Ammayi garu Serial Today Episode విజయాంబిక అందరి కోసం టీ తీసుకొని వచ్చి ఇస్తుంది. వారానికి ఒక సారి ఇలాగే చేయించాలని రఘు తన బావగారు సూర్యప్రతాప్‌తో చెప్తాడు. విజయాంబిక షాక్ అయిపోతుంది. మరోవైపు రూప, రాజులు మాట్లాడుకుంటారు. పింