Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకం విహారితో తన పెళ్లిని తలచుకొని బాధ పడుతుంది. రెండు కుటుంబాలు పెళ్లితో ఏకమవుతాయని ఎంతో సంతోషపడుతున్నారని ఇలాంటి టైంలో విహారితో తనకు జరిగిన పెళ్లి గురించి తెలిసినా ఈ ఇళ్లు మళ్లీ రెండు ముక్కలవుతుందని కనకం ఏడుస్తుంది. దానికి తాను ఎలాంటి పరిస్థితుల్లో కారణం కాకూడదని అనుకుంటుంది. తాను విహారి ఇంట్లోనే ఉంటే తమ పెళ్లి విషయం అందరికీ తెలిసి పోతుందని విహారికి తన వల్ల ఇబ్బంది రాకూడదని కనకం రాత్రికి ఇళ్లు వదిలి వెళ్లిపోవాలని అనుకుంటుంది.


ఇంట్లో అందరూ ఒక చోట కూర్చొంటారు. అందరికి కాదాంబరి అందరి కోసం అన్నం కలిపి గోరు ముద్దలు పెడుతుంది. చిన్నప్పుడు ఎప్పుడో ఇలా ఉండేవాళ్లం అని ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఈ అవకాశం వచ్చిందని ఎమోషనల్ అవుతుంది. అందరూ సంతోషంగా కలిసి తింటారు. ఈ సంతోషం ఎప్పుడూ ఇలాగే ఉండాలని అనుకుంటారు. కనకం వెనక నుంచి మొత్తం చూస్తుంది.


విహారి: అమ్మ ఇప్పుడు సంతోషమేనా.
యమున: చాలా సంతోషం నాన్న ఈ ఇళ్లు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నీ పెళ్లితో సంతోషం రెట్టింపు అవ్వాలి.
విహారి: ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అమ్మా.
కాదాంబరి: రారా మనవడా. మనవరాలా నీకు కూడా ఇదిగో.
లక్ష్మీ: మనసులో.. మీరు ఎంత మంచి వాళ్లండి. మీకు ఇంత పెద్ద కుటుంబం ఉంది. ఇంత ఆస్తి ఉంది అయినా ఓ మామూలు మనిషి అయిన మా నాన్న గురించి ఆలోచించారు. ఆయన ప్రాణాల్ని కాపాడటం కోసం నా మెడలో తాళి కట్టారు. మీ లాంటి గొప్ప వ్యక్తికి భార్య అయినందుకు సంతోషంగా ఉంది. అంత గొప్ప వ్యక్తి చేయి పట్టుకొని జీవితాంతం నడవలేకపోతున్నాను అన్న బాధ మనసుని తొలిచేస్తుంది. 


ఇంతలో విహారి పొలమారుతాడు. లక్ష్మీ చూసి నీరు తీసుకొని వచ్చి పండుకి ఇస్తుంది. ఇక అంబిక నిన్ను ఇష్టపడేవాళ్లు అంతా ఇక్కడే ఉంటే నిన్ను ఎవరు తలచుకుంటారు అని అడుగుతుంది. దానికి సహస్ర బావ నువ్వు ఎక్కడున్నా నా గుండె నిన్ను తలచుకుంటూ ఉంటుంది అందుకే పొలమారావని అంటుంది. 


విహారి: నానమ్మ అందరికీ నీ ప్రేమ పంచుతున్నావ్ కానీ మా అమ్మకు ఎందుకు పంచడం లేదు. నీ చేతి ముద్ద మా అమ్మకి ఎందుకు ఇవ్వడం లేదు. 
పెద్దాయన: కాదాంబరి వేరు అయిన కుటుంబాలు ఇప్పుడు కలిసిపోయాయి. ఇక ఈ పంతాలు పట్టింపులు ఎందుకే.
విహారి: నానమ్మ ప్లీజే ఒప్పుకోవే.
కాదాంబరి: హూ..
విహారి: అమ్మా రా.. 


యమున ఎమోషనల్ అయి చేయి చాచుతుంది. కాదాంబరి తన మనసులో చిచ్చు ఎప్పటీకీ చల్లారదని అనుకొని ఎత్తి ముద్ద వేస్తుంది. అది చూసిన కనకం మెల్లమెల్లగా అందరూ యమునమ్మ గారిని దగ్గరకు తీసుకుంటున్నారని తాను వెళ్లిపోయిన యమునమ్మ గారి గురించి బాధ పడాల్సిన అవసరం లేదు అనుకుంటుంది. యమున ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకొని తింటుంది. అందరూ సంతోషంగా తిని నన్ను మర్చిపోయారని పండు అంటే విహారి కాళీ ప్లేట్ ఇచ్చి ఇందులో ఉన్న మొత్తం నీకే అని అంటాడు. అందరూ పెద్దగా నవ్వుతారు.


లక్ష్మీ కిచెన్‌లో ఆలోచిస్తూ ఉంటే పండు తిన్నావా అని అడుగుతాడు. తిన్నాను అని లక్ష్మీ అబద్ధం చెప్తుంది. ఆ మాటలు యమున వింటుంది. లక్ష్మీ దగ్గరకు వచ్చి యమున తానే తన చేతులతో వడ్డించి లక్ష్మీకి గోరు ముద్దలు తినిపిస్తుంది. లక్ష్మీ చాలా ఎమోషనల్ అవుతుంది. యమున కూడా ఏడుస్తూ నీ వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను. ఇంత సంతోషం నీ వల్లే దక్కింది. అలాంటి నువ్వు పస్తులుంటే నేను ఎలా తట్టుకోగలను లక్ష్మీ అని ఏడుస్తూ తినిపిస్తుంది. ఆ సీన్ పండు చూసి యమునమ్మగారు ఎంత మంచిదో అనుకుంటాడు. దగ్గరకు వచ్చి తనకు ఓ ముద్ద పెట్టమని అంటాడు. అయ్యోరా అని యమున పిలిచి పండుకి కూడా అన్నం పెడుతుంది. 


లక్ష్మీ రాత్రి బ్యాగ్ సర్దుకొని ఎవరూ చూడకుండా వెళ్లిపోవాలని బయటకు వస్తుంది. యమున అది మేడ మీద నుంచి చూసి లక్ష్మీ అని పిలుస్తుంది. లక్ష్మీకి వినిపించదు. యమునమ్మ గారు మీకు చెప్పకుండా వెళ్లిపోతున్నా అని దీన్ని అడ్డుపెట్టుకొని ఇంట్లో వాళ్లు మిమల్ని తిడతారు అని తెలుసు కానీ మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే నేను వెళ్లిపోవాలని క్షమించడండి అని బయటకు వెళ్లిపోతుంది. ఇంతలో యమున పరుగున వస్తుంది. బయట చూస్తే లక్ష్మీ కనిపించదు. యమున లక్ష్మీ ఎక్కడికి వెళ్తుందని టెన్షన్ పడుతుంది. విహారిని పిలుస్తుంది. లక్ష్మీ ఇంటి నుంచి వెళ్లిపోతుందని చెప్తుంది. కనీసం చెప్పకుండా ఎక్కడికి వెళ్తుందో తెలీడం లేదని తనని ఆపాలని చెప్తుంది. యమున విహారి ఇద్దరూ కారులో బయటకు వెళ్లారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: ఫస్ట్‌ నైట్ గదిలో నందిని మీద హర్ష ఫైర్.. తండ్రిని కడతేర్చడానికి సర్వం సిద్ధం చేసుకున్న రుద్ర!