Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కాశీ రాత్రి దీప ఇంటికి వస్తాడు. కాశీని పారిజాతం చూస్తుంది. దీపకి కాశీ, స్వప్నల ప్రేమ విషయం శ్రీధర్ రెండో పెళ్లి గురించి తెలుసని పారిజాతానికి తెలియకపోవడంతో ఇప్పుడు కాశీ తన ప్రేమ విషయం చెప్పడానికే దీప దగ్గరకు వచ్చాడని అనుకొని కంగారు పడుతుంది.  


పారిజాతం: మా ఇంటి గుట్టు దీపకి తెలిస్తే ఇంక నా మనవరాలి పెళ్లి ఆగిపోయినట్లే. 
కాశీ: అక్క నీ ఫోన్ పని చేయదేంటి. రేపు ఉదయం స్వప్నకి వాళ్ల నాన్న వెంకటేశ్వర స్వామి గుడిలో వేరే అబ్బాయితో పెళ్లి చేస్తున్నాడు. 
దీప: ఎవరు చెప్పారు.
కాశీ: స్వప్న కోసం వాళ్ల ఇంటికి వెళ్తే అక్కడ వాళ్లు మాట్లాడుకోవడం విన్నాను.
దీప: నాకు అంతా అర్థమైంది కాశీ. మీ నానమ్మ వస్తుంది ఈ విషయం ఆవిడకు చెప్పకు. 
పారిజాతం: ఏరా కాశీ ఎప్పుడు వచ్చావ్. నీకు సొంత నానమ్మ కంటే ఈ దీపే ఎక్కువ అయిపోయిందా. 
కాశీ: నువ్వు అయితే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు కదా మాట్లాడవే.
పారిజాతం: దీపతో నీకేంటిరా పని.
కాశీ: పని మీదే వచ్చాను. ఆఫీస్‌లో పార్టీ ఉంది. వంటలు చేయమనడానికి వచ్చాను. అక్క చెప్పింది గుర్తింది కదా రేపు ఉదయం 11 గంటలకు.
దీప: సరే కాశీ నువ్వు చెప్పినట్లే చేస్తా నువ్వు టెన్షన్ పడకు ఇక వెళ్లు.
పారిజాతం: రేయ్ కాశీ నువ్వు దీపతో ఏదో చెప్పావ్ కదా నీ ప్రేమ గురించి చెప్పావా.
కాశీ: లేదు రెండు నెలల వరకు మా నాన్న ఆగమని చెప్పాడు.
పారిజాతం: చెప్పాడా.
కాశీ: అంటే నువ్వు చెప్పమని చెప్పవా.. 
పారిజాతం: నాకేం సంబంధం లేదురా.
కాశీ: సరేలే నేను ఆగుతాలే పెళ్లి రెండు నెలల తర్వాత అయితే ఏంటి రెండేళ్ల తర్వాత అయితే ఏంటి. అప్పుడప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయ్ అక్కకి చెప్పు.
దీప: ఈ పెళ్లి జరిగితే స్వప్న బతకదు. కార్తీక్ బాబుకి చెప్తే టెన్షన్ పడతారు.  ఈ సమస్య నేనే పరిష్కరిస్తా. ఇక దీప సుమత్ర దగ్గరకు వెళ్లి గుడికి పిలుస్తుంది. సుమిత్ర ఒక్కరికే రమ్మని చెప్తుంది. 



