Brahmamudi Serial Today Episode:  కనకానికి ఫోన్‌ చేసిన రాజ్‌ అపర్ణతో మాట్లాడాలి ఫోన్‌ ఇవ్వమని చెప్తాడు. నేను ఎవ్వరితో మాట్లాడను అంటూ చెప్పడంతో రాజ్‌ ఫోన్‌ కట్‌ ‌చేస్తాడు. చూశారా..? నేను చెప్పాను కదా..? మా అమ్మ అక్కడే ఉంటుందని అనగానే అయితే వెళ్లి తీసుకురా..? అని చెప్తారు. నేను వెళ్లనని రాజ్‌ అనడంతో సుభాష్‌ కోప్పడతాడు.


సుభాష్‌:  నీ పెళ్లానికి నువ్వు దూరంగా ఉండటం నీకు ఇష్టమేనేమో.. కానీ నా పెళ్లానికి దూరంగా ఉండటం నాకు ఇష్టం లేదు.


రుద్రాణి: నువ్వే వెల్లొచ్చు కదా అన్నయ్యా.. రాజ్‌ను ఎదుకు ఇబ్బంది పెడుతున్నావు.


సుభాష్‌: తప్పు చేసింది వాడైతే నేనెందుకు వెళ్లాలి. వీణ్ణి గారాబం చేసి నేనే చెడగొట్టాను అని అపర్ణ అంది.


రాజ్‌ : నాకు నిజంగా అంత మొండితనం ఫొగరే ఉంటే కావ్యను సీఈవోను చేసినప్పుడు మేనేజర్‌ గా ఎందుకుంటాను.


సీతారామయ్య: అందుకేగా పెళ్ళాన్ని ఇంట్లోంచి వెళ్లగొట్టావు. 


రాజ్‌: ఆ కావ్య ఇంటికి వచ్చి సంవత్సరం కాలేదు. అప్పుడే దాన్ని నెత్తిన పెట్టుకున్నారు. అంతక ముందు నన్ను బాగానే చూసేవారు.


ఇందిరాదేవి: అప్పుడు రాముడిలా బాగానే ఉన్నావు. ఇప్పుడే రాక్షసుడిలా మారిపోయావు.


రుద్రాణి: అలా మారడానికి కారణం ఆ కావ్య కాదా..?  


స్వప్న:  నా చెల్లెలే అలా చేయాలనుకుంటే రాజ్‌ చేసిన తప్పును ఆఫీసులో అందరిముందు చెప్పి తనే సీఈవోగా ఉండేది.


అంటూ స్వప్న తిట్టగానే రుద్రాణి నోరు మూసుకుంటుంది. అందరూ కలిసి రాజ్‌ను గట్టిగా అడుగుతారు. అపర్ణను వెళ్లి తీసుకురమ్మని దీంతో రాజ్‌ సరే వెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాజ్‌ వెళ్లడం గురించి ఇందిరాదేవి, అపర్ణకు ఫోన్‌ చేసి చెప్తుంది. తర్వాత రుద్రాణి, రాహుల్‌ మాట్లాడుకుంటారు.


రాహుల్‌: ఎందుకు మమ్మీ అలా టెన్షన్‌ పడుతున్నావు. రాజ్‌ వెళ్లినంత మాత్రాన కావ్య ను తీసుకొస్తాడా..? రాజ్‌ మొదటిసారి మనలా చీటింగ్‌ చేశాడు. కావ్య  మీద గెలిచాడు. కావాలంటే చూడు వాళ్ల అమ్మను మాత్రమే తీసుకుని వస్తాడు.


రుద్రాణి: రాజ్‌ వెళ్లి పిలిచినంత మాత్రాన మా వదిన వచ్చేస్తుందా..? కావ్యను తీసుకొస్తేనే నేను వస్తానని కండీషన్‌ పెడుతుంది.


రాహుల్‌: సరే మమ్మీ రాజ్‌ పిలవగానే కావ్య వస్తుందా..? అసలే మోసం చేసి గెలిచాడు అని కోపంగా ఉంది. 


రుద్రాణి: కావ్య అలా రాదని తెలిసే మా వదిన ఇలా నాటకం ఆడుతుందిరా.. ఆ కావ్య మళ్లీ ఇంట్లో అడుగుపెడితే ఆస్థి ముక్కలు కాకుండా చూస్తూంది. ఏదో ఒకటి చేసి దాన్ని అడ్డుకోవాలి.


అంటూ ఏదో ప్లాన్‌ వేయాలని ఆలోచిస్తుంది రుద్రాణి. మరోవైపు రాజ్‌ కనకం ఇంటికి వెళ్తాడు. కావ్య చూసీ చూడనట్టు వెళ్లిపోతుంది. దీంతో కావ్యను తిడతాడు రాజ్‌. ఇద్దరి మధ్య గొడవ జరగుతుంది. కావ్య కోపంగా రాజ్‌ను తిట్టి బయటకు వెళ్లిపోతుంది. గుమ్మం దగ్గరకు వెళ్లిన రాజ్‌ లోపల అపర్ణ కూరగాయలు కట్‌ చేస్తూ ఉండటం చూసి షాక్‌ అవుతాడు. పక్కనే కనకం కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని కాఫీ తాగుతుంది.


అపర్ణ:  కనకం నువ్వు చెప్పినట్టే కూరగాయలు కోసేసాను ఇక లేవనా..? కాళ్లు పట్టేస్తున్నాయి.


కనకం:  ఇంకొన్ని కట్‌ చేయండి.


అపర్ణ: సరే కాస్త కాఫీ ఏమైనా ఇస్తావా..?


కనకం: అయ్యో మా మధ్య తరగతి ఇళ్లల్లో రోజుకు రెండు సార్లు మాత్రమే కాఫీ తాగుతామండి.


రాజ్‌: స్టాఫిట్‌.. మా అమ్మతో కూరగాయలు కట్‌ చేయిస్తావా..? కాన్సర్‌ కనకం. నీకెంత ధైర్యం. అమ్మా ఏంటి నీకీ ఖర్మ మన ఇంటికి వెళ్దాం పద.


అపర్ణ: నేను రాను.. నా కోడలు ఎక్కడు ఉంటే నేను అక్కడ ఉంటాను.


రాజ్‌: ఇక్కడ ఇన్ని అవమానాలు పడుతూ ఉండటం అవరమా మమ్మీ..


అపర్ణ: అవమానం ఏం లేదు నాన్నా.. కనకం నన్ను బాగానే చూసుకుంటుంది. పొద్దునే చద్దనంలో మజ్జిగ కూడా వేసింది. నంజు కోవడానికి ఆవకాయ కూడా ఇచ్చింది.


 అని అపర్ణ చెప్పగానే.. రాజ్‌ మరింత బాధతో కనకాన్ని తిట్టి.. అపర్ణను కన్వీన్స్‌ చేయాలని చూస్తాడు. కానీ ఆపర్ణ, కావ్య లేకుండా ఆ ఇంట్లో అడుగుపెట్టనని కరాకండిగా చెప్తుంది. రాజ్‌ ఒక్కటే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాజ్‌ ఒక్కడే ఇంటికి రావడంతో సుభాష్‌ తిడతాడు. ఇందిరాదేవి కూడా వాడు వాళ్ల అమ్మతో చీవాట్లు తిని వచ్చాడని అంటుంది. లేదని కావ్యను ఎడాపెడా తిట్టానని రాజ్‌ చెప్తాడు.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!