Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహలక్ష్మీ అందరికీ భోజనం వడ్డిస్తుంది. విహారికి పండు వేరే ప్లేట్ పెడితే తన ప్లేట్ తనకు కావాలని విహారి చెప్పి పండుకి తన ప్లేట్ తీసుకురమ్మని అంటాడు. సహస్ర ఎందుకు బావ అది బంగారం ప్లేట్ కాదు ప్లాటినం ప్లేటు కాదు అదే ఎందుకు అడుగుతున్నావని అంటే ఇది నా ఫేవరెట్ ప్లేట్ అని విహారి చెప్తాడు. దానికి పద్మాక్షి సహస్ర అలాగే ప్రశ్నలు అడుగుతుంది విహారి నువ్వు నీకు నచ్చినట్లు తిను అని చెప్తుంది.


విహారి: అమ్మా నేను ఆఫీస్‌ పని మీద అర్జెంట్‌గా ముంబాయి వెళ్లాలి ఈ రోజు రాత్రి పదకొండున్నరకి ఫ్లైట్. 
యమున: ఈరోజే ప్రయాణం పెట్టుకొని ఇప్పుడు చెప్తున్నావ్ ఏంటి నాన్న.
సహస్ర: బావ మన పెళ్లి పనులు పెట్టుకొని ఇప్పుడేంటి బావ
విహారి: జస్ట్ రెండు మూడు రోజులే సహస్ర
అంబిక: మనసులో.. ఆఫీస్‌లో అర్జెంట్ పని అని అంటున్నాడు. అంత అర్జెంటుగా వెళ్లాల్సిన పని నాకు తెలీకుండా ఏముంది నిజంగా ఆఫీస్‌ పనేనా లేక అబద్ధం చెప్తున్నాడా.
సహస్ర: వసుధ, చారుకేశవ ప్రాజెక్ట్ గురించి చెప్పి కంగ్రాట్స్ చెప్తే. కంగ్రాట్స్ బావ నాకు తెలుసు బావ నువ్వు ఒకసారి పట్టుకున్నావంటే వదిలి పెట్టవు.
విహారి: మనసులో లక్ష్మీని చూస్తూ ఒక్క విషయంలో తప్ప.
సహస్ర: ఏం ఆలోచిస్తున్నావ్ బావ.
విహారి: పట్టుకున్నవి అన్నీ కలకాలం వదలకుండా పట్టుకోవడం సాధ్యం కాదు సహస్ర.
సహస్ర: ఏమో బావ నీ మాటలు ఒక్కోసారి నాకు అస్సలు అర్థం కావు.
విహారి: అయినా ఈ ప్రాజెక్ట్ నాకు రావడానికి మెయిన్ కారణం ఒక అమ్మాయి ఆ అమ్మాయి వల్లే నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది.
అంబిక: మనసులో వీడేంటి ఈ లక్ష్మీని ఇంత పొగిడేస్తున్నాడు
చారుకేశవ్: మనసులో నేను ఈ లక్ష్మీని ఇంటి నుంచి పంపేయాలని అనుకుంటే ఇది విహారి దగ్గర అంత మంచి మార్కులు కొట్టేస్తుంది. 


అందరూ తను ఎవరని అడిగితే విహారి చెప్పబోతే లక్ష్మీ వద్దని తలాడిస్తుంది. ఇక చారుకేశవ కూడా అడ్డుకొని ఆఫీస్ విషయాలు వద్దని అంటాడు. ఇక అందరూ డిన్నర్ పూర్తి చేస్తారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత పండు లక్ష్మీతో విహారి బాబు తిన్న ప్లేట్ కిచెన్‌లో పెడతాను నీ వ్రతం పూర్తి చేయడానికి ఇందులో భోజనం తీసుకొని నీ గదిలోకి వెళ్లి తిను అని చెప్తాడు. ఇక లక్ష్మీ దేవుడికి దండం పెట్టుకొని అమ్మవారి ఎదురుగా విహారి ప్లేట్‌లో అన్నం తింటుంది. మరోవైపు సహస్ర ఒంటరిగా కూర్చొని బావ ఉండగా లక్ష్మీని పంపేయడం కష్టమని బావ లేని టైంలోనే లక్ష్మీని ఇంటి నుంచి పంపేయాలని అనుకుంటుంది. ఇక ఈ రోజు బావ ఊరు వెళ్తున్నాడు కాబట్టి లక్ష్మీని ఈ రోజే పంపేయాలని లక్ష్మీ గదికి వెళ్తుంది. లక్ష్మీ గది డోర్ కొడుతుంది. తింటున్న లక్ష్మీ సహస్ర మాటలు విని భయపడుతుంది. దేవుడు ఉన్న కబోర్డ్ తలుపులు మూసేసి చేయి కడగకుండా విహారి ప్లేట్ దాయకుండా వెళ్లి డోర్ తీస్తుంది. 


