Trinayani Serial Today Episode గురువుగారు వెళ్లిపోయిన తర్వాత అందరూ సరిగ్గా మూడు గంటలు అన్నారు అదేంటో అర్థం చేసుకోవాలని అనుకుంటారు. వల్లభ గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి అని తిరుగుతూ ఉంటే తిలోత్తమ వచ్చి నీకు కాదురా నయనికి చెప్పారు నువ్వు ఇలా అయిపోవాల్సిన అవసరం లేదని అంటుంది. 


తిలోత్తమ: అంటే ఇప్పుడు నయని సూచనలు, గుర్తులు, సిగ్నల్స్ వీటి ఆధారంగా అడుగులు వేయబోతుందని నువ్వు అంటున్నావ్ అంటే కదా. గురువుగారు కూడా అలా చెప్పారు అంటే ఆయనకు ఏదో రహస్యం తెలిసుంటుందని అర్థం కదా. 
వల్లభ: అంతే కదా మమ్మీ కానీ చెప్పరు. 
తిలోత్తమ: నేను పసిగడతానులే.
పావనా: హాసినమ్మ తెల్లారితే నయని అమ్మ ఎలా మారుతుందో అని భయంగా ఉంది.
హాసిని: కూల్ బాబాయ్ తనని మనం అర్థం చేసుకొని పనులు చక్కబెడితే చాలు విసిగిస్తే ఇలాగే ఉంటుంది. 
వల్లభ: పూటకొకలా ప్రవర్తిస్తే ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలీదు.


ఇంతలో విశాలాక్షి వస్తుంది. హాసిని, పావనా చాలా సంతోషిస్తారు. నన్ను చూసి ఇంత సంతోషిస్తున్నారు ఏంటి అని విశాలాక్షి అడుగుతుంది. ఇక విశాల్ ఎప్పుడొచ్చావమ్మా అంటే నేను ఎప్పుడూ నీ దగ్గరే ఉంటాను కదా నాన్న కొత్తగా రావడం ఏంటి అంటుంది. దానికి తిలోత్తమ నీకు కూడా తలకు దెబ్బ తగిలిందా ఏంటి అని అడుగుతుంది. 


విశాలాక్షి: నా పేరు తలచుకుంటే మీలోనే ఉంటాను కదా కొత్తగా రావడం ఏంటి అని అంటున్నాను.
పావనా: నయనమ్మ వస్తుంది.
వల్లభ: ఆఫ్ సారీ కట్టిందంటే నయనికాదు.
విశాలాక్షి: అవును.
తిలోత్తమ: నీకు తను తెలుసా
విశాలాక్షి: నేనే తనకు తెలుసు. త్రినేత్రి విశాలాక్షిని చూసి దేవీపురంలో అడవిలో కొలిచే అమ్మవారే విశాలాక్షి అని రెండు చేతులు జోడించి దండం పెడుతుంది. 
త్రినేత్రి: అమ్మా మహాంకాళి. అందరూ షాక్ అయిపోతారు. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే మహాంకాళి దర్శనం దొరుకుతుందో తెలుసా.
విశాల్: నయని విశాలాక్షిని మహాంకాళి అని ఎందుకు అంటావ్.
త్రినేత్రి: అమ్మవారికి ఎన్నో పేర్లు ఉంటాయి కదా బాబు మా ఊరిలో ఈ అమ్మని ఇలాగే పిలుస్తారు. 
విక్రాంత్: నాకు అర్థమైంది విశాలాక్షిని చూసి దేవీపురంలోని మహాంకాళి అమ్మవారు అని అంటున్నారు. 
త్రినేత్రి: మేం మీ దగ్గరకు పూలు తీసుకొని రావాలి కానీ నువ్వు వచ్చావేంటి అమ్మ.
విశాలాక్షి: నువ్వు రాలేదని నేను వచ్చాను
త్రినేత్రి: నేను నీ దగ్గరకు రావాలి అనుకున్నా కానీ రాలేను కదామ్మా. 
విశాలాక్షి: ఎందుకో ఆలోచించు.
త్రినేత్రి: పోయిన వారం వచ్చాను నీకు ముస్తాబు చేశాను హారతి ఇచ్చాను తర్వాత ప్రసాదం తిని.
విశాలాక్షి: బాగా గుర్తు చేసుకో అమ్మ
త్రినేత్రి: కళ్లు మూశానమ్మా తర్వాత నాకు ఏం గుర్తు లేదు.
విక్రాంత్: ఇక్కడ ఏదో లాజిక్ ఉంది అది అర్థం చేసుకోవాలి.
తిలోత్తమ: నయని దేవీపురం వెళ్లింది కానీ గుడికి వెళ్లలేదు కదా.
విశాలాక్షి: ఆదివారం, గురువారం, శుక్రవారం ఈ మూడు రోజులు తనే వచ్చేది.
హాసిని: ఏమంటున్నారు చెల్లి నువ్వు దేవీపురం వెళ్లిందే మొన్న కదా అది కూడా మొదటి సారి.
విక్రాంత్: లేదు లేదు ఇందులో ఏదో కిటుకు ఉంది. మీరు మాట్లాడుకునే దాని బట్టి చూస్తే దేవీపురం అడవి దగ్గర ఏదో జరిగింది అనిపిస్తుంది.
విశాలాక్షి: అవును చిన్నాన్న తెలివి గలవాడివి కాబట్టి ఇలా ఆలోచిస్తున్నావు.
విశాల్: నయని దేవీపురం వచ్చి నాకు కాల్ చేసింది పదినిమిషాల్లోనే యాక్సిడెంట్ జరిగింది.
విశాలాక్షి: నయనమ్మకి యాక్సిడెంట్ జరిగింది ఈ అమ్మకి కాదు కదా. అమ్మ పేరు త్రినయని ఈ అమ్మ పేరు త్రినేత్రి అందరూ షాక్‌తో బిత్తర పోతారు. 
విక్రాంత్: అంటే ఇక్కడున్నది వదిన కాదంటావా విశాలాక్షి.
విశాలాక్షి: నేను ఎందుకు అలా అంటాను.
విశాల్: విశాలాక్షి నయని మీతో చెప్పలేదు అంతెందుకు మేం కూడా నీతో చెప్పలేదు కానీ నువ్వు త్రినేత్రి అని ఎలా చెప్పావు.
విశాలాక్షి: నాకు తెలీనిది ఏముంటుంది నాన్న.
పావనా: సోదరి మాకు ఏంటీ పరీక్షలు.
విక్రాంత్: నాటకాలు ఆడుతున్నారు మామయ్య.
విశాల్: విక్రాంత్ నయనిని అన్నా ఊరుకున్నా కానీ చిన్న పిల్ల విశాలాక్షిని ఏం అనకు.
విశాలాక్షి: నాన్న నాటకాలు ఆడుతున్నది నేను కాదు ఈ అమ్మ కూడా కాదు. నాటకాలు ఆడుతున్నది మీ తమ్ముడు విక్రాంత్ బాబు. మళ్లీ అందరూ షాక్ అయిపోతారు.
పావనా: చిన్నల్లుడా.
విశాలాక్షి: ఇక్కడికి వచ్చింది నయనమ్మ కానప్పుడు మరి నయని ఎక్కడని మీరు విక్రాంత్ బాబుని ఆరా తీశారా. వీళ్లందరూ అనుకున్నట్లు కాసేపు అనుకుందాం నాన్న తను నయనమ్మ కాదని. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మీకి సినిమా చూపించిన అత్తాకోడళ్లు.. తప్పతాగి కోతిలా గంతులేసిన మహా!