Satyabhama Serial Today Episode క్రిష్ తన బిడ్డ అని మహదేవయ్యకు తనకు సంబంధం ఉందని గంగ మహదేవయ్య ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది. ఇక భైరవి మహదేవయ్యని ఏం అడగలేక మిగతా ఆడవాళ్లతో మీటింగ్ పెడుతుంది. తలా ఓ మాట అని భైరవి అనుమానం నిజం చేసేలా మాట్లాడుతారు. భైరవి సత్య రేణుకలతో మీ మామయ్యకి చిప్స్ అంటే ప్రాణం అవే పోలికలు ఆ బండోడికి వచ్చినట్లు ఉన్నాయని చెప్పి ఏడుస్తుంది.
పంకజం: అమ్మా అయ్యగారి పోలికలు అన్నీ ఆ బండోడిలో కనిపిస్తున్నాయి.
భైరవి: నువ్వేమంటావే
సత్య: నిజంగా తప్పు చేసుంటే మామయ్య అలా నిశ్చింతగా పడుకోరుకదా.
క్రిష్: మంచిగా చెప్పావ్.
భైరవి: నాలుగు మర్డర్స్ చేసి వచ్చిన రోజున కూడా ఆరాంగా పడుకుంటారు. అప్పుడప్పుడు నిద్రలో గంగ దగ్గరకి పోవాలని కలవరిస్తే దేవుడి దగ్గరకు అనుకున్నా ఈ దిక్కుమాలిన గంగ దగ్గరకు అనుకోలే.
మహదేవయ్య: అయ్యాయా ఎవరో పిచ్చిది వచ్చి ఇలా చేస్తే నా వెనక ఉండి సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలా అనుమానిస్తారు.
మరోవైపు సంధ్య రెస్టారెంట్‌లో సంజయ్ కనిపిస్తాడేమో అని అనుకుంటుంది. సంజయ్ రాలేదు కాబట్టి సంజయ్ చెప్పినట్లు విధి లేదు ఏం లేదు అనుకొని వెళ్లబోతే అప్పుడు సంజయ్ ఎంట్రీ ఇస్తాడు. కావాలని మాట్లాడుతాడు. ఫ్రెండ్స్ అని సంధ్యతో చేయి కలుపుతాడు. నా వల్ల కాదు అని సంధ్య వెళ్లిపోతుంది. రేపటి నుంచి నువ్వు నన్ను నమ్ముతావు సంధ్య విధికి కాదు అలా నేను చేస్తానని సంజయ్ అనుకుంటాడు. ఇక గంగ నా మొగుడు నాకు కావాలి అని మహదేవయ్య గంగ మొగుడు అని అరుస్తుంది. సత్య గంగకి ఫోన్ చేసి మహదేవయ్యకి చుక్కలు చూపించమని అంటుంది. ఇక మహదేవయ్య తనని నమ్మమని భైరవితో చెప్తాడు. ఇక గంగ ఒక్కదాన్నే ఎంత సేపు ఇలా అరవాలి ఎవరినైనా పంపించు అని అంటుంది. దానికి సత్య అదంతా నేను చూసుకుంటా అని అంటుంది. ఇక నర్శింహకి కాల్ చేయాలని తన నెంబరుతో కాకుండా వేరే నెంబరుతో ఫోన్ చేస్తుంది. గంగ స్లోగన్లకు భైరవి ఏడుస్తుంది. మహదేవయ్య ఆపండ్రా అని అరుస్తాడు.
మహదేవయ్య రెండో పెళ్లి చేసుకున్నాడని నర్శింహకి సత్య కాల్ చేస్తుంది. దాంతో నర్శింహ మహదేవయ్య రౌడీ కానీ ఆడవాళ్ల విషయంతో దేవుడని అంటాడు. దాంతో సత్య మహాదేవయ్య ఇంటి దగ్గర రెండో పెళ్లాం రచ్చ చేస్తుంది నీ మనుషులు, మీడియాని తీసుకెళ్లి ఆమెకు సపోర్ట్ చేసి నీ ఎమ్మెల్యే టికెట్ పొందేలా చేసుకో అని అంటుంది. అందరూ బయటకు వస్తారు. మహదేవయ్య అది ఎవర్తో అని అంటే దానికి గంగ అది ఇదీ అంటే నేను నిన్ను అరే ఒరే అంటాను అని అంటుంది. దాంతో సత్య అలా అనొద్దని ఏం కావాలి అత్తయ్య అని అడుగుతుంది. దాంతో గంగ భలే పిలిచావమ్మా మళ్లీ పిలువు అంటుంది. ఇక గంగ మహదేవయ్యతో మన బిడ్డకి ఆకలి ఎక్కువ తినడానికి ఏమైనా తీసుకురా పెనిమిటి అని చెప్తుంది. ఇంతలో మీడియా వాళ్లు వస్తారు. మహదేవయ్య వాళ్లు షాక్ అయిపోతారు.
మీడియా వాళ్లతో బంటి నేను అచ్చం నాన్న పోలికే అని అని అంటాడు. ఇక క్రిష్ కూడా నా కొడుకు అని గంగ అంటుంది. దాంతో మహదేవయ్య నా కొడుకు వాడు అంటుంది. క్రిష్‌ని తనకి ఇచ్చేయాలి లేదంటే బంటితో పాటు తనని ఇంట్లో ఉంచాలని అంటుంది. ఇంతలో నర్శింహ వస్తాడు. వీడెందుకు వచ్చాడు అని మహదేవయ్య సత్యని అడుగుతాడు. ఇక నర్శింహ తన రౌడీలతో మహదేవయ్య డౌన్ డౌన్ అని అరిపిస్తాడు. ఓ ఆడదాని జీవితంతో ఆడుకున్న మహదేవయ్యని వదలకూడదని నర్శింహ రెచ్చిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.