Hero Suman Shocking comments: హీరో సుమన్.. పరిచయం అక్కర్లేని పేరు. వందలాది సినిమాలు చేశారు. హీరోగా, విలన్ గా తనదైన శైలీలో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల ఆయన తమ్మారెడ్డి భరద్వాజ్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రజనీకాంత్, పవన్ కల్యాణ్ పై రోజా, కొడాలి నాని చేసిన కామెంట్స్ కరెక్ట్ కాదని, అలానే రోజా పర్సనల్ క్యారెక్టర్ పై కొంతమంది చేసిన కామెంట్స్ కూడా తప్పు అని అన్నారు.
జనగ్‌ను తిట్టలేదు కదా?
రజనీకాంత్ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని పొగడటంపై ఆయనపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయంపై సుమన్ స్పందిస్తూ.. "రజనీకాంత్ క్యారెక్టర్ చాలా గొప్పది. ఆయన అందరికీ చాలా గౌరవం ఇస్తారు. ఏది అనుకుంటే అదే మాట్లాడతారు. నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆయన. ‘శివాజీ’ సినిమాలో నేను విలన్ గా చేసినప్పుడు చాలా బాగా ట్రీట్ చేశారు. ఉన్నది ఒక్కటే లైఫ్. దాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటారు ఆయన. నిర్మాతకు చాలా గౌరవం ఇస్తారు. కరెక్ట్ టైంకి వచ్చేస్తారు. అలాంటి మంచి మనిషి ఆయన. చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఉన్న లీడర్, అడ్మినిస్ట్రేటర్ అని అన్నారు. నిజమే కదా అది. చంద్రబాబు చేసింది చెప్పారు. ఆయనేమి జగన్ ని తిట్టలేదు. దానికి ఆయన్ను విమర్శించారు. చాలా బాధ అనిపించింది. చంద్రబాబు తప్పు చేస్తే తప్పు చేశారు అని చెప్పే క్యారెక్టర్ రజనీకాంత్ ది. అలాంటిది రోజా, కొడాలి నాని ఇంకా చాలామంది ఆయన్ను విమర్శించినప్పుడు చాలా బాధ అనిపించింది. అందుకే, స్పందించి అలా అనడం తప్పు అని ఖండించాను. ఆయనతో కలిసి ట్రావెల్ చేసిన వ్యక్తిని, ఆయన వ్యక్తిత్వం తెలిసిన వాడిని అందుకే, బాధ అనిపించింది" అని అన్నారు సుమన్.
పర్సనల్ గా తిట్టడం తప్పు..
ఇక అదే ఇంటర్వ్యూలో ఆయన పవన్ కల్యాణ్ గురించి కూడా మాట్లాడారు. "పవన్ కల్యాణ్ మూడు కాకపోతే 30 మందిని చేసుకుంటారు. వాళ్లేమి మీకు కంప్లైంట్ ఇవ్వలేదు కదా. రాజకీయంగా మాట్లాడాలి, రాజకీయంగా విమర్శించాలి. అంతేకానీ పర్సనల్ గా మాట్లాడటం తప్పు. ఒక యాక్టర్ గా బాధ అనిపించింది. మీ పార్టీలో కూడా ఇద్దరు పెళ్లాలు ఉన్నవాళ్లు ఉన్నారు కదా? ఎందుకు పర్సనల్ గా అలా మాట్లాడతారు. అంతేకాదు.. రోజాపై విమర్శలు చేసినప్పుడు కూడా నేను ఖండించాను. ఒక అమ్మాయిని అలా అనడం తప్పు అన్నాను. మమ్మల్ని బూతులు తిడుతుంది అన్నారు. ఆ అమ్మాయి ఫస్ట్ నుంచే ఫైర్ బ్రాండ్ లానే చేస్తుంది. ఆడవాళ్లను అలా అనడం కరెక్ట్ కాదు అని చెప్పాను. మీ పార్టీలో కూడా అలాంటి ఆడవాళ్లు ఉంటారు అని అన్నాను. నిజానికి రజనీకాంత్ విషయంలో ఎవరైనా స్పందిస్తారేమో అని వెయిట్ చేశాను. కానీ, ఎవ్వరూ మాట్లాడలేదు. అందుకే.. ఒక రోజు తర్వాత ఈవెంట్ కి వెళ్లినప్పుడు మాట్లాడాను" అని తన అభిప్రాయలను చెప్పారు సుమన్.
Also Read: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!