Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి అతని పోలీస్ ఫ్రెండ్ రంజిత్‌ని ఇంటికి పిలుస్తాడు. సత్య కూడా అక్కడ ఉంటాడు. విహారికి తన బెస్ట్ ఫ్రెండ్ చేసిన మోసంలో అతను ఎలా చిక్కుకున్నాడో మొత్తం చెప్తాడు. ఇక కనకం కూడా పని మనిషి నాగమణితో కలిసి బట్టలు ఆరేసి ఆరిన బట్టలు తీయస్తుంది. 


విహారి: ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలేయకుండా తోడుగా ఉండాల్సింది. నా తల బద్ధలైపోతుంది రంజిత్. నేను ఆ అమ్మాయి అమెరికాలో సంతోషంగా ఉన్నాం అని అతని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. 
రంజిత్: నేను ఎంక్వైరీ చేస్తాను.
విహారి: ఓకే కానీ ఈ విషయం సీక్రెట్‌గా ఉండాలి.


కనకం తీస్తున్న బట్టల నుంచి తన చున్నీ ఎగిరి కింద ఉన్న విహారి మీద పడుతుంది. కనకం కింద పడి బాగు గారి మీద పడిందని టెన్షన్ పడుతూ నాగమణికి చెప్తుంది. విహారి మేడ మీదకు చూసే టైంకి కనకం దాక్కుంది. నాగమణి విహారికి క్షమాపణలు చెప్తుంది. విహారి పర్లేదని చున్నీ మీదకి అందిస్తాడు. చిన్నయ్య గారు చాలా మంచోళ్లని అంత తొందరగా కోపం రాదు అని నాగమణి కనక మహాలక్ష్మీతో చెప్తుంది. ఇక సత్య, రంజిత్ ఇద్దరూ వెళ్లిపోతారు. వాళ్లని సహస్ర చూస్తుంది.


సహస్ర: బావ ఏమైంది మన ఇంటికి పోలీస్ వాళ్లు వచ్చి వెళ్తున్నారు. 
విహారి: వాడు నా ఫ్రెండ్. దారిలో వెళ్తూ వెళ్తూ కలిసి వెళ్దామని వచ్చాడు. 
సహస్ర: అవునా అబ్బాయి గారు రోజూ రోజూకి చాలా ముద్దుగా కనిపిస్తున్నారు. అని బుగ్గులు గిచ్చేస్తుంది.
విహారి: ఏంటే కోతి బుగ్గులు గిచ్చేస్తున్నావ్. హల్ బుగ్గులు గిచ్చాలి అన్నా ముద్దులు పెట్టుకోవాలి అన్నా అదంతా పెళ్లి అయిన తర్వాతే. ఇప్పుడు కాదు. 
సహస్ర: ఏంటి అమ్మాయి చెప్పాల్సిన మాటలు అబ్బాయి గారు చెప్తున్నారు. బావ దగ్గర కూడా హద్దులు పద్దులు ఏంటి అని మళ్లీ గిచ్చేసి వెళ్లిపోతుంది. 


నాగమణి: లక్ష్మీ చెప్తే నమ్మవు కానీ చిన్న బాబుగారు చాలా మంచోలు. 
లక్ష్మీ: అంటే అమ్మగారి లా అన్నమాట.
నాగమణి: అవును
లక్ష్మీ: అయితే సహస్రమ్మగారు చాలా అదృష్టవంతురాలు.
నాగమణి: అవును చిన్న బాబు గారి లాంటి వాళ్లు దక్కాలి అంటే పూర్వ జన్మలో చాలా అదృష్టం చేసుకోవాలి.  


చారుకేశవ: ఈ లక్ష్మీ నా కాళ్లలో ముళ్లులా తయారైంది. దాన్ని తీసిపారేస్తే కానీ నేను ప్రశాంతంగా ఇంట్లో బతకలేను ఏం చేయాలి.


వసుధ తన చేతి బంగారు గాజులు తీసి డ్రసింగ్ టేబుల్ మీద పెడుతుంది. వసుధ తన అక్క పద్మాక్షి దగ్గరకు వెళ్లి టిఫెన్‌కి పిలుస్తుంది. పద్మాక్షి తర్వాత తింటానని చెప్పి వసుధ చేతికి బంగారు గాజులు లేకపోవడం చూసి ఆడవాళ్లకి బంగారమే అందం నువ్వేంటి చేతికి మట్టి గాజులు వేసుకొని తిరుగుతున్నావ్ అని అంటుంది. దానికి వసుధ స్నానం చేసినప్పుడు తీశానని వేసుకుంటా అని చెప్తుంది. ఇక చారుకేశవ ఆ గాజులు చూసి వాటిని తీసుకొని లక్ష్మీ నీ గాజులే ఈ ఇంట్లో నిన్ను ఓ దొంగని చేయబోతున్నాయని అనుకుంటాడు. ఎవరూ చూడకుండా లక్ష్మీ గదికి వెళ్లి ఆ గాజులను లక్ష్మీ బ్యాగ్‌లో పెట్టేస్తాడు. మరోవైపు వసుధ గాజులు ఏమైపోయావని అనుకుంటుంది. మొత్తం వెతుకుతుంది. చారుకేశవ గాజులు బ్యాగ్లో పెట్టేసి తన గదికి వస్తే వసుధ గాజులు కనిపించడం లేదని అంటుంది. 


చారుకేశవ ఎవరో దొంగతనం చేసుంటారని చెప్పి భార్యని తీసుకొని కిందకి వెళ్లి అందర్ని హాల్‌ లోకి పిలుస్తాడు. కనకం కూడా అక్కడే క్లీన్ చేస్తూ ఉంటుంది. తన గదిలో తన భార్య బంగారు గాజులు పోయావని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. ఎవరో దొంగతనం చేశారని చారు కేశవ లక్ష్మీని చూసి అంటాడు. 


లక్ష్మీ: మనసులో నాన్న నాకు ప్రేమతో కొన్న బంగారు గాజులు.
యమున: ఈ ఇంట్లో దొంగతనం చేసే వారు ఎవరు ఉన్నారు చారుకేశవా.
అంబిక: ఇంకెవరు పని వాళ్లు అయినా చేసుండాలి లేదంటే మన వాళ్లు అని ఇంటికి వచ్చిన వాళ్లు అయినా అయిండాలి.
కాదాంబరి: మన పనివాళ్లు ఏళ్ల తరబడి ఇక్కడే పని చేస్తున్నారు వాళ్లని అంత తొందరగా అనుమానించలేం.  అవమానించలేం.
చారుకేశవ: అయితే నిన్న కాక మొన్న వచ్చిన వారే అయింటారు. 
యమున: మీరంతా లక్ష్మీని అనుమానిస్తున్నారా. 
పద్మాక్షి: సోదా చేస్తే ఎవరికీ ఏ అనుమానం ఉండదు.
చారుకేశవ: ఒకసారి లక్ష్మీ వస్తువులు చెక్ చేస్తే సరిపోతుంది కదా.
విహారి: కింద ఏదో గొడవ జరుగుతున్నట్లుందే అని వెళ్లబోతే కనకం తండ్రి ఫోన్ చేస్తాడు.
కాదాంబరి: ఇంకా ఆలోచిస్తారు ఏంటి అల్లుడు గారు లక్ష్మీ గది వెతకండి. 


చారుకేశవ, వసుధ ఇద్దరూ వెళ్లి లక్ష్మీ బ్యాగ్‌లో గాజులు చూస్తారు. వాటిని తీసుకొచ్చి చారుకేశవ అందరి ముందు చూపిస్తాడు. లక్ష్మీ, యమున షాక్ అయిపోతారు. లక్ష్మీ ఏడుస్తుంది. తానే దొంగతనం చేయలేదు అని అలాంటి అవసరం కూడా తనకు లేదని చెప్తుంది. వసుధ కూడా ఆ గాజులు చూసినప్పుడల్లా అలానే చూసేదని చెప్తుంది. దొంగతనం చేశానని ఒప్పుకొని బయటకు వెళ్లు అని లేదంటే పోలీసులకు పిలుస్తానని చారు కేశవ అంటాడు. కనక మహాలక్ష్మీ  మాత్రం తాను దొంగతనం చేయలేదని అంటుంది. చారుకేశవ మాత్రం యమున ఎంత చెప్పినా వినకుండా లక్ష్మీని అతని బ్యాగ్ తీసుకొని బయటకు ఈడ్చుకెళ్లాడు. బయటకు నెట్టేసే టైంలో పెద్దాయన చారుకేశవని ఆపుతారు. ఆ అమ్మాయిని పంపే ముందు మీరంతా నాకు ఓ మాట ఇవ్వండని అంటాడు. ఏ మాట అని పద్మాక్షి అడిగితే సాయం చేసిన వాళ్లకి పాడి కడతానని అంటాడు. తనకు ప్రాణ దానం చేసిన లక్ష్మీని ఇంత అవమానిస్తారా అని అంటాడు. ఎదురు తిరిగిని పెద్ద కూతురు పద్మాక్షి మీద కూడా పెద్దాయన ఆపు అని అరుస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్  పూర్తయిపోతుంది.  


Also Read: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ సీరియల్ ప్రోమో: కనక మహాలక్ష్మీ బ్యాగులో వసుధ గాజులు.. చారుకేశవ ప్లాన్‌తో లక్ష్మీ గడప దాటాల్సిందేనా?