Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీ విహారి గదిలో ఉండటం సహస్ర చూస్తుంది. నీకు ఇక్కడేం పని అని అడుగుతుంది. విహారికి మజ్జిగ తీసుకొచ్చాను అని లక్ష్మీ అంటే సహస్ర తిడుతుంది. దాంతో విహారి నేనే తీసుకురమ్మని చెప్పానని అంటాడు. త్వరగా రెడీ అయి కిందకి రమ్మని చెప్తుంది. లక్ష్మీ వైపు చూసి ఏయ్ మజ్జిక ఇచ్చేశావ్ కదా ఇంకా ఇక్కడే నిల్చొని చూస్తున్నావ్ పో ఇక్కడ నుంచి అని కసిరేస్తుంది.
విహారి: ఏంటి సహస్ర ఇది కాస్త వినయంగా చెప్పొచ్చు కదా.
సహస్ర: ఏంటి బావ పని వాళ్లతో వినయం ఏంటి.
విహారి: తను ఇంట్లో ఉన్నంత మాత్రాన పని ఆమె కాదు కాస్త గౌరవం ఇచ్చి మాట్లాడు.
సహస్ర: సరే ఇస్తాను ముందు నువ్వు మజ్జిగ తాగు. విహారి మూతికి మజ్జిగ అతుక్కుంటే తన చున్నీతో తుడిచి సహస్ర వెళ్లిపోతుంది.
విహారి: కనక మహాలక్ష్మీ నీతో చాలా మాట్లాడాలి నిన్ను ఇలా మధ్యలో వదిలేసినందుకు క్షమించమని అడగాలి.
యమున: కొడుకు తాగడం గుర్తు చేసుకొని వచ్చి కొడుకు పక్కన కూర్చొంటుంది. విహారి నువ్వు బాగానే ఉన్నావ్ కదా. ఏదో భారం నీ మనసులో ఉందని నాకు అనిపిస్తుంది. నిన్ను రాత్రి నేనొక కొత్త విహారిని చూశాను. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విహారిని చూశాను. తాగిన తర్వాత నువ్వు మాట్లాడిన తీరు గురించి నేను మాట్లాడుతున్నాను నాన్న. నీ మనసులో ఏదో భారం దించుకోవాలని తాగినట్లు ఉంది.
విహారి: అమ్మా మనసులు ఎప్పుడు ఒకేలా ఉండరమ్మా. ఎప్పుడు మనకు సంతోషంగా కనిపించే వ్యక్తి జీవితాంతం సంతోషంగా ఉంటారని చెప్పలేం కదమ్మా కాలం మనకు చాలా మలుపులు ఇస్తుంది. ఒక్కో మలుపు ఆనందం ఇస్తే మరో మలుపు బాధ ఇస్తుంది. కానీ కానీ ఇంకో మలుపు మనం ఊహించనంత భయంకరంగా ఉంది.
యమున: చాలా కొత్తగా మాట్లాడుతున్నావ్ విహారి. అమ్మ దగ్గర ఏదో దాస్తున్నావ్ అనిపిస్తుంది. నీలో మార్పు కనిపిస్తుంది. నీకు సంతోషం ఉండాలి తప్ప బాధ ఉండకూడదు విహారి.
విహారి: నువ్వు ఎప్పుడు నా మంచి కోరుకుంటావ్ కాబట్టి నాకు ఏం ఇబ్బందులు రావమ్మా. మనసులో కాలం నాకు చాలా పెద్ద పరీక్ష పెట్టిందమ్మా. ఆ సమస్య ఎలా పరిష్కరించాలో తెలియక సతమతం అవుతున్నాను.
విహారి ఫ్రెష్ అయి లక్ష్మీ మాటలు గుర్తు చేసుకుంటాడు. కనక మహాలక్ష్మీతో ఎలా అయినా మాట్లాడాలి అని వెళ్తాడు. లక్ష్మీ పద్మాక్షి వాళ్ల కోసం కాఫీ తీసుకెళ్తుంది ఇంతలో పద్మాక్షి లక్ష్మీ కాఫీ లేటు అయిందని అరుస్తుంది. అదంతా విహారి చూస్తుంటాడు. లక్ష్మీ కంగారుగా కాఫీ తీసుకెళ్తు హడావుడిలో టేబుల్‌కి తన్నేసి కాఫీ కింద పడిపోతుంది. దాంతో పద్మాక్షి లక్ష్మీని తిడుతుంది. లక్ష్మీ క్షమాపణ చెప్తుంది. చేతకాని పనివాళ్లు అని అంబిక తిడుతుంది. పని చేయరు మూడు పూటలు బాగా మెక్కుతారు అని అంటుంది అంబిక. విహారి ఆ మాటలకు షాక్ అయిపోతాడు. ఇప్పుడే క్లీన్ చేస్తానని చెప్పి లక్ష్మీ వెళ్తుంటే విహారి లక్ష్మీని ఆపుతాడు.
విహారి: పండు ఉన్నాడు కదా తనకి చెప్పు క్లీన్ చేస్తాడు.
లక్ష్మీ: పర్లేదు విహారి గారు ఇది నా పనే కదా నేను క్లీన్ చేస్తాను.
విహారి: ఇది నీ పనా నువ్వు ఈ ఇంటి పని మనిషివి కాదు నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంతకు ముందు ఎక్కడైనా పని చేశావా లేదు కదా అలాంటప్పుడు ఇక్కడ పని దానిలా ఉండాల్సిన అవసరం ఏముంది.
పద్మాక్షి: ఏంటి విహారి లక్ష్మీ నీకు ముందే పరిచయం ఉన్నట్లు మాట్లాడుతున్నావ్. పని మనిషి కాదు అన్నట్లు సొంత మనిషి అన్నట్లు మాట్లాడుతున్నావ్.
లక్ష్మీ: విహారి గారు ఈ విషయం ఇక్కడితో వదిలేయండి నా పని నన్ను చేసుకోనివ్వండి.
లక్ష్మీ కింద పడిన కాఫీ క్లీన్ చేస్తుంటే విహారి చాలా ఫీలవుతాడు. మనసులో నీ తల్లిదండ్రులు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటే ఇక్కడ పాచి పని చేయాల్సి వస్తుందని అనుకుంటాడు. ఉదయం భక్తవత్సలం ఇంటికి పంతుల్ని పిలిపిస్తారు. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. విహారి, సహస్రల జాతకాలు చూస్తారు. పది రోజుల్లో పెళ్లికి మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్తారు. అందరూ సందడి చేస్తుంటారు. విహారి మాత్రం మనసులో లక్ష్మీని ఎదురుగా పెట్టుకొని ఎలా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఇప్పుడు తనకు ఇష్టం లేదని విహారి చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.