Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ గదికి తాను వెళ్లినప్పుడు ఎవరో డోర్ లాక్ చేశారని ఎవరో తెలుసుకోవడానికి సీసీ టీవీ ఫుటేజ్ చూస్తానని విహారి చారుకేశవకి తీసుకురమ్మని చెప్తాడు. చారుకేశవ ఫుటేజ్ తీసుకొస్తే అందులో విహారి వెళ్లడం ఉంటుంది కానీ అంబిక డోర్ లాక్ చేయడం సీన్స్ ఎర్రర్ అని వస్తుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారని విహారి అంటాడు. 


విహారి: సహస్ర ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకో. నేను లక్ష్మీకి థ్యాంక్స్ చెప్పాలని వెళ్లాను. ఫోన్ చేద్దామంటే నా ఫోన్ లక్ష్మీ ఫోన్ కూడా లేవు ఇంతకంటే నేను ఏం చెప్పలేను. సహస్ర లక్ష్మీ కూడా నీలాంటి ఆడపిల్లే తన గురించి నోటికి వచ్చినట్లు అనే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడు.  
పద్మాక్షి: బాగుంది చాలా బాగుంది ఒక పని దాని కోసం నా కూతురి మీదే చేయి ఎత్తాడు నీ కొడుకు నాకు నా కూతురికి ఇంత అవమానం జరిగితే ఇంకా ఈ ఇంట్లో ఉండం. రెండు కుటుంబాలు కలుస్తాయని వచ్చాం కానీ అది ఎప్పటికీ జరగదు అని తెలిసిపోయింది ఈ ఇంట్లో ఇంకొక్క క్షణం మేం ఉండం పద సహస్ర అని సహస్రని తీసుకొని వెళ్లిపోతుంది.
విహారి: అందరూ లక్ష్మీని చాలా మాటలు అన్నారు తన మెడలో తాళి కట్టినందుకు భార్య స్థానం ఇవ్వలేదు కనీసం తనని తిట్టకుండా కూడా అడ్డుకోలేకపోయాను ఛా
యమున: విహారి సహస్రని తీసుకొని పద్మాక్షి వెళ్లిపోతుందిరా. నువ్వు సహస్ర మీద చేయి ఎత్తుకున్నందుకు వాళ్లు హర్ట్ అయ్యారురా.
విహారి: అగు అత్త.. అత్త నన్ను అర్థం చేసుకుంటారు అనుకున్నా ఇలా అపార్థం చేసుకుంటారనుకోలేదు
పద్మాక్షి: అపార్థం చేసుకుంటే అర్థమయ్యేలా చెప్పాలి అంతే కానీ చేయి ఎత్తుతావా. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్లి అయితే తనని హింస పెట్టవని గ్యారెంటీ ఏంటి. 


అందరూ విహారి గురించి పద్మాక్షి చెప్తారు. విహారిని తప్పుగా అర్థం చేసుకోవద్దని అంటారు. నేను నా భర్తే సహస్ర మీద ఎప్పుడూ చేయి ఎత్తలేదు నువ్వు ఎత్తావని అంటుంది. ఆ స్థానంలో లక్ష్మీ కాకుండా ఎవరున్నా అలాగే రియాక్ట్ అయ్యేవాడినని విహారి అంటారు. సహస్ర నోటి వెంట అలాంటి పదాలు రావడం తట్టుకోలేకపోయానని అంటాడు. సారీ చెప్తాడు. వెళ్లొద్దని బతిమాలుతాడు. ఇరవై ఏళ్ల కింది ఇలా ఆవేశంలో వెళ్లిపోయి నీ ప్రేమను దూరం చేసుకున్నావని ఇప్పుడు నన్ను ఇష్టపడిన సహస్రని బలవంతంగా తీసుకెళ్లి అదే రిపీట్ చేయొద్దని అంటాడు. దాంతో పద్మాక్షి ఈ ఒక్క సారికి క్షమిస్తానని చెప్తుంది. 


మరోవైపు అంబిక విహారి క్యారెక్టర్ నాశనం చేద్దామనుకుంటే ఇలా జరిగిందేంటి అసలు సీసీ టీవీ ఫుటేజ్ ఏమైందని అని అనుకుంటే చారు కేశవ ఫోన్ తీసుకొని వస్తూ అనుకున్నది ఒకటి అయినది ఒకటి బోల్తా కొట్టిందే బుల్ బుల్ పిట్టా అని పాడుకుంటూ వస్తాడు. అంబిక చారుకేశవ మీద సీరియస్ అయితే ఇంట్లో ఉంది దొంగ మనకెందుకు బెంగ అనే సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది చూడు అని అంబిక గది తలుపు వేయడం చూపిస్తాడు. అంబిక షాక్ అయిపోతుంది. ఆ ఫుటేజ్ నాకు ఇచ్చేయ్ అని అంబిక లాక్కోబోతే చారుకేశవ అన్ని సార్లు అధికారం చూపిస్తే చెల్లదు బతిమాలాలి అంటాడు. దాంతో అంబిక బావగారు అని బతిమాలుతుంది. వీడియో డిలీట్ చేయాలి అంటే రెండు లక్షలు ఇవ్వమని అంటాడు. దాంతో అంబిక డబ్బులు అకౌంట్‌కి వేస్తుంది. ఫుటేజ్ డిలీట్ చేయకుండా చారుకేశవ వెళ్లిపోతాడు. 


మరోవైపు సహస్ర తనకు జరిగిన అవమానం తలచుకొని బాధపడుతుంది. పద్మాక్షి కూడా అక్కడే ఉంటుంది. యమున వెళ్లి ఓదార్చుదామంటే వసుధ వద్దని అంటుంది. అయినా యమున వెళ్లి మాట్లాడుతుంది. పద్మాక్షి యమున మీద సీరియస్ అవుతుంది. ఈ విషయం ఎవరి దగ్గర తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటా అని సహస్రని తీసుకొని లక్ష్మీ దగ్గరకు వెళ్తుంది పద్మాక్షి. నా కూతురి జీవితాన్ని ఈ కుటుంబాన్ని ఏం చేయాలి అనుకుంటున్నావ్ అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీప కార్తీక్‌ల చనువు చూసి మురిసిపోయిన అక్కాచెల్లెళ్లు.. కార్తీక్.. కార్తీక్‌.. అంటోన్న శౌర్య!