కార్తీకదీపం ఆగస్టు 12 శుక్రవారం ఎపిసోడ్ (Karthika Deepam August 12 Episode 1429)


నాపై ప్రేమలేదు నన్ను వెతకలేదని ఆవేదన చెందుతుంది శౌర్య...అప్పుడు గతం గుర్తుచేస్తుంది సౌందర్య. నిన్ను వెతుక్కుంటూ వస్తే నువ్వేకదా రానన్నావని గుర్తుచేస్తుంది. ఇప్పుడు కూడా అది ఉంటే నేను ఉండలేను. దాని అద్భుతమైన నటనని చూడలేకపోతున్నాను
సౌందర్య: మనం ఎదుటివారిని ఏ దృష్టితో చూస్తే అలాగే కనిపిస్తారు
శౌర్య: నానమ్మా నీతిబోధలు నాకు చెప్పొద్దు, అడుగడుగునా నాటకాలు అబ్బో భరించలేకపోతున్నాను, నేనెవరో కొత్తవారింటికి వచ్చినట్టు అనిపిస్తోంది.
హిమ: ఈ ఇంట్లో నాకెంత హక్కుందో నీక్కూడా అంతే హక్కుంది. ఈ ఇంటిమీద మనుషుల మీద నీక్కూడా బాధ్యత ఉంటుంది కదా..
శౌర్య: బాధ్యత అనే పదం నీ నోటివెంట వింటేనే చిరాగ్గా ఉంది...బాధ్యత అంటూ చాలా చేశావ్ కదా ( నిరుపమ్ బావకి నీకు పెళ్లిచేసే బాధ్యత నాది అని గతంలో మాటిచ్చిన విషయం గుర్తుచేసుకుంటుంది)
హిమ: ఇప్పటికీ అదే మాటపై ఉన్నాను శౌర్యా..
సౌందర్య-ఆనందరావు: పెళ్లి పనులతో ఇల్లంతా హడావుడిగా ఉంటే నువ్వింకా ఆ మాటలు మాట్లాడుతున్నావేంటి
శౌర్య: మీకే తలనొప్పిగా ఉంటే నాకెలా ఉండాలి అందుకే నాకు కంపరంగా ఉంటుంది


Also Read: పెళ్లి ఆపేందుకు ప్లాన్ చేస్తున్న హిమ-ప్రేమ్, తగ్గేదే లే అంటున్న శౌర్య, పగతో రగిలిపోతున్న శోభ


పూలు,పళ్లు, బట్టలు అన్నీ సిద్ధం చేశారా అని తెగ హడావుడి చేస్తుంటుంది స్వప్న. ప్రేమ్ ఎక్కడున్నాడని వెతుకుతుంటుంది స్వప్న. అటు ప్రేమ్ మాత్రం హిమ ఫొటో చూస్తూ కూర్చుంటాడు. ఇంతలో నిరుపమ్ వచ్చి ఫోన్ లాక్కుని ఏం చేస్తున్నావ్ అంటాడు. హిమ ఫొటో నిరుపమ్ చూడకుండా జాగ్రత్తపడతాడు ప్రేమ్. ఇక్కడేం చేస్తున్నారని సత్యం, స్వప్న వస్తారు. 
స్వప్న: ఈ పెళ్లికి ఫొటోలు, వీడియోలు నువ్వే తీయాలి
నిరుపమ్: అవెలా ఉండాలంటే ఓ రేంజ్ లో ఉండాలి, ఎవరీ వీడియో గ్రాఫర్ అని అందరూ షాక్ అవ్వాలి. మమ్మీ వీడు ఈ మధ్య డల్ గా ఉంటున్నాడు..ఏంటని అడిగితే చెప్పడం లేదు...
సత్యం: అప్పుడప్పుడు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు..నీ ప్రాబ్లెమ్ ఏంటో చెప్పు..
ప్రేమ్: ఏం చెబుతాను ఈ పెళ్లిని ఆపాలి, హిమను నేను పెళ్లిచేసుకోవాలి..ఇదంతా ఎలా జరుగుతుందో అని మనసులో అనుకుని బయటకు మాత్రం ఏంలేదు డాడీ అనేసి వెళ్లిపోతాడు..


Also Read: ఆఖరిసారి చూడాలనుందని వసు మెసేజ్ చూసి కంగారుగా వెళ్లిన రిషి, దేవయానితో జగతి సవాల్!
సౌందర్య ఇంట్లో అందరూ కూర్చుని తింటుంటారు... నన్నేం చూస్తున్నావ్ నువ్వు తిను అని శౌర్య..హిమపై ఫైర్ అవుతుంది.
హిమ: నేను ఇంట్లోంచి వెళ్లిపోతే ఈ పెళ్లి ఆగిపోతుంది కానీ నేను వెళ్లిపోతే నానమ్మ చనిపోతానని బెదిరిస్తోంది ..అందుకని ఇంట్లోంచి వెళ్లలేను ఈ పెళ్లి చేసుకోలేను..పెళ్లి ఆపేందుకు ప్రేమ్ బావ హెల్ప్ చేస్తానన్నాడు ఏం చేస్తాడో ఏమో..మరోవైపు నన్ను ప్రేమిస్తున్నానని వీడియో పంపించినప్పటి నుంచీ నా మనసులో అదో రకంగా ఉంది అనుకుంటుంది..
ఇంతలో అక్కడకు వచ్చిన స్వప్న..నా ఇద్దరు కోడళ్లకి చీరలు తీసుకొచ్చానంటుంది...
శౌర్య: నాకు బట్టలు లేవు, చీరలు లేవని నిన్ను అడిగానా అత్తా..నువ్వు నాకు కొనడం ఏంటి
స్వప్న: హిమకు, నీకు ఇద్దరికీ తీసుకొచ్చాను..చాలా రోజుల తర్వాత మీ మావయ్య నాతో కలసి షాపింగ్ చేశారు
శౌర్య: నాపై కొత్తగా ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు..కొందరు జాలి, కొందరు ప్రేమ, ఇంకొందరు శాడిజం చుపిస్తున్నారంటూ వెళ్లిపోతుంటుంది.
సౌందర్య: తింటున్న కంచంలో చేయి కడుక్కుని వెళ్లిపోతావేంటి
శౌర్య: నేను పెళ్లి దగ్గరుండి చేస్తానన్నాను కదా..ఆ పెళ్లేదో అయిపోతే వెళ్లిపోతాను...ఒక్కొక్కరి నటనలు చూడలేకపోతున్నాను..


Also Read:  కార్తీకదీపం లో వంటలక్క రీఎంట్రీ పక్కా, ప్రోమో ఇదిగో


హిమ నా ప్రేమను అంగీకరిస్తుందా, లేదా అనే ఆలోచనలో ఉంటాడు ప్రేమ్. ఇంతలో అక్కడకు వచ్చిన నిరుపమ్ అసలేంట్రా నీ ప్రాబ్లెమ్ అని అడుగుతాడు. ఏం లేదని ప్రేమ్ చెప్పినా చెప్పు చెప్పు అంటాడు నిరుపమ్. 
మరోవైపు శౌర్య-హిమ రూమ్ లో మాట్లాడుకుంటారు
హిమ: చిన్నప్పుడు ఎంతో బావుండేవాళ్లం..నాకేం డౌట్ ఉన్నా నిన్నే అడిగేదాన్ని ఇప్పుడు ఫ్రెండ్స్ లా ఉండలేమా...
శౌర్య: ఓ ఫ్రెండ్ మరో ఫ్రెండ్ ని మోసం చేయలేరు..బాగా చదువుకున్నాను నాకన్నా గొప్ప అనే ఫీలింగ్ లోఉన్నావా... ఇంతకీ ఎందుకు వచ్చావ్
హిమ: ఇద్దరం ఒకర్నే ప్రేమించాం శౌర్యా...నీకోసం నేను త్యాగం చేస్తున్నాను
ప్రేమ్: ఇద్దరం ఒకర్నే ప్రేమించాం నిరుపమ్..కానీ హిమ నిన్ను ఎందుకు వద్దందో అర్థం చేసుకోవడం లేదు
శౌర్య: నీ సమస్యేంటి
హిమ: నేను నీ సమస్యను కాదు..నీ సమస్యను తీర్చేందుకే వచ్చాను..
నిరుపమ్: ఓ ఫ్రెండ్ లా అడుగుతున్నాను ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే నాతో షేర్ చేసుకో
ప్రేమ్: హిమను ప్రేమిస్తున్నాను తనతో నాకు పెళ్లి చేయి అని అడగాలా
హిమ: నిరుపమ్ బావంటే ఇష్టం అయినా నీకోసం ఆ ఇష్టాన్ని మనసులోనే సమాధి చేసుకున్నాను
శౌర్య: నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని గెంటేస్తుంది...
అటు ప్రేమ్ కూడా నిరుపమ్ దగ్గర్నుంచి వెళ్లిపోతాడు....


Also Read: పరధ్యానం కాదు మీ ధ్యానమే సార్ అన్న వసు, జోరందుకున్న రిషి-సాక్షి పెళ్లి పనులు


శౌర్య డల్ గా కూర్చుంటే ఆనందరావు వస్తాడు అక్కడకు. ఇంతలో అక్కడకు వచ్చిన పనివాళ్లు..పనులన్నీ పూర్తయ్యాయి అని చెబుతూ మీ మనవరాలికి బంగారం లాంటి మొగుడు, అత్త దొరికారని అంటారు. 
ఆనందరావు: శౌర్యని కూల్ చేద్దాం అనుకుంటే మొత్తానికే బెడిసికొట్టేట్టుంది అనుకుంటాడు. ఇప్పుడు నువ్వు వచ్చిన వేళా విశేషం ఏంటో కానీ ఇంట్లో అంతా మంచే జరుగుతోంది
శౌర్య: నాకు పొగడ్తలు నచ్చవు...నాతో అవసరం లేకుండా ఎందుకు ఆకాశానికెత్తేస్తున్నావ్..
ఆనందరావు: నువ్వొచ్చాక అన్నీ శుభవార్తలు వింటున్నాం. మీ స్వప్నత్త ఇన్నాళ్లూ పగతో రగిలిపోయింది..అలాంటి స్వప్నత్త నువ్వు వచ్చాక మారిపోయంది..పుట్టింటిని గుర్తుచేశావ్..
శౌర్య: ఏంటిప్పుడు సన్మానం చేస్తారా..అవార్డులు రివార్డులు ఇస్తారా
ఆనందరావు: నువ్ గై మని అరవనంటే ఓ మాట చెబుతాను.. ఏం లేదు ..ఎప్పటి నుంచో దూరంగా ఉంటున్న మీ స్వప్నత్తే కలిసిపోయింది అలాంటప్పుడు మీరిద్దరూ...
శౌర్య: తాతయ్యా అని అరుస్తుంది..అనవసరమైన ప్రయత్నాలు ఆలోచనలు మానేయండి...
ఎంత బాగా మాట్లాడినా ఇదిమాత్రం పడలేదు అనుకుంటాడు ఆనందరావు...


నిరుపమ్: ప్రేమ్ కి ఏమైందసలని నిరుపమ్ ఆలోచనలో పడతాడు. మమ్మీ-డాడీ వేరుగా ఉన్నప్పుడు మేం కలవలేదు ఇప్పుడు వాళ్లు కలశారు ఒక్కదగ్గరే ఉన్నా నాతో సరిగా ఉండడం లేదు. హిమ మనసులోంచి శౌర్య టాపిక్ వెళ్లిపోతే బావుండేది..తనెప్పుడూ శౌర్య గురించే ఆలోచిస్తోంది..నిశ్చితార్థం నుంచి మొదలైంది ఈ రచ్చ.. కొంపతీసి హిమ పెళ్లిలో కూడా లాస్ట్ మినిట్ లో నచ్చలేదని చెబుతుందా ఏంటి...పెళ్లిలో కూడా అలా చేస్తే చాలా ఘోరంగా ఉంటుంది...అమ్మమ్మకి చెప్పి పెళ్లి అయ్యేంత వరకూ హిమను హౌస్ అరెస్ట్ చేయమని చెప్పాలి అనుకుంటాడు....


అటు ఒంటరిగా నిల్చున్న హిమ దగ్గరకు వచ్చిన సౌందర్య.. చీర తీసుకొచ్చి ఇచ్చి కట్టుకుని రమ్మంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన ప్రేమ్..ఈ చీరేంటి హిమా మళ్లీ పూజలేమైనా ఉన్నాయా అని అడుగుతాడు. టెన్షన్ పెరిగిపోతోంది బావా ఏం చేయాలి అంటుంది. 
ఎపిసోడ్ ముగిసింది....