Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీని ఇంటి చారుకేశవ గెంటేస్తుంటే పెద్దాయన ఆపుతారు. తనకు ప్రాణ దానం చేసిన అమ్మాయిని ఇలా అవమానించి పంపొద్దని అంటారు. దానికి పద్మాక్షి అలా అని పచ్చి దొంగని ఇంట్లో ఉంచుకుంటామా అని అడుగుతుంది. దాంతో పెద్దాయన ఇక ఆపు అని పద్మాక్షి మీద అరుస్తారు. మరోవైపు విహారికి ఆదికేశవ ఫోన్ చేస్తే మాట్లాడుతాడు. కనకం తల్లిదండ్రులు రేపు హైదరాబాద్ వస్తున్నాం అని చెప్తే విహారి షాక్ అయిపోతాడు. 


పెద్దాయన: లక్ష్మీ అలాంటిదే అయితే ఇంటికి వచ్చే రోజే ఈ పని చేయాలి. నేను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే నాకు ఎందుకని వదిలేయాలి. కానీ లక్ష్మీ మనసు అలాంటిది కాదు. ఇక్కడ మంచి వాళ్లు ఎవరో ముంచే వాళ్లు ఎవరో ఎవరికీ అర్థం కావడం లేదు. లక్ష్మీ బ్యాగులోకి గాజులు ఎలా వచ్చాయో నాకు తెలీదు కానీ తను ఇలా చేయదు. అమ్మ లక్ష్మీ బ్యాగు తీసుకొని లోపలికి వెళ్లు. (లక్ష్మీ ఏడుస్తూ రెండు చేతులెత్తి దండం పెడుతుంది) నువ్వు నా ప్రాణం పోసిన దేవతవి అందరి ముందు తల దించుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. 
చారుకేశవ: మనసులో పక్కనే పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయట పడ్డాను అనుకున్నా కానీ ఈ పెద్దాయన ప్రమాదాన్ని ఇంట్లోకి తెచ్చి పెట్టాడు.
విహారి: లక్ష్మీ లోపలికి వెళ్లగానే బయటకు వచ్చి ఏమైందని అడుగుతాడు. 
పద్మాక్షి: మీ రెండో అత్త బంగారు గాజులు మీ అమ్మ తీసుకొచ్చిన ఆమె దొంగతనం చేసింది.
విహారి: లక్ష్మీ దొంగతనం చేసిందా నేను నమ్మను. తన గురించి నాకు ఏమీ తెలీదు. కానీ మా అమ్మ తనని నమ్మింది. 
అంబిక: విహారి ఇంతలా చెప్తున్నాడు  అంటే తన నమ్మకాన్ని మనం నమ్మితే చాలు.
చారుకేశవ: మనసులో అబ్బో ఈవిడ గారు సరైన టైం చూసి చక్కెర పూస్తుంది.


ఇంతలో విహారి ఇంట్లో వంట పని చేసే పండు వస్తాడు. రావడం రావడమే తన యాస యాక్టింగ్‌తో కామెడీ చేస్తాడు. పని వాడు అయినా విహారి అతనితో చాలా క్లోజ్‌గా ఉంటాడు. ఇక లక్ష్మీ గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. తన జీవితంతో ఇంత ఘోరంగా ఆడుకుంటున్నావ్ అని ఏడుస్తుంది. తన తండ్రి ఎంతో ప్రేమగా చేయించిన గాజులు తన చేయి జారిపోయేలా చేసి వాటిని తానే దొంగతనం చేసినట్లు ఎందుకు నిందలు వేయిస్తున్నావ్ అని ఏడుస్తుంది. ఇంతలో యమున లక్ష్మీ దగ్గరకు వస్తుంది. యమున ఇంట్లో జరిగిన విషయానికి రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్తుంది. లక్ష్మీ ఏం బాధ పడటం లేదని అంటుంది. ఇద్దరూ ఎమోషనల్గా మాట్లాడుకుంటారు. యమున లక్ష్మీకి ధైర్యం చెప్తూ ఓదార్చుతూ హగ్ చేసుకుంటుంది. ఇంతలో పండు వచ్చి లక్ష్మీకి ధైర్యం చెప్తాడు. 


గాజులు ఎవరో కావాలనే పెట్టారని యమున అంటుంది. ఇక పండుతో యమున ఇంట్లో జరిగే విషయాల్ని గమనిస్తూ ఉండమని చెప్తుంది. లక్ష్మీకి ఏం కావాలో కూడా నువ్వే చూసుకోవాలి అంటుంది. దానికి పండు సీతమ్మకు నేను హనుమంతుడిలా ఉంటానని అంటాడు. లక్ష్మీ నవ్వేస్తుంది. పద్మాక్షి ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే అక్కడికి తన తల్లి వచ్చి సాయంత్రం కర్వాచౌత్ అవుతుంది సహస్రకి చక్కగా రెడీ అవ్వమని చెప్తుంది. (కర్వాచౌత్ అంటే చంద్రుడుకి పూజ చేసి జల్లెడలో చంద్రుడుని చూసి తర్వాత కాబోయే, భర్త ముఖం భార్య చూస్తుంది.) 


పోలీస్ రంజిత్ విహారికి కాల్ చేసి కనకం ఫోటో పంపించమని అడుగుతాడు. విహారి సరే అని కనకం ఫోటోలు చూస్తూ ఉంటే సహస్ర బావ అనుకుంటూ వస్తుంది. దాంతో విహారి కంగారులో ఫోన్ పడేస్తాడు. సహస్ర వచ్చి మంచిగా రెడీ అయి వచ్చాను కాంప్లిమెంట్ ఇవ్వ మని అంటుంది. విహారి నవ్వుతూ నైస్ డ్రెస్ అని అంటాడు. ఇక సహస్ర విహారితో బావ నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అంటే విహారి షాక్ అయిపోతాడు. ఇష్టమే అని విహారి అంటాడు. సహస్ర సరదాగా అడిగాను అని నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసని అంటుంది. ఇక పెళ్లి ఫొటో విహారి ఫోన్లో సహస్ర చూసేస్తుందేమో అని విహారి కంగారు పడతాడు. సహస్ర చూడకుండా జాగ్రత్త పడతాడు. ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు. ఫోటో చూస్తూ కనక మహాలక్ష్మీ నువ్వు ఎక్కడ ఉన్నావ్ నిన్ను మీ వాళ్లకి అప్పగించే వరకు నాకు మనస్శాంతి ఉండదు అనుకుంటాడు.


కనకం, యమున, పద్మాక్షి, అంబిక, వసుధ అందరూ కర్వాచౌత్ ఏర్పాట్లు చేస్తారు. సహస్ర అక్కడికి వస్తుంది. రెండు కుటుంబాలు కలవడానికి విహారి, సహస్రలు కలవడమే ముఖ్యమని అనుకుంటారు. పద్మాక్షి యమునను ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేస్తుంది. ఇక సహస్ర కాలి పట్టీ ఊడిపోతుంది. పట్టీ కూడా పెట్టుకోలేకపోతుంది. కనకం పట్టీ అందిస్తే నా కాళ్లకి పెట్టవా అని సహస్ర లక్ష్మీతో అంటుంది. నువ్వు నా కాలు పట్టుకోవడం ఏంటి అనుకుంటున్నావా నీ స్థాయికి నా కాళ్లు పట్టుకోవడం ఎక్కువే అని అంటుంది. వెంటనే యమున పట్టీ తీసుకొని నా కోడలికి నేను పెడతాలే అని అంటుంది.. లక్ష్మీ వద్దని తాను పెడతా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


 Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్ ప్రోమో: విహారి, లక్ష్మీలకు పెళ్లి జరిగిందని సహస్రకి తెలిసిపోతుందా..!