ప్లేస్ ని రీప్లేస్ చేయాలంటే కొత్త అమ్మాయితో అవ్వ‌దు. నాకు కంఫ‌ర్ట్ గా ఉన్న అమ్మాయి కావాలి. తెలిసిన ఫేస్ కావాలి అనుకున్న‌ప్పుడు రోజా గుర్తొచ్చారు. రోజా నాకు క్లోజ్. అలా  రోజాని అప్రోచ్ అయ్యాను. రోజాకి ఫోన్ చేసి క‌ల‌వాలి అన్నాను. ఇంటికి వెళ్లి క‌లిశాను. మొగుడ్స్ పెళ్లామ్స్ చేస్తున్నాను నాతో చేయాలి అన్నాను. త‌ప్ప‌కుండా చేస్తాను అన్నారు. డేట్లు, రేట్లు రెండూ చెప్పేశాను. రోజా అప్ప‌టికే పెద్ద హీరోయిన్.. కానీ, సెట్స్ కి వ‌చ్చి రోజుకి మూడు ఎపిసోడ్ లు చేసేది. ఒక రోజు నేను ఫారిన్ వెళ్లాల్సి వ‌చ్చింది. ఆ రోజు ఒకేసారి ఐదు ఎపిసోడ్ లు చేసింది. పెద్ద హీరోయిన్ ఒకేరోజు అన్ని ఎపిసోడ్ లు చేసిందంటే సెట్ సెట్ అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. అంత హెల్ప్ చేశారు రోజా. అలా రోజాని ఫ‌స్ట్ టీవీకి ప‌రిచ‌యం చేసింది నేను. ఆ త‌ర్వాత ఆమె మిగ‌తా షోలు చేశారు" అంటూ రోజా గురించి గొప్ప‌గా చెప్పారు శివాజీ రాజా. 


Also Read: ‘ఔను, నేను రిలేష‌న్ షిప్‌లో ఉన్నా’ అంటూనే ట్విస్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