Guppedanta Manasu  Serial Today Episode: వసుధార ఇంతకుముందు మాట్లాడిన విషయం ఏంటని అడుగుతాడు శైలేంద్ర.  నీ గురించే చెప్పిందని నువ్వు ఎండీ పదవి కోసం అరాచకాలు చేస్తున్నావని.. ఆఖరికి రిషిని కూడా చంపబోయావని చెప్పింది. అయినా అవన్నీ నాకెందుకు అన్నయ్యా.. నువ్వు నాకు డబ్బులు ఇచ్చావ్. కాలేజీలో ఎండీ పోస్ట్ ఇచ్చావు. మళ్లీ ఈ పోస్ట్ నేను నీకు ఇచ్చి, ఈ కాలేజీ నుంచి ఎలా వెళ్లిపోవాలా అని ఆలోచిస్తున్నాను.. నీ గురించి తెలుసుకుని నేను ఏం చేస్తాను. అది నాకు అనవసరమైన మ్యాటర్ అంటాడు రిషి. నీకు ఎండీ పదవి ఎలా ఇవ్వాలో చెప్పు అన్నయ్య అని రిషి అడగ్గానే శైలేంద్ర ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు.


రిషి: ఏంటన్నయ్య ఏడుస్తున్నారు..?


శైలేంద్ర: ఇవి కన్నీళ్లు కాదు తమ్ముడు.. ఆనంద భాష్పాలు. నేను కచ్చితంగా ఎండీ అవుతాను.. కచ్చితంగా అవుతాను


 (అనుకుంటూ వెళ్లిపోతాడు. అప్పుడే వసుధార వస్తుంది)


వసుధార: మీ అన్నయ్యకు ఏం చెప్పారు అంతలా ఎమోషనల్ అయి వెళ్తున్నారు.


రిషి: అన్నయ్య గురించి అన్నయ్యకే చెప్పాను. తనకు కావాల్సింది తొందర్లోనే ఉందని చెప్పాను అంతే ఎమోషనల్‌గా వెళ్లిపోయాడు. నాకో చిన్న పని ఉంది. వెళ్లొస్తాను. ఒక్కన్నే వెళ్తాను. వచ్చాక చెబుతాను.


 (అని చెప్పి  రిషి వెళ్లిపోతాడు.)


వసుధార: సార్‌కు మను తండ్రి గురించి చెప్పాక కూడా కూల్‌గా ఉన్నారు. కానీ, సార్ ప్రవర్తనలో ఏదో మార్పు ఉంది. సార్ ఏదో దాస్తున్నారు


 అని రిషిని అనుమానిస్తుంది వసుధార. మరోవైపు మహేంద్ర చేసిన మెసేజ్‌ను మను చదువుతాడు. కోపంతో ఫోన్ పగులగొట్టాలనుకుంటాడు.  అనుపమ జ్యూస్‌ తీసుకుని  రావడంతో ఆగి. తనకు వద్దని అంటాడు. ఇంటికి వచ్చిన రిషికి నా తండ్రి ఎవరనేది చెప్పారా? అని అడుగుతాడు. అనుపమ చెప్పానని చెప్పడంతో ఎవరని చెప్పారు అంటాడు. మహేంద్రే నీ తండ్రి అని చెప్పానని అనుపమ అనడంతో మను షాక్‌ అవుతాడు. నిజం తెలిసి రిషి ఏమీ అనలేదా? మహేంద్ర సర్‌కు కూడా నిజం తెలుసా? అని అడుగుతాడు. నాకు తెలియదు అంటుంది అనుపమ. దాంతో గన్ పట్టుకుని పోని నేను తెలుసుకోనా. డైరెక్ట్ ఆయన్నే అడిగి తెలుసుకుంటాను. ఈ ఆగస్ట్ నెల అయిపోయే లోగా ఈ గన్‌లోని బుల్లెట్స్ ఖాళీ అయిపోతాయ్. అని మను వెళ్లిపోతాడు. మరోవైపు మహేంద్ర ఆలోచిస్తుండగా.. రిషి, వసుధార వస్తారు.


మహేంద్ర: అమ్మా వసుధార, అనుపమను కలిశారా? మను తండ్రి గురించి అడిగారా? తన తండ్రి ఎవరో తెలుసుకున్నారా?


వసుధార: మను తండ్రి విషయం అప్పుడు ఇప్పుడు తెలుసుకునే అవకాశం రాలేదు మావయ్య.


మహేంద్ర: మరి ఎలా తెలుసుకున్నావు అమ్మ (వసుధార షాక్‌ అవుతుంది.)  అదేనమ్మా తెలుసుకునే అవకాశం లేనప్పుడు ఎలా తెలుసుకున్నావు. ఎందుకు నా దగ్గర నిజం దాచావు. మను తండ్రి విషయం. నా విషయం ఎందుకు దాచావు.


రిషి: డాడ్‌కు నిజం తెలిసింది వసుధార. డాడ్ మన వెనుకాలే అనుపమ ఇంటికి వచ్చారు. అఫ్‌కోర్స్ నేనే రమ్మన్నాను.


వసుధార: ప్రాబ్లమ్ అవుతుందనే కదా ఇన్నాళ్లు ఆగింది. సారీ మావయ్య నన్ను క్షమించు. నేను చాలా సార్లు చెబుదామని ట్రై చేశాను. కానీ, ఏం జరుగుతుందో అని అనుపమ గారే నన్ను ఆపారు.


రిషి: ఇన్నాళ్లు నిజం తెలిస్తే సమస్య అనుకున్నావ్. కానీ, నిజం తెలియడమే సొల్యూషన్ అని తెలుసుకోలేకపోయావు. ఈ నిజం మనుకు కూడా తెలియాలి.


వసుధార: వద్దు సార్ మను గారికి తెలిస్తే ప్రాబ్లమ్ అవుతుంది. ఇన్నాళ్లు తండ్రిమీద ద్వేషంతో పెరిగిన మను ఈరోజు నిజం తెలియగానే ఏమైనా జరగొచ్చు.


   అని వసుధార అంటుంది. ఇదంతా ఏంటో నాకే షాకింగ్‌గా ఉంది. నేనేంటి నేను మను తండ్రిని ఏంటని ఆశ్చర్యపోయాను. నాకు అసలు ఏం తెలియట్లేదు అని మహేంద్ర అంటాడు. మనం మాట్లాడుకోవాల్సింది మను తండ్రి గురించి కాదు. మను తల్లి గురించి. తన తప్పేం లేదంటుంది అంటే తను తల్లి కాదనేగా అర్థం. మరైతే మను తల్లి ఎవరై ఉంటారు అని వసుధార అనుమానపడుతుంది. తర్వాత శైలేంద్ర గురించి మాట్లాడుకుంటారు. మీ అన్నయ్య గురించి మీకు పూర్తిగా తెలియదు అని వసుధార అంటుంది. నిజమే. రిషి అనేవాడికి తెలియదు. వాడు తెలుసుకోలేకపోయాడు. కానీ, రంగాకు అన్ని  తెలుసు అంటాడు రిషి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.