Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీని హాస్పిటల్‌కి తీసుకెళ్తారని శాశ్వతంగా లక్ష్మీకి కళ్లు కనిపించకుండా చేయమని అంబిక సుభాష్‌కి చెప్తుంది. ఇక రుక్మిణి కూతురి ఫొటో చూస్తూ ఏడుస్తుంది. అక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకుంటుంది. ఓ పెద్దాయన భోజనం తీసుకొచ్చి రుక్మిణికి ఇస్తారు.
రుక్మిణి ఆ పెద్దాయనకు నిన్న అమ్మిరాజుతో రెండు రోజుల్లో ఏదో ఉంది అని అంటున్నావ్ ఏంటి అది అని అడుగుతుంది. దాంతో ఆయన నీ కూతురు అమ్మిరాజు చేతిలో నలిగిపోతుందమ్మా.. ఆ దుర్మార్గుడు రెండు రోజుల్లో నీ కూతుర్ని పెళ్లి చేసుకొని నీ ఆస్తి మొత్తం కాజేయాలని ప్లాన్ చేశారు అని అంటారు. రుక్మిణి షాక్ అయిపోతుంది. ఎలా అయినా నా కూతుర్ని కాపాడుకోవాలి అని అక్కడ నుంచి తప్పించుకోవాలని అనుకుంటుంది.
పెద్దాయన భోజనం ఇచ్చి వెళ్తుంటే రుక్మిణి గుండె నొప్పి అని నాటకం ఆడుతుంది. అతను మంచి నీరు తీసుకొచ్చి ఇచ్చే టైంలో అతని తల మీద కొట్టి రుక్మిణి పారిపోతుంది. పెద్దాయన రౌడీలకు విషయం చెప్తాడు.
పద్మాక్షి సహస్రని తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. డాక్టర్ ఐవీఎఫ్ డాక్టర్ అని తెలిసి సహస్ర నన్ను ఆవిడ దగ్గరకు ఎందుకు తీసుకెళ్తున్నావ్ అని అడుగుతుంది. ఆవిడ గైనకాలజిస్ట్ కూడా రావే తీసుకెళ్తుంది. ఇక అదే హాస్పిటల్‌కి విహారికి లక్ష్మీని తీసుకొస్తాడు. సుభాష్ కూడా వచ్చి వచ్చి నర్స్‌లా డ్రెస్ చేసుకుంటాడు. అంబికకు కాల్ చేసి లక్ష్మీకి చెక్ చేస్తారని లోపలికి తీసుకెళ్తున్నారని లక్ష్మీకి శాశ్వతంగా కళ్లు పోయేలా చేస్తానని అంటాడు. అందుకు కెమికల్ డ్రాప్ తెచ్చుకుంటాడు.
సహస్ర, పద్మాక్షి డాక్టర్‌ని కలుస్తారు. లక్ష్మీని డాక్టర్ పరీక్షిస్తారు. సహస్రని డాక్టర్ కొన్ని టెస్ట్‌లు చేయాలి అని పద్మాక్షిని బయటకు పంపిస్తారు. సహస్ర, లక్ష్మీ ఇద్దరికీ టెస్ట్‌లు చేస్తారు. సహస్ర తల్లితో నువ్వు కడుపు నొప్పి అని తెలిస్తే వీళ్లేంటి ఏవేవో చేస్తున్నారు అని అంటుంది. అన్నీ టెస్ట్‌లు చేస్తారే నీకేమైందో తెలుసుకోవాలి కదా అని అంటుంది. ఇక సహస్ర వాటర్ తాగి వస్తా అని వెళ్తుంది. విహారి అప్పటి వరకు బయటే ఉండి సహస్ర వచ్చే టైంకి లోపలికి వెళ్లిపోతాడు.
డాక్టర్ లక్ష్మీని చూసి ప్రైమరీ టెస్ట్‌లు జరిగాయి.. లక్ష్మీకి చూపు వస్తుందని అంటాడు. ఇంకా కొన్ని టెస్ట్‌లు చూసి ఫైనల్ రిపోర్ట్స్ ఉన్నాయని అంటారు. ఇక కొన్ని టెస్ట్‌లు చేయాలని అంటారు. విహారి మందులు కొనక్కురావడానికి వెళ్తాడు. ఇక పండు యమునతో విహారి బాబుకి కాల్ చేయమని అంటాడు. యమున ఫోన్ చేస్తుంది. విహారి తల్లితో డాక్టర్ లక్ష్మీకి చూపు వచ్చే అవకాశం ఉందని చెప్పారని చెప్తాడు. యమున చాలా హ్యాపీగా ఫీలవుతుంది. విహారి మందులు తీసుకొని వెళ్తూ ఉంటే సుభాష్ విహారిని ఢీ కొడతాడు. మందులు అందించినట్లు చేస్తూ డ్రాప్స్ మార్చేస్తాడు. ఇక విహారి సుభాష్‌ని ఆపి మాస్క్ తీయమని అంటాడు. మిమల్ని ఎక్కడో చూసినట్లు ఉందని అంటాడు. నేను మిమల్ని ఇప్పుడే చూశాను సార్ నాకు కొంచెం అర్జెంట్ పని ఉందని సుభాష్ వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.