Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ వంటల్ని విహారి లొట్టలేసుకొని తింటాడు. ఇక లక్ష్మీ రోడ్ల మీద పరుగులు తీస్తూ తండ్రిని ఒక్కసారి చూసే అవకాశం ఇవ్వు తండ్రి అని మొక్కుకుంటుంది. నడిరోడ్డు మీద కూల బడి ఏడుస్తుంది. మరోవైపు అంబిక, సుభాష్‌లకు ముద్ద దిగదు. 


విహారి: అత్త నువ్వు చెప్పిన వాళ్లకి ప్రాజెక్ట్ ఇవ్వలేని ఫీలవుతున్నావా.
అంబిక: నువ్వు చెప్పిందే నిజం విహారి అర్హత లేని వారిని సింహాసనం మీదకు ఎక్కిస్తే ఆ సింహాసనం విలువ కూడా తగ్గిపోతుంది.
విహారి: పోనీలే అత్త నువ్వు అర్థం చేసుకున్నావ్ అది చాలు ఈ ప్రాజెక్ట్ నాకు తెలిసిన వాళ్లకు ఇచ్చేద్దామనుకుంటున్నా నా నిర్ణయాన్ని నువ్వు గౌరవిస్తావని అనుకుంటున్నా.
అంబిక: నీ అనుభవం కూడా మన కంపెనీకి అవసరం.
విహారి: అత్త నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి చూస్తున్నా నేను అమెరికాకి వెళ్లిపోతే మొత్తం ఎప్పటిలా నువ్వే చూసుకోవాలి. 
అంబిక: అవును విహారి మిడి మిడి జ్ఞానంతో మిడిసి పడుతున్నావ్ కదా నిన్ను తొక్కేస్తా. 


మరోవైపు అంబిక తన అహం మీద విహారి దెబ్బ కొట్టాడని అంతకంత పగ తీర్చుకుంటానని రగిలిపోతుంది. ఇక లక్ష్మీ వస్తుంది. రామ్ కొంచెం అన్నం మిగిలిపోయిందని పడేసి ఇస్తానని అంటే కనకం వద్దని ఎవరైనా దారిలో ఆకలితో ఉంటే ఇస్తానని అంటుంది. ఇక విహారి బాక్స్‌ల మీద నైస్ ఫుడ్ అని రాస్తాడు. అది కనకం చూసి సంతోషపడుతుంది. ఇక బస్‌స్టాప్‌లో ఆదికేశవ్, గౌరీలు కూర్చొంటారు. భర్తని తోసేసి నందుకు గౌరీ ఏడుస్తుంది. అవన్నీ వదిలేయమని ఆదికేశవ్ ధైర్యం చెప్తాడు. కనకం తండ్రికి జరిగిన అవమానం గుర్తు చేసుకొని వెళ్తుంటుంది. దారిలో బస్‌స్టాండ్‌లో ఉన్న తల్లిదండ్రులను చూస్తుంది. 



లక్ష్మీ: అమ్మానాన్న ఇన్ని రోజులు పాటు మీకు ఎప్పుడూ దూరంగా లేను. కానీ ఇప్పుడు ఉన్నాను మళ్లీ ఎప్పుడు దగ్గరవుతానో తెలియనంతా దూరంగా ఉన్నాను. చాలా బాధగా ఉంది. మీ గుండెల మీద తల వాల్చుకోవాలని ఉంది నాన్న. భోజనం సమయం దాటిపోయింది అమ్మానాన్న తిన్నారో లేదో. ఇప్పుడు వాళ్లతో ఎలా మాట్లాడాలి ఎలా కలుసుకోవాలి. అని పక్కనే ఉన్న షాప్‌లో బురఖా తీసుకుంటుంది. అది వేసుకొని క్యారేజీ పట్టుకొని తల్లిదండ్రుల పక్కన కూర్చొంటుంది. 
ఆదికేశవ్: అమ్మా మేం పల్లెటూరి నుంచి వచ్చా నీకు మా భాష అర్థమవుతుందా.
లక్ష్మీ: అర్థమవుతుంది. 
ఆదికేశవ్: కనకం గురించి గొప్పలు చెప్తాడు. అమెరికా పంపానని చెప్తాడు. 
లక్ష్మీ: అమెరికాలో హ్యాపీగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావ్ నాన్న కానీ ఓ అబద్ధపు జీవితం గడుపుతున్నాను. 


మీరు హైదరాబాద్ ఎందుకు వచ్చారని కనకం తండ్రిని అడిగి ఆయనకు అవార్డు వచ్చిందని చెప్పి షీల్డ్ చూపిస్తే పట్టుకొని మురిసిపోతుంది. ఇక కనకం తండ్రిని ఏమైనా తిన్నారా అని అడుగుతుంది. ఇక టైంకి తినాలి అని తినకపోతే మీ ఆరోగ్యం పాడైపోతుందని అంటుంది. దాంతో ఆదికేశవ్, గౌరీలు కనకాన్ని గుర్తు చేసుకుంటారు. ఇక కనకం వాళ్లకి అన్నం ముద్దలు కలిపి పెడుతుంది. మా కనకం చేసినట్లే ఉందని అడిగి మరి ఎమోషనలై అయి తింటారు. కనకం కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. వంట చాలా బాగా చేశావ్ మా కనకం గుర్తు చేశావని అంటాడు. ఇక కనకం పదహారు రోజుల పండగ చేసేవాళ్లమని గౌరీ అంటుంది. ఇక ఆదికేశవ్, గౌరీలు కారు రావడంతో బయల్దేరుతారు. ఇక ఇవ్వడానికి మా దగ్గర ఏం లేదని మా తమ దగ్గరున్న చీరని ఇస్తారు. కనకం చీరని కళ్లకు అద్దుకొని తీసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


Also Read: అమ్మాయి గారు సీరియల్: రాఘవని కాపాడిన రాజు, రూప.. విరూపాక్షి సమస్యని పరిష్కరిస్తారా.. సూర్యప్రతాప్ భార్యని నమ్ముతాడా?