Meghasandesham Serial Today Episode:  ఇంటికి వచ్చిన నక్షత్ర, గగన్‌ ను గుర్తు చేసుకుంటూ లవ్‌ లో పడుతుంది. గగన్‌ చేసిన ఫైట్‌ ను గుర్తు చేసుకుంటూ వాడు మగాడు మమ్మీ.. ఇన్ని రోజులు వాడి పౌరుషాన్ని తక్కువ అంచనా వేశాను అనుకుంటుంది. మరోవైపు భూమి కూడా గగన్‌ ను గుర్తు చేసుకుంటుంది. గగన్‌ షర్ట్‌ తీసుకుని హత్తుకుని గగన్‌ ను హత్తుకున్నట్లుగా  ఫీలవుతుంది. గగన్‌ వచ్చి తనను హగ్‌ చేసుకున్నట్టు కలగంటుంది. ఇంతలో గగన్‌ వస్తాడు.

గగన్‌: ఏం చేస్తున్నావు.. నా షర్ట్‌ నువ్వు ఎందుకు వేసుకున్నావు. పైగా డాన్స్‌ కూడా చేస్తున్నావు.

భూమి: అదీ.. అదీ.. అదీ..

గగన్‌: ఓ మొన్నేమో చంద్రముఖి డ్రెస్‌ తో డాన్స్‌ చేశావు. ఇప్పుడు నా షర్టుతో డాన్స్‌ చేస్తున్నావా? ఈ డ్రెస్సుల పిచ్చి ఏంటి నీకు.

భూమి: ఓ ఈయనకు అలా అర్థం అయిందా? ( మనసులో అనుకుంటుంది.)

గగన్‌: ఏంటి ఇంకా అలా చూస్తున్నావు. నా షర్టు నాకు ఇచ్చేయ్‌.

భూమి: అమ్మా అర్థం అవుద్ది. చెల్లెలు అర్థం అవుద్ది. ఆఫీసులో జనం అర్థం అవుతారు. నా మనసు మాత్రం అర్థం కాదు.

గగన్‌: ఏయ్‌ తైతక్కా ఏంటి గులుగుతున్నావు.

భూమి: ఏం లేదు తలతిక్క గారు

గగన్‌: ముందు షర్టు ఇలా ఇవ్వు.

 అని షర్టు తీసుకుని గగన్‌ వెళ్ళిపోతాడు. భూమి ఆ షర్టు నేను వేసుకున్నాను తర్వాత అదే షర్టు ఆయన వేసుకుంటారుగా అని హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు ఇందు పెళ్లి కోసం అందరూ బట్టల సెలెక్షన్‌ చేస్తుంటారు.

మీరా: వదిన ఈ చీర నీకు బాగుంటుంది చూడు.

బిందు: అమ్మా ఈ చీర చూడు ఈ రంగు నీకు భలే ఉంటుంది.

శాంతమ్మ: ముందు పెళ్లి కూతురిని చీరలు తీసుకోమనండి.

శరత్‌: కావాలంటే అన్ని చీరలు తననే తీసుకోమనండి.

ఇందు: నాకు చీరలైనా నగలైనా అత్తయ్య బాగున్నాయి అన్నవే తీసుకుంటాను.

అపూర్వ: చాలా బాగుంది కదా? ఇదైతే ఇంకా బాగుంది. ఇది పక్కన పెట్టు.. ఇది తీసుకుందాం.

ఇందు: చాలా బాగుంది అత్తయ్యా..

అపూర్వ: మీరా నీకు నచ్చినవి తీసుకో..

ప్రసాద్‌: మీరా నీకు నేను కొంటాను కానీ ముందు ఇందుకు ఏం కావాలో చూడు.

మీరా: అలాగే

ఇందు: నాకు అత్తయ్యా సెలెక్ట్‌ చేసినవి చాలు.

శాంతమ్మ: మొత్తానికి ఈ ఇంట్లో మొదటి పెళ్లి ఇందుది జరగబోతుంది.

మీరా: తర్వాతది చెర్రి, నక్షత్రదే కదా?

శాంతమ్మ: వాళ్లిద్దరికా..?

మీరా: అవును అత్తయ్య గారు. మా అన్నయ్య కూతురు ఉండగా నాకు ఎవరో కోడలుగా రావడం ఎందుకు.

 అనగానే శరత్‌ చంద్ర వాళ్లిద్దరికీ ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు అంటాడు. దీంతో మీరా నక్షత్రను  అడుగుతానని.. బిందు చెర్రీని  అడుగుతానని వెళ్లి అడగి మీరిద్దరు మాట్లాడుకుని చెప్పండని వెళ్లిపోతారు. ఇద్దరూ ఒకరికొకరు ఇష్టం లేదని చెప్పుకుంటారు. ఇద్దరూ కిందకు వచ్చి తమకు ఇష్టం లేదని చెప్తారు. తర్వాత ఇందును పెళ్లి చేసుకునే వంశీ ఇందును తీసుకుని హోటల్‌ కు వెళ్తాడు. అక్కడే గగన్‌ ఆఫీసు మీటింగ్‌ లో ఉంటాడు. ఇందు, వంశీలను చూస్తాడు. ఇద్దరూ హోటల్‌ రూంలోకి వెళ్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.

ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!