సహస్ర: లక్ష్మీ నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్లిపో కొంపలు కూల్చేవాళ్లు ఈ ఇంట్లో ఉండొద్దు. మా బావ మీద నాకు నమ్మకం లేదు కానీ నీ మీద నమ్మకం లేదు. ఎప్పుడు మా బావని వలలో వేసుకుంటావో అని ఒకటే భయం నాకు ఈ టెన్షన్ నా వల్ల కాదు. చూడు ఈ రోజు బావ ముంబయి వెళ్తున్నారు తను ఇంట్లో నుంచి వెళ్లిన పది నిమిషాల్లో నువ్వు వెళ్లిపోవాలి లేదుంటే నీ ప్రాణాలు తీసి నేను హంతకురాలు అవ్వాల్సి వస్తుంది. వెళ్తూ వెళ్తూ విహారి ప్లేట్ గదిలో చూస్తుంది. ఏయ్ బావ ప్లేట్ ఇక్కడెందుకు ఉందే. 
లక్ష్మీ: అది.. 
సహస్ర: అంటే బావ ప్లేట్‌లో నువ్వు తింటున్నావా. అడుగుతున్నది నిన్నే సమాధానం చెప్పవేంటి. 
పండు: అమ్మో లక్ష్మీమ్మ దొరికేసింది ఎలా కవర్ చేయాలి. భలే వారమ్మ అలాంటి ప్లేట్లు ఒకటే ఉందనుకుంటున్నారా ఇంకా నాలుగైదు ఉన్నాయి. ఆ కలర్ ఉన్న ప్లేట్‌ ప్రతీది విహారి ప్లేట్‌దే అవుతుందా. విహారి బాబు గారు తిన్న ప్లేట్ కింద ఉంది ఇప్పుడే కడిగి వచ్చా.
సహస్ర: చెప్పింది గుర్తుంది కదా.
లక్ష్మీ: చాలా థ్యాంక్స్ పండు దొరికిపోయా అనుకున్నా.
పండు: నిన్ను కాపాడటానికి నేను ఉన్నాను అమ్మ త్వరగా తిను విహారి బాబుగారితో ఊరు వెళ్లాలి కదా.
 
విహారీ లగేజ్ సర్దుకొని కిందకి వస్తాడు. అందరికీ చెప్పి బయల్దేరుతాడు. యమున, సహస్ర కంగారు పడతారు. కొన్ని ముఖ్యమైన పరిస్థితులు చక్కదిద్దాలని అంటాడు. అంబికలో అనుమానం పెరుగుతుంది. సహస్ర విహారితో మన పెళ్లి అనుకున్న తర్వాత నువ్వు ఇన్ని రోజులు నాకు దూరంగా ఉంటున్నావు నాకు ఏదోలా ఉందని సహస్ర అంటుంది. దానికి విహారి అక్కడ పరిస్థితులు చక్కబెడితేనే నీతో ప్రశాంతంగా పెళ్లి చేసుకోగలను అంటాడు. అందరూ దగ్గరుండి విహారిని పంపిస్తారు. మరోవైపు లక్ష్మీ లగేజ్ సర్దుకొని గదిలో టెన్షన్‌గా తిరుగుతూ ఉంటుంది. విహారి లక్ష్మీకి కాల్ చేసి నేను వెయిట్ చేస్తున్నా నువ్వు వచ్చేయ్ అంటాడు. లక్ష్మీ భయంగా ఉందని అంటే నేను ఉన్నాను కదా విహారి లక్ష్మీకి ధైర్యం చెప్తాడు. లక్ష్మీ యమున దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మీకి సినిమా చూపించిన అత్తాకోడళ్లు.. తప్పతాగి కోతిలా గంతులేసిన మహా!