Brahmamudi Serial Today Episode:  ఇందిరాదేవి ఇంట్లో వాళ్లందరిని పిలిచి వరలక్ష్మీ వ్రతం గురించి చెబుతుంది. కొత్తజంట అయిన కళ్యాణ్‌, అప్పులతో వ్రతం చేయించాలనుకున్నట్లు ఇందిరాదేవి చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. మీ ఇంకో చెల్లి రావడం మీ చెల్లికి ఇష్టం లేనట్టుంది అని రాజ్ అంటాడు. మధ్యలో నన్నెందుకు లాగుతున్నారు. వాళ్లు ఇంటికి రావడానికి నేనే కారణం అని ఎవరైనా అంటే.. అనగానే అపర్ణ వాళ్ల దుమ్ము దులిపేయ్. అని చెప్తుంది.  సరే అందరం కలుస్తున్నాం వాళ్ల అమ్మ నాన్నలను కూడా పిలుద్దామని ప్రకాశం అంటాడు. అయితే వాళ్లంతా ఎందుకని ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంది.


ప్రకాష్‌: వాళ్లు అంతా కాదు  ఇద్దరే


అపర్ణ: మా వియ్యంకుల్లాగే వ్రతానికి వస్తారు.


స్వప్న: మా వాళ్లను వియ్యంకులుగా అస్సలు ఒప్పుకోలేరు ఇక్కడ కొంతమంది.


ప్రకాష్‌: వియ్యాల వారితో కయ్యాలు పెట్టుకోవడానికి కొందరు రెడీగా ఉంటారు.


   అంటూ అందరూ గొడవ పడుతుంటే ఇంతలో సీతారామయ్య నేను చిట్టి వెళ్లి వాళ్లను పిలుచుకోస్తాం. అంటాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. మీరు మనవడి కోసం ఒక మెట్టు దిగి పిలవడం నాకు చాలా సంతోషంగా ఉందని ధాన్యలక్ష్మీ అంటుంది. ధాన్యలక్ష్మీ మాటలకు రుద్రాణి షాక్‌ అవుతుంది. తర్వాత కనకానికి ఫోన్‌ చేస్తుంది కావ్య. ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేస్తున్నామని మూడు జంటలతో వ్రతం చేయించాలని అమ్మమ్మ తాతయ్య నిర్ణయం తీసుకున్నారని మీరు కూడా రావాలని చెప్తుంది. ఇప్పటి వరకు జరిగిందే చాలదన్నట్లు మళ్లీ మేమెందుకే అని కనకం అంటుంటే అపర్ణ ఫోన్ తీసుకుని రేపు మీకు లక్ష పనులు ఉన్నా  వ్రతానికి రావాలని చెప్తుంది.


 కృష్ణమూర్తి:  అప్పును కోడలుగా ఒప్పుకుంటున్నారేమో కనకం.


కనకం: పెళ్లి రోజు ధాన్యలక్ష్మీ ఎంత గొడవ చేసిందో చూశావు కదయ్యా.. ధాన్యలక్ష్మీ అంత సులువుగా ఒప్పుకోదు. అప్పుకు అసలే ఆవేశం ఎక్కువ. ధాన్యలక్ష్మీ ఏమైనా అంటే.. రేపు నాకు టైఫాయిడ్ అన్ని ఫీవర్స్ వచ్చేలా ఉన్నాయి.


   అని కనకం భయపడుతుంది. మరోవైపు రుద్రాణి, ధాన్యలక్ష్మీని మెచ్చుకుంటుంది.  నీది ఎంత పెద్ద మనసు మా అమ్మ అడిగిందని వాళ్లను ఇంటికి రమ్మన్నావు.. అనగానే ధాన్యలక్ష్మీ తన మనసులో మాట రుద్రాణికి చెప్తుంది. దాన్ని ఎప్పటికీ కోడలుగా ఒప్పుకునేది లేదని అది వచ్చాక ఇంట్లో కోడలిగా పనికిరాదని రుజువు చేస్తానని చెప్తుంది ధాన్యలక్ష్మీ. మరోవైపు రాత్రి డాబాపై అప్పు, కల్యాణ్ ఎదురెదురు తిరిగి సరదాగా గడుపుతారు. ఇంతలో ఇందిరాదేవి, సీతారామయ్య వస్తారు.


ఇందిరాదేవి: ఏంటీ బలబలాలు తేల్చుకుంటున్నారా?


కళ్యాణ్‌: నాన్నమ్మా, తాతయ్యా.. ఉన్నట్టుండి ఇలా వచ్చారేంటీ


(ఇద్దరూ వాళ్ల ఆశీర్వాదం తీసుకుంటారు.)  


ఇందిరాదేవి:  మీ ఆత్మగౌరవాన్ని మేము గౌరవిస్తాం. మిమ్మల్ని శాశ్వతంగా తీసుకెళ్లడానికి ఒప్పించేందుకు మేము రాలేదు. రేపు శ్రావణ శుక్రవారం, వ్రతం చేయిస్తున్నాం. మీరు ఇద్దరూ ఇంటికి  రావాలి.


కళ్యాణ్: వ్రతమా.. అప్పుతోనా. తనకు అది సూట్ కాదు. కావ్య వదినతో చేయించండి.


ఇందిరాదేవి: రానని చెప్పలేక ఇలా అంటున్నావా?


సీతారామయ్య: నువ్వు వేరు కాపురం పెట్టావని పండుగలకు, పబ్బాలకు కూడా ఇంటికి  రాకుంటే ఎలా కళ్యాణ్‌.  దేనికైనా పట్టు విడుపు ఉండాలి కదా..!


  అని ఇద్దరు కళ్యాణ్‌ అప్పులను కన్వీన్స్‌ చేస్తారు. దీంతో అప్పు తాతయ్య, అమ్మమ్మలకు ఎదురు చెప్పొద్దని కళ్యాణ్‌కు చెప్తుంది. దీంతో అప్పు ఒప్పుకున్నట్లే అని ఇందిరాదేవి అంటుంది. కళ్యాణ్‌ కూడా సరే వస్తామని చెప్పడంతో ఇందిరాదేవి, సీతారామయ్యా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు సాంగ్‌ వేసుకుని రాజ్‌ డాన్స్‌ చేస్తుంటాడు. కావ్య వచ్చి చూస్తుంటే.. రేపు వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేశావా? అని రాజ్‌ అడుగుతాడు. చేశానని కావ్య చెప్తుంది. తర్వాత ఇద్దరూ గొడవ పడతారు. దీంతో కళ్యాణ్‌ వాళ్లు ఇంటికి రావడం నీకు ఇష్టం లేదు కదా అంటాడు రాజ్‌.  


కావ్య: నాకెందుకు ఇష్టం లేదు. మా చెల్లి కూడా వస్తుంది కదా


రాజ్‌: ఈ నటించడం చిన్నపిల్లల దగ్గర నటించు. అయినా నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా. రేపు పూజ కోసం మాత్రమే కల్యాణ్ వాళ్లు రావట్లేదు. వచ్చేవాళ్లు తిరిగి వెళ్లరు.


కావ్య: కవిగారు ఎలా ఒప్పుకుంటారు


రాజ్‌: అది నీ మట్టిబుర్రకు అర్థం కాదు. ఈ రాజ్ వేసిన మాస్టర్ ప్లాన్ రేపు చూడు. ఇక గుడ్ నైట్


 అని రాజ్‌ పడుకుంటాడు. కావ్య మాత్రం రేపు ఎంత గొడవ జరుగుతుందోనని భయపడుతుంది. మరోవైపు కల్యాణ్  కూడా రేపు పూజలో ఎంత గొడవ జరుగుతుందోనని ఆలోచిస్తుంటాడు. అప్పు వచ్చి అడిగితే రేపు పూజ గురించే టెన్షన్ పడుతున్నాను. తాతయ్య, నానమ్మ ఎంత కంట్రోల్ చేసిన మా అమ్మ, రుద్రాణి అత్తయ్య ఎంత పెంట పెంట చేస్తారోనని భయంగా ఉందంటాడు దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.