కావేరి కూతురిని పెళ్లి కూతురిలా రెడీ చేస్తుంది. పెళ్లి కూతురు కన్నీళ్లు పెట్టకూడదని కావేరి చెప్తే స్వప్న ఈ పెళ్లి జరిగితే జీవితాంతం నాకు కన్నీళ్లే దిక్కు అని అంటుంది. దానికి శ్రీధర్ స్వప్నతో నీకు శ్రీకాంత్ కన్నీళ్లు పెట్టించకుండా చూసుకుంటాడని అంటాడు. ఎప్పుడూ దేనికి అడ్డుచెప్పని మీరు ఈ పెళ్లి విషయంలో నాకు ఇష్టం లేదని తెలిసి కూడా ఎందుకు ఇంత పట్టు పడుతున్నారని స్వప్న తండ్రిని ప్రశ్నిస్తుంది. కాశీ లేకుండా నేను బతకలేను అని స్వప్న అంటే నువ్వు ఉంటే కాశీ బతకడని ఆ గుడి చుట్టు పక్కలకు వచ్చినా పెళ్లి ఆపాలి అని చూసినా వాడు బతకడని అంటాడు. తండ్రి మాటలకు స్వప్న షాక్ అయిపోతుంది. నీ ప్రేమ నిజమైతే కాశీ క్షేమంగా ఉండాలని చెప్తాడు. కాశీ క్షేమంగా ఉండాలంటే ఈ పెళ్లి చేసుకో అని అంటాడు. ఇక భార్య, పిల్లల్ని తీసుకొని క్యాబ్‌లో గుడికి వెళ్తాడు. 


సుమిత్ర కూడా గుడికి చేరుకుంటుంది. దీప గురించి సుమిత్ర వెతుకుతుంది. శ్రీధర్ వాళ్లు కూడా వచ్చేస్తారు. దీప ఇద్దరినీ చూస్తుంది. సుమిత్ర దీపకి కాల్ చేస్తుంది. దానికి దీప దారిలో ఉన్నా నేను వచ్చే వరకు బయటే ఉండండని చెప్తుంది. శ్రీధర్ గుడి లోపలకు వస్తూ సుమిత్రను చూస్తాడు. దాంతో శ్రీధర్ కావేరి వాళ్లని లోపలకు వెళ్లమని చెప్తాడు. స్వప్న, కావేరిలు పెళ్లి దగ్గరకు వచ్చేస్తారు. ఇక శ్రీకాంత్‌ని ఒప్పించాలి  అని స్వప్న చెప్పినా వినడు. ఇక కాశీ దూరం నుంచి చూస్తూ ఉంటాడు.   దీపకి కాల్ చేసి రమ్మని పిలుస్తాడు. మరోవైపు కావేరి భర్త కోసం బయటకు వస్తుంది. కావేరికి కనిపించకుండా శ్రీధర్ దక్కుంటాడు. ఇక కావేరి, సుమిత్ర దగ్గర్లో నిల్చొంటుంది.. సుమిత్ర దీపకి, కావేరి తన భర్తకి కాల్ చేస్తుంది. ఇద్దరూ వచ్చేస్తాం అని అంటారు. శ్రీధర్ దూరం నుంచి చూస్తూ సుమిత్ర పక్కన నొల్చొని ఫోన్ చేస్తుంది ఇదేం మాట్లాడినా నష్టం నాకే కదా అని అనుకుంటాడు. ఇక దీప సీక్రెట్‌గా పెళ్లి దగ్గరకు వెళ్తుంది. 


దీప వెళ్లి శ్రీకాంత్‌తో ఈ పెళ్లి జరగదని అంటుంది. స్వప్న దీపని పట్టుకొని ఏడుస్తుంది. ఇక పంతులతో దీప మొత్తం తెలిసి పెళ్లి జరగదని చెప్తుంది. ఇక శ్రీకాంత్‌ని ఆస్తి కోసమే కదా ఈ పెళ్లి చేసుకుంటున్నావ్ అని అంటుంది. దానికి శ్రీకాంత్ మా సార్ చేసుకోమన్నారు చేసుకుంటున్నా అంతే అని అంటాడు. దానికి దీప ఇప్పుడే మీ సార్‌కి కాల్ చేయ్ ఆయన ఇప్పుడే వస్తే మీ పెళ్లి చేస్తా లేదంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటుంది. శ్రీకాంత్ ఫోన్ చేస్తే శ్రీధర్ లిఫ్ట్ చేయకపోవడంతో కోపంతో శ్రీకాంత్ వెళ్లిపోతాడు. పంతులు కూడా వెళ్లిపోతాడు. ఇక మా ఇద్దరికీ ఇప్పుడే పెళ్లి చేయు అక్క అని కాశీ దీపని అడుగుతాడు. దాంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


  Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: తల్లిదండ్రులకు తన చేతిలో తినిపించి కన్నీళ్లు పెట్టుకున్న కనకం.. చీర కానుక!