ఏపీ ఎన్నికలకు ముందు నంద్యాల నియోజకవర్గంలో వైసీపీ తరఫున ఎమ్మెల్యే బరిలో నిలిచిన శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడాన్ని మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, ముఖ్యంగా జనసేన పార్టీ శ్రేణులు తీవ్రంగా విమర్శించారు. కుటుంబం అంతా ఒక వైపు ఉంటే... మెగా ఫ్యామిలీ అండతో కథానాయకుడిగా ఎదిగిన అల్లు అర్జున్ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి దగ్గరకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. ఆ మంట ఇంకా చల్లారలేదు. 


ఇప్పుడు మరోసారి ఎన్నికలకు ముందు నంద్యాల ఇష్యూను పరోక్షంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అడ్రస్ చేశారనేది అటు రాజకీయ, ఇటు సినీ విశ్లేషకులు భావన. ఈ బుధవారం (ఆగస్టు 21, 2024) జరిగిన 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్ వేడుకలో బన్నీ చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్, ముఖ్యంగా నాగబాబుకు కౌంటర్ అని అనుకుంటున్నారు.


మీరు ఏమైనా అనుకోండి... మనసుకు నచ్చితే వస్తా!
''స్నేహితుడు... ఇంకొకరు... లేదా మనకు కావాల్సిన వాళ్లు అనుకోండి... ఇష్టమైన వాళ్ల కోసం మనం నిలబడాలి. నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా'' - 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడిన మాట. అందుకు కారణం ఉంది.


'మారుతి నగర్ సుబ్రమణ్యం' చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ భార్య తబిత ప్రజెంట్ చేస్తున్నారు. ఆవిడ సమర్పణలో సినిమా విడుదల అవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముఖ్య అతిథిగా రావాల్సిందిగా బన్నీని కోరారు తబిత. 'పుష్ప 2' క్లైమాక్స్ షూట్ ఇప్పటి వరకు తాను చిత్రీకరణ చేసిన క్లైమాక్స్‌లు అన్నిటిలోకెల్లా కష్టమైన క్లైమాక్స్ అని, అయినా సరే తబిత గారు అడగటంతో వచ్చానని అల్లు అర్జున్ చెప్పారు. అప్పుడు నాకు ఇష్టమైతే, మనసుకు నచ్చితే వస్తానని ఆయన పేర్కొన్నారు. 


తబితా సుకుమార్‌ను అడ్డం పెట్టుకుని మెగా అభిమానులు, నంద్యాల వెళ్లడం పట్ల తనను విమర్శించిన వాళ్లకు అల్లు అర్జున్ కౌంటర్ ఇచ్చారనేది మెజారిటీ జనాల అభిప్రాయం. అదీ సంగతి!


'పుష్ప 2' విడుదలపై క్లారిటీ... వాయిదా లేదు!
'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షిగా 'పుష్ప 2' విడుదల మీద అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 6న సినిమా విడుదల అయ్యే అవకాశాలు లేవని, షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుండటంతో వాయిదా వేయవచ్చని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినబడుతుంది. ఈ తరుణంలో ''డిసెంబర్ 6న తగ్గేదే లే'' అంటూ బన్నీ మాట్లాడారు. దర్శకుడు సుకుమార్, తనకు మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని ఈవెంట్ సాక్షిగా చెప్పకనే చెప్పారు.


Also Read: ఓటీటీలోకి వచ్చేసిన ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' - ఏ లాంగ్వేజ్ వెర్షన్ ఎందులో స్ట్రీమింగ్ అవుతోందంటే?



'పుష్ప 2' అభిమానులకు తప్పకుండా నచ్చుతుందని అల్లు అర్జున్ ధీమా వ్యక్తం చేశారు. సాధారణ ప్రేక్షకులకు ఈ విషయం చెప్పడం లేదని, తన ఆర్మీ - అభిమానులకు ఈ మాట చెబుతున్నాని చెప్పారు. సినిమా బాగా వస్తుందని ఆయన తెలిపారు. 'పుష్ప' తమ కోసం చేసినా, 'పుష్ప 2'ను మాత్రం అభిమానుల కోసం చేస్తున్నామని సుకుమార్ చెప్పారు.


Also Readబాక్సాఫీస్ బరిలో 9000 కోట్లు, ఆస్కార్స్‌లో 2 అవార్డులు... హాలీవుడ్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ రెడీ - రిలీజ్ ఎప్పుడంటే?