Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode పారిజాతం కార్తీక్ రెస్టారెంట్‌కి వెళ్లి జ్యోత్స్న నిశ్చితార్థానికి క్యాటరింగ్ ఇస్తుంది. కార్తీక్, దీపలు రావడంతో జ్యోత్స్న కంగారు పడుతుంది. పారిజాతం రావడంతో హడావుడిగా తీసుకెళ్తుంది. కార్తీక్, దీపలు లోపలికి రాగానే మేనేజర్ క్యాటరింగ్ గురించి చెప్తాడు. డిటైల్స్ ఇచ్చారా అంటే శివన్నారాయణ పేరు రాసి పారు నెంబరు రాసి వెళ్లిపోతుంది. అది చూసిన కార్తీక్ ఎవరు వచ్చారు పేరు ఏంటి అంటే మేనేజర్ తెలీదు అంటే కార్తీక్ పారు ఫొటో చూపించి ఈమెనా అంటే అవును అంటాడు. దాంతో మనల్ని అవమానించడానికే ఇలా చేశారు. ఇప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ చేతే 6 లక్షలు ఇవ్వాలి కదా అందుకే వాళ్ల ఇంటికి వెళ్లి మెనూ తీసుకుందాం పద అని కార్తీక్, దీపని తీసుకొని వెళ్తాడు.
మరోవైపు సుమిత్ర చీరలు ముందు వేసి జ్యోత్స్న, పారులు సెలక్షన్ చేస్తారు. దశరథ్ కూడా వస్తారు. అందరూ సందడిగా చీరలు సెలక్షన్ చేస్తుంటారు. ఇంతలో కార్తీక్ వాళ్లు వస్తారు. పారు చూసి షాక్ అవుతుంది. కార్తీక్ వాళ్లు వచ్చారని పారు చెప్తుంది. కాంచనతో మాట్లాడటం వల్లే వాళ్లు వచ్చుంటారు అని అనుకొని అందరూ వెళ్తారు. కార్తీక్ వెళ్లి సుమిత్రను మేడం మెనూ చెప్పండి అంటే క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చారు కదా అందుకే వచ్చాం అంటారు. ఎవరు అర్డర్ చేశారు అని అంటే పారిజాతం ఇచ్చారని అంటుంది.
పారిజాతం జ్యోత్స్న చెప్తే చేశానని అంటుంది. జ్యోత్స్న తల్లిదండ్రులతో అత్త ఫ్యామిలీ నిశ్చితార్థానికి రావాలి అన్నారు కదా అందుకే అని చెప్తుంది. సుమిత్ర జ్యోత్స్నని తిట్టి వదిన ఈ ఇంటి ఆడపడుచుగా రావాలి అనుకున్నాం కానీ భోజనాలు వడ్డించే మనిషిగా కాదని చెప్తుంది. కార్తీక్ సార్ అని దశరథ్‌ని అంటాడు. సార్ మేడం అంటూ దూరం అయిపోండిరా అని దశరథ్ అంటే మేం బయటకు అడుగు వేయడం వల్లే మాకు మేం ఏంటో తెలిసిందని కార్తీక్ అంటాడు.
దశరథ్: నువ్వు వేసిన అడుగు బయట పడలేదు. మా అన్నాచెల్లెళ్ల మధ్య పడింది. తండ్రీ కూతుళ్ల మధ్య పడింది. తండ్రీ కొడుకుల మధ్య పడింది. నా కూతురి నిశ్చితార్థం ఇది నా జీవితంలో మళ్లీ తిరిగిరాని ఓ గొప్ప వేడుక. దీనిలో నా చెల్లి కుటుంబం ఉండాలి అని కోరుకోకూడదా.
కార్తీక్: మళ్లీ కాస్త వెనక్కి వద్దాం. ఈ ఇళ్లు నాకు శివరేఖ ఈ గడప దాటి ఈ ఇంటి మనవడిగా రాలేను. నా పరిస్థితే నీది కూడా. తండ్రి మాట కాదని మమల్ని లోపలికి తీసుకురాగలవా.
దశరథ్: నా వయసులో సగం ఉన్న నీకే అంత పట్టింపు ఉంటే నా వయసుకు రెట్టింప ఉన్న నా తండ్రికి ఇంకెంత పట్టింపు ఉంటుందిరా. నేను నీ అంత ధైర్యంగా పంతం తెంపుకోలేను.
కార్తీక్: ఇప్పుడు తాతయ్యకి కోపం వచ్చి దశరథా నీ భార్యని వదిలేయ్ అని అంటే వదిలేస్తావా. నా భార్య ఎవరికో నచ్చలేదని నా భార్య పేరు మీద రెస్టారెంట్ పెట్టడం ఎవరికో నచ్చలేదని నేను ఎందుకు వదులుకోవాలి. నా కూతురికి నిశ్చితార్థం అని చెప్పావు కానీ నువ్వు కుటుంబంతో కలిసి రావాలి అని చెప్పలేకపోయాం. పిలవనందుకు నువ్వు ఎంత బాధ పడుతున్నావ్ నాకు తెలీదు కానీ ఆ పిలుపు రాలేదని నా తల్లి ఎంత బాధ పడిందో నాకు తెలుసు. నా తల్లి పోతే నీకు ఇంకో చెల్లి దొరుకుతుందా మామయ్య నీకు. రాదు ఈ జన్మలో నా చెల్లి అని చెప్పుకోవడానికి నీకు ఇంకొకరు దొరకరు.
దశరథ్: కరెక్టేరా నా రక్తం పంచుకుపుట్టిన చెల్లే ఇంత ప్రాణం అయితే జన్మనిచ్చిన తండ్రి ఏమవుతాడురా. చెల్లి కోసం గడప దాటితే నా తండ్రి బాధ పడతాడు. నీ తల్లి కన్నీరు నువ్వు చూశావు కానీ నా కన్నీరు ఈ ఇంటి అద్దానికి తప్ప నా భర్యకి కూడా తెలీదురా. తెగించడానికి క్షణం పట్టదు కానీ భరించడానికి జన్మ సరిపోదు. చాలా భరిస్తున్నానురా. చాలా భరిస్తున్నాను.
సుమిత్ర దీపతో ఆధారాలు ఎందుకు తీసుకురాలేదని అడుగుతుంది. ఇక ఆ విషయం వదిలేయమని దీప అంటే నువ్వు అపార్థం చేసుకున్నావ్ అంతే కదా అంటుంది. ఆ విషయాన్ని నేను వదిలేస్తాను లోపలికి రా కార్తీక్ అంటే దానికి కార్తీక్ మెనూ ఇవ్వమని చెప్తాడు. వద్దు అని సుమిత్ర అంటే పెద్దాయన్ని పిలవమని అంటాడు. ఇంతలో శివన్నారాయణ బయట నుంచి వస్తాడు. అందరూ టెన్షన్ పడతారు. వీళ్లు ఎందుకు వచ్చారు దీప ఆధారాలు తీసుకొచ్చిందా అంటే మెనూ కోసం వచ్చామని అంటాడు కార్తీక్. ఎవరు అని తాత అడిగితే కాబోయే పెళ్లి కూతురు అని జ్యోత్స్న చెప్తుంది. మెనూ ఫోన్లో చెప్తాం మీరు వెళ్లండి అని చెప్పి జ్యోత్స్నని లోపలికి పిలుస్తారు. ఇంటికి వచ్చి మనం ఏం సాధించాం అని దీప అంటుంది. అనవసరంగా గొడవ పెట్టారని కార్తీక్‌తో అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ఓ అవకాశం.. మనీషాకి తెలీకుండా HCG టెస్ట్ చేసేదెలా?