Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి తన తాతయ్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో భక్తవత్సలం గారు లక్ష్మీని పిలిచి పూలదండలు తీసుకు రమ్మని పిలుస్తారు. లక్ష్మీ వస్తూ విహారిని చూసి విహారి కంట పడకూడదని దాక్కుంటుంది. ఇంతలో విహారి ఫోన్ పట్టుకొని బయటకు వెళ్లిపోతాడు. లక్ష్మీ ఊపిరి పీల్చుకొని తాతగారి దగ్గరకు వెళ్లి పండు ఇంకా దండలు తీసుకురాలేదని చెప్తుంది.
మరోవైపు సహస్ర తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంది. ఇంతలో పండు విహారికి నిశ్చితార్తానికి యమున ఇచ్చిన డ్రస్ ఇవ్వడానికి వెళ్తుంటాడు. సహస్ర అది చూసి అడిగి విషయం తెలుసుకొని అలాంటి డ్రస్ ఎవరైనా వేసుకుంటారా అని అంటుంది. ఇంట్లో అందరూ అక్కడికి చేరుకుంటారు. లక్ష్మీ కూడా ఆ సంభాషణ వింటుంది.
సహస్ర: ఇది చూడమ్మా విహారి బావ ఈ డ్రస్ నిశ్చితార్థానికి వేసుకోవాలంట.
పద్మాక్షి: ఇది కూడా ఓ డ్రస్ ఏనా. ఎవరైనా ఇది వేసుకుంటారా. వద్దు వద్దు అయినా నేను నా అల్లుడి కోసం స్పెషల్‌గా తీసుకున్నా కదా.
యమున: అది కాదు వదినా.
సహస్ర: అయినా నేను మ్యాచింగ్ సెట్ చేసుకున్నా అత్తయ్య. ఈ డ్రస్‌కి మ్యాచింగ్ డ్రస్ కూడా లేదు నా దగ్గర ఇప్పుడు.
యమున: అమ్మా సహస్ర నువ్వు దానికి అస్సలు టెన్షన్ పడొద్దు విహారి డ్రస్‌కి మ్యాచింగ్ గా నీకు చీర తీసుకున్నా.
సహస్ర: అసలు ఇదే బాలేదు అంటే దానికి మ్యాచింగ్ ఎందుకు.
యమున: అది కాదమ్మా సహస్ర అది మీ మామయ్య గారి డ్రస్ అది విహారి వేసుకోవాలని నేను ఎంతో కాలంగా అనుకుంటున్నా.
పద్మాక్షి: అయినా అవసరం లేదు వాళ్లు ఈ తరం పిల్లలు ఈ తరానికి తగ్గట్టు వాళ్లు ప్లాన్ చేసుకుంటారు. వాళ్ల ఇష్టాన్ని మనం గౌరవించకపోతే ఎలా.
యమున: అదికాదు వదిన మీ అన్నయ్య బట్టలు విహారి ఒంటి మీద చూడాలని ఎప్పటి నుంచో ఆశపడ్డా.
పద్మాక్షి: ఇది ఎంత పెద్ద ఫంక్షనో తెలుసా ఇలాంటి పెద్దింటి పోకడలు తెలియని వాళ్లని మా నెత్తిన పెట్టి మా అన్నయ్య వెళ్లిపోయాడు.
యమున: అమ్మ సహస్ర నువ్వు అయినా నా మాట వినమ్మా.
సహస్ర: ఇలాంటి పిచ్చి డ్రస్‌లు వద్దని ఎంత చెప్పినా వినరేంటి. మీ మొండి తనం మీదేనా మీ మూర్ఖత్వం మీదేనా మేం చెప్పింది పట్టించుకోరా అని డ్రస్ విసిరేస్తుంది.
యమున: డ్రస్ పట్టుకొని ఏడుస్తుంది. లక్ష్మీ కూడా చాలా బాధపడుతుంది. యమున ఆ డ్రస్ తీసి పళ్లెంలో పెట్టుకొని సహస్ర దగ్గరకు వచ్చి ఇది నీకు పాత డ్రస్ అయినా ఇది నాకు చాలా విలువైంది. డ్రస్‌కి విలువ ఇవ్వకపోయినా పెద్దలకు అయినా విలువ ఇవ్వు.
సహస్ర: ఇప్పుడు మీరు నాకు విలువలు నేర్పిస్తారా.
యమున: మాట్లాడకు అని వేలు చూపిస్తూ పెద్దగా అరుస్తుంది. అందరూ బిత్తరపోతారు.
అంబిక: యమున వదిన ఏంటి ఎప్పుడూ లేనిది ఇంత కోపంగా ఉంది.
యమున: చూడమ్మా నన్ను ఏమన్నా సహిస్తాను. ఎన్ని అన్నా పడతాను అంతే కానీ నా భర్త విషయంలో నా కొడుకు విషయంలో ఏమన్నా నోరు జారినా చూస్తూ ఊరుకోను. నువ్వు చిన్న పిల్లవి కదా అందుకే ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో నీకు తెలియకపోవచ్చు నీకు తెలియక పోతే నీ పెద్దలు నేర్పాలి (పద్మాక్షిని చూస్తూ) వాళ్లకి తెలీకపోతే నేర్చుకోవాలి. పండు నిశ్చితార్థంలో విహారి బాబు ఈ డ్రసే వేసుకుంటాడు తీసుకెళ్లి తన గదిలో పెట్టు.
పండు: ఒక్కోక్కరి ఫిలమెంట్లు రాలిపోయింటాయి. యమునమ్మ మాటలకు మంచి పని అయింది.
యమున: అత్తయ్య గారు మీ కొడుకు సమాధి దగ్గరకు వెళ్తా బయట మామయ్య విహారి ఎదురు చూస్తున్నారు.
సహస్ర డిసప్పాయింట్ అయిపోతుంది. అత్త మీద తల్లికి కంప్లైంట్ ఇస్తుంది. అంతా తాను చూసుకుంటానని తల్లి అంటుంది. తర్వాత పద్మాక్షి తన తల్లితో యమున నిశ్చితార్థంలో ఉండటానికి వీళ్లేదని నిశ్చితార్థంలో తాను ఎలాంటి ఇబ్బందులు తెచ్చినా అన్నయ్యలా నేను చనిపోతానని పద్మాక్షి వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు విహారి తన ఫ్రెండ్‌తో కనకం కనిపించే వరకు తన బాధ పోదని కష్టం తీరదని కనకాన్ని క్షేమంగా ఇంటి దగ్గరకు పంపే వరకు తనకు హ్యాపీగా ఉండదని అంటాడు. ఇక యమున అక్కడికి వస్తుంది. వహారి తల్లి కన్నీళ్లను చూసి ఏమైందని అడుగుతాడు. దానికి యమున విషయం చెప్పకుండా తండ్రి సమాధి దగ్గరకు వెళ్తున్నాం కదా నాన్న గుర్తొచ్చి బాధగా ఉందని అంటుంది. విహారి కూడా బాధపడతాడు. ఇక ముగ్గురూ సమాధి దగ్గరకు వెళ్తారు.
అంబిక దగ్గరకు సుభాష్ వస్తాడు. ప్రాజెక్ట్ ఇస్తామని వాళ్ల దగ్గర 25 కోట్లు తీసుకున్నాం కదా వాళ్లు డబ్బులు ఇవ్వకపోతే మీడియాకు ఎక్కుతామని గొడవ చేస్తున్నారని అంటాడు. అంబిక విహారి అడ్డు తొలగించుకోవాలని విహారిని చంపేద్దామని అంటుంది. సుభాష్ కూడా అదే కరెక్ట్ అని అంటాడు. ఇక అంబికని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకునే టైంలో మరోసారి వాళ్లని లక్ష్మీ చూసేస్తుంది. మళ్లీ దీని కంట పడ్డానని అంబిక అనుకొని లక్ష్మీ దగ్గరకు వెళ్లి తన చేయి మెలి తిప్పేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.