Brahmamudi Serial Today Episode: రూంలో ఆలోచిస్తూ కూర్చున్న రాజ్ దగ్గరకు తన ఆత్మ వస్తుంది. అసలు కళావతి అంటే ఇష్టమే కదా అందుకే ఇలా చేశావు కదా అంటాడు. ఇంట్లో ఫోటోలు ఉంటే ఎప్పుడు గుర్తుకువస్తుందని వెళ్లి ఎక్కడ మాట్లాడతావోనని భయంతో ఫోటోలు బయటపడేశావని చెప్తుంది. దీంతో రాజ సీరియస్ గా పూల కుండి మీదకు విసిరేసరికి ఆత్మ వెళ్లిపోతుంది. మరోవైపు కావ్య, అపర్ణ గుడిలో కలుసుకుంటారు.
కావ్య: అత్తయా..
అపర్ణ: ఎవరు నువ్వు నన్నెందుకు గుడికి రమ్మని పిలిచావు. నీకు నాకు ఏ సంబందం ఉందని రమ్మన్నావు.
కావ్య: నేను మీకు తెలియదా?
అపర్ణ: ఈ నువ్వు నాకు తెలియదు. నాకు తెలిసిన కావ్య నువ్వు కాదు.
కావ్య: అప్పుడైనా ఇప్పుడైనా ఒక్కలాగే ఉన్నాను.
అపర్ణ: కానీ ఒక్కచోట లేవు. అప్పుడు మా ఇంట్లో ఉన్నావు. ఇప్పుడు పుట్టింట్లో ఉన్నావు.
కావ్య: అది మీ ఇల్లు కనుకనే.. మీ ఇంట్లో చోటు లేదని. మీ అబ్బాయి మనసులో స్థానం లేదనే మా ఇంటికి పోయాను.
అపర్ణ: నా ఇల్లు నీ ఇల్లు కాదా. నా కొడుకు నీ భర్త కాడా..? వాడి మనసులో స్థానం లేకపోతే సంవత్సరం పాటు కలిసి కాపురం చేసేవాడా?
కావ్య: కాపురం మీరు బలవంతం చేస్తేనే నాతో కాపురం చేశాను అన్నాడు కదా?
అంటూ కావ్య బాధపడుతుంటే అపర్ణ దగ్గరకు వెళ్లి కావ్యను హగ్ చేసుకుని ఎమోషన్ గా ఫీలవుతుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు యోగక్షేమాలు మాట్లాడుకుంటారు. తర్వాత ఇంటిక రమ్మని అపర్ణ పిలిస్తే రానని కావ్య చెప్తుంది. ఇక ఇంటికి రానప్పుడు నాకు ఎందుకు సంజాయిషీ ఇవ్వాలనుకున్నావు అంటూ నిలదీస్తుంది అపర్ణ. లాగిపెట్టి ఒక్కటి ఇచ్చి కారులో వేసుకుని తీసుకుపోతాను అంటూ వార్నింగ్ ఇస్తుంది. మీ ఇద్దరికి ఈగో పైనుంచి కింది వరకు ఉంది అంటూ తిడుతుంది. ఇంతలో గుడి దగ్గరకు ఫ్రెండును కలవడానికి వచ్చిన రాహుల్, అపర్ణ, కావ్యలను చూసి షాక్ అవుతాడు. రుద్రాణికి ఫోన్ చేసి విషయం చెప్తాడు. దీంతో నేను చేయాల్సింది చేస్తాను అంటుంది రుద్రాణి. హాల్లోకి వెళ్తుంది. అక్కడ రాజ్ అమ్మ ఎక్కడ అని ఇందిరాదేవిని అడుగుతాడు. తెలియదని చెప్తుంది ఇందిరాదేవి.
రుద్రాణి: నీకు తెలియదా? అమ్మా.. వదిన ఎక్కడికి వెళ్లిందో నీకు నిజంగా తెలియదా? నాకు తెలుసు రాజ్
రాజ్: సరే
రుద్రాణి: ఏంటి సరే ఎక్కడికి వెళ్లిందో అడగవా..?
రాజ్: నువ్వేదో చెప్పడానికి మధ్యలో దూరిపోయావు కదా? వద్దన్నా చెప్తావని..
రుద్రాణి: మీరంతా ఇలా గుడ్డిగా మీరంతా ఇలా అందరినీ గుడ్డిగా నమ్మడం వల్లే ఈ ఇల్లు ఇలా తయారయింది.
ఇందిరాదేవి: సరే ఇక నుంచి గుడ్డిగా నమ్మడం మానేస్తాడు. ఇక నువ్వు వెళ్లు
రాజ్: ముందు చెప్పాల్సిందంతా చెప్పనివ్వు నానమ్మ లేకపోతే అత్తకు కడుపు ఉబ్బిపోతుంది. అందులో మా అమ్మ గురించి నాతోనే చెప్పడానికి వచ్చింది కదా?
రుద్రాణి: మీ అమ్మా గుడికి వెళ్లింది. ఎవరి దర్శనానికి వెళ్లిందో తెలుసా? నీ భార్యను కలవడానికి వెళ్లింది.
అని రుద్రాణి చెప్పగానే రాజ్ షాక్ అవుతాడు. ఇంతలో అపర్ణ వస్తుంది. రాజ్ కోపంగా నువ్వు గుడిలో ఎవరిని కలవడానికి వెళ్లావు అని అడుగుతాడు. దీంతో అందరి మధ్య గొడవ జరుగుతుంది. దీంతో తాను కావ్యను కలవడానికే వెళ్లానని అపర్ణ చెప్పడంతో ఇంకోసారి నువ్వు ఆ మనిషిని కలవడం నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్లిపోతాడు రాజ్. దీంతో నా కొడుకు సంగతి పక్కన పెట్టు అసలు నీ కొడుకు గుడిలో ఏం చేస్తున్నాడో తెలుసుకో అంటూ ఇంట్లో ఇంత అందమైన భార్యను పెట్టుకుని బయట వేరే ఆమ్మాయితో షికార్లు చేస్తున్నాడు అని చెప్పడంతో స్వప్న, రాహుల్ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం