Tillu Square Box Office Collection Day 1: ‘డీజే టిల్లు’తో రికార్డులు సృష్టించాడు సిద్దు జొన్నలగడ్డ. 2022లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు దానికి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మేకర్స్. ‘టిల్లు స్క్వేర్’ టైటిల్ తో సీక్వెల్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈసినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక కలెక్షన్స్ లో కూడా దూసుకుపోతోంది.
ఫస్ట్ డే కలెక్షన్ ఎంతంటే?
‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.23.7 కోట్లు దాటింది. ఇండియాలో కలెక్షన్ రూ.11.2 కోట్లు కాగా.. ఓవర్ సీస్ మొత్తం కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ.23.7 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి సంబంధించిన ఆక్యుపెన్సీ 70 శాతం ఉందని లెక్కలు చెప్తున్నాయి. మార్చి 29 సినిమా రిలీజ్ కాగా.. మార్నింగ్ షోలో 61.55 థియేటర్ ఆక్యుపెన్సీ కనిపించింది. మధ్యాహనానికి 69 శాతానికి పెరిగింది .. క్రమంగా పెరుగుతూ వచ్చింది. సాయంత్రానికి అది కాస్తా.. 72 శాతానికి చేరింది. ఇక హిట్, పాజిటివ్ టాక్ అందుకోవడంతో నైట్ షోలో ఆక్యుపెన్సీ 79 శాతం అయింది.
పాజిటివ్ రివ్యూలు..
‘టిల్లు స్క్వేర్’ సినిమాకి మొదటి నుంచే పాజిటివ్ రివ్యూలు వినిపించాయి. టిల్లన్న ఈసారి డీజే ఇంకా గట్టిగా కొట్టాడు అంటూ కామెంట్లు పెట్టారు అభిమానులు, సినిమా చూసిన వాళ్లు. ఇది పర్ఫెక్ట్ సీక్వెల్ అని కొంతమంది అభిప్రాయపడ్డారు. మేజిక్ రిపీట్ అయ్యిందని, థియేటర్లలో నవ్విస్తాడు అంటూ పోస్ట్ లు పెట్టారు. అనుపమ పరమేశ్వరన్ అయితే హాట్ గా ఉందని, సెగలు పుట్టించింది అంటూ కామెంట్లు వినిపించాయి. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇక వీకెండ్ కావడంతో.. కలెక్షన్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.
ప్రముఖ ఓటీటీకి రైట్స్..
ఈ సినిమా ప్రీ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ట్రైలర్, టీజర్ అన్నీ ఆకట్టుకున్నాయి. అనుపమ పరమేశ్వరన్ ని చూసిన వాళ్లు కూడా సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ.. నెట్ ఫ్లిక్స్ ‘టిల్లు స్క్వేర్’ ని కొనుగోలు చేసింది. ఇక శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా కొనుగోలు చేసిందట. భారీగానే డీల్ కుదిరినట్లుగా కూడా ఫిలిమ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2022లో 'డీజే టిల్లు పేరుతో థియేటర్లలో సందడి చేశాడు సిద్దూ జొన్నలగడ్డ. ఫస్ట్ పార్ట్ లో నేహా శెట్టి హీరోయిన్ గా చేశారు. ‘టిల్లు స్క్వేర్’ లో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక కాగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై తెరకెక్కింది. సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతలు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి స్వరకర్తలు.