Karthika deepam 2 Serial Today Episode: హాస్పిటల్‌‌ కి వచ్చిన దీప,  శౌర్యకు ఎలా ఉందని డాక్టర్ ఏమన్నారని కార్తీక్ ని అడుగుతుంది. తల్లిగా నేను తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీరే తీసుకున్నారని నాకు చాలా ఇబ్బందిగా ఉందని అంటుంది. దీంతో కార్తీక్‌ శౌర్యకు బాగానే ఉందని..  నా ఫ్రెండ్ కోసం నేను ఆ మాత్రం కూడా చేయలేనా? అంటాడు. ఇంతలో హడావుడిగా హాస్పిటల్ కు వచ్చిన దాసు, డాక్టర్‌ను కాశీ గురించి అడుగుతాడు. అయితే  కాశీ ప్రాణాలకు ఏం ప్రమాదం లేదని, తీసుకురావడం కాస్త ఆలస్యం అయితే ప్రాణాలు పోయేవని డాక్టర్ చెప్తాడు. తన కొడుకును కాపాడినందుకు కార్తీక్ కి దాసు  థాంక్స్ చెప్తాడు.


కార్తీక్‌: అయ్యో మీ అబ్బాయిని కాపాడింది నేను కాదండి..  ఇదిగో ఈమే దీప.


దాసు: నా బిడ్డను కాపాడినందుకు చాలా కృతజ్ఞలు అమ్మా.. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను.


దీప: మీ అబ్బాయికి ఏం కాదండి. మీరేం బాధపడకండి.


 అంటూ దీప, దాసుకు ధైర్యం చెప్తుంది. అప్పుడే అటుగా వెళ్తున్న నర్స్ దీపను తదేకంగా చూస్తుంది. దీంతో దీప ఆ నర్సును ఆపి ఎందుకు అలా చూస్తున్నావ్ అని అడుగుతుంది. మీరు ఒక ప్రాణం కాపాడారు కదా అది ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారని ఆ వీడియో చూపిస్తుంది. అయితే ఆ వీడియో లో జ్యోత్స్న  నిర్లక్ష్యాన్ని చూసి కార్తీక్‌ తిట్టుకుంటాడు. దాసు కూడా చూసి జ్యోత్స్నకు ఇలాంటి బుద్దులొచ్చాయేంటని ఇదంతా మా అమ్మ ప్రభావమా? అనుకుంటాడు.


   దీప బాధపడకండి బాబాయ్ అని ప్రేమగా పిలిచి దాసుకు ధైర్యం చెప్తుంది. దీప, కార్తీక్ ని పేరు పెట్టి పిలవడం విని కాంచన కొడుకు పేరు కూడా ఇదే కదా అనుకుంటాడు. అందరూ బాగున్నారు కానీ దశరథ అన్నయ్య కూతురు ఎక్కడుందోనని దాసు బాధపడతాడు. మరోవైపు జ్యోత్స్న వీడియో చూసి పారిజాతం టెన్షన్ పడుతుంది.  అప్పుడే జ్యోత్స్న వస్తుంది.


పారిజాతం: ఎవరు ఈ వీడియో తీసింది..?


జ్యోత్స్న: ఎవరు తీశారో నాకెలా తెలుస్తుంది..?


పారిజాతం: కానీ ఈ వీడియోలో  నువ్వు విలన్ అయిపోయావు.  దీప మాత్రం హీరోయిన్ అయిపోయింది. ఈ వీడియో బావ కూడా చూసి ఉంటాడు.


 అని పారిజాతం చెప్పగానే కార్తీక్ శౌర్యను తీసుకుని హాస్పిటల్ కు వెళ్ళి ఉంటాడని  దీప కూడా అక్కడే ఉండొచ్చని  వెంటనే బావకు ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. కార్తీక్ కోపంగా బిజీగా ఉన్నానని ఫోన్ కట్ చేస్తాడు.


పారిజాతం: నువ్వు ప్రతి విషయంలో తప్పు చేస్తున్నావు.


జ్యోత్స్న: ఏంటి ఈ మధ్య నీ ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది. చాలా కోప్పడుతున్నావు. అరుస్తున్నావు. నీతులు చెప్తున్నావు.


పారిజాతం: నువ్వు మీ నాన్నను కొడితే కానీ నాకు నీ గురించి అర్థం కాలేదు.


 అని పారిజాతం మనసులో అనుకుంటుంది. జ్యోత్స్న వెళ్లిపోతుంది. మరోవైపు ఆ  వీడియో చూసిన దగ్గర నుంచి జ్యోత్స్న మీద చాలా కోపంగా ఉందంటాడు కార్తీక్. అయితే కార్తీక్‌ మాటలు గమనించిన దాసు, కార్తీక్‌ తన మేనల్లుడు అని అర్థం చేసుకుంటాడు.


దీప: జ్యోత్స్న మీకు మరదలు మాత్రమే కాదు. కాబోయే భార్య కూడా


అని దీప చెప్పగానే  దీప ప్రవర్తన చూసి. దాసు చాలా మెచ్చుకుంటాడు. దీప చాలా మంచిదని కార్తీక్ కూడా పొగుడుతాడు. మరోవైపు పంతులను పిలిచి ముహూర్తాలు పెట్టించమని శివనారాయణ అంటాడు. అప్పుడే కార్తీక్ వస్తే శౌర్య గురించి సుమిత్ర అడుగుతుంది. శౌర్య బాగానే ఉందని..  జ్యోత్స్న  వీడియో ఇంట్లో అందరికీ చూపిస్తాడు.


జ్యోత్స్న: నేను ఏ తప్పు చేయలేదు.


కార్తీక్‌: అవునా సోషల్‌ మీడియాలో చూడు.. మానవత్వం లేని మిస్ హైదరాబాద్ అంటూ అందరూ తిడుతున్నారు. ఒక సాధారణ మహిళ అతడి ప్రాణాలు కాపాడింది. అంటూ మిస్‌ హైదరాబాద్‌ ఎవరు?  నువ్వా, దీప అని పక్క పక్కన ఫోటోలు పెట్టి వేస్తున్నారు.


జ్యోత్స్న: దీప చేసింది మరీ గొప్ప పని అని నీకు అనిపిస్తే సన్మానం చేయి అంతే కానీ తనను నా ముందు పొగడొద్దు. వాడికి సాయం చేసినంత మాత్రాన దీప జ్యోత్స్న కాలేదు.


కార్తీక్‌: అందరిలో ఎక్కువ గుర్తింపు నీకు ఉంది అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నీకు అవకాశం ఉండి కూడా అతడిని కాపాడలేదు. మనిషి ప్రాణం విలువ తెలిసిన దీప అతడిని కాపాడింది. నిజంగా నువ్వు ఆ పని చేసి ఉంటే నేను చాలా సంతోషించే వాడిని


 అంటూ కార్తీక్‌ జ్యోత్స్న ను తిడతాడు. మనిషి ప్రాణం విలువ నీకు తెలియదని.. తన చిన్నతనంలో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తాడు కార్తీక్. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ఇష్టమైతే, నచ్చితే వెళ్తా... వైసీపీ సపోర్ట్, నంద్యాల ఎపిసోడ్‌పై పవన్, నాగబాబుకు బన్నీ కౌంటర్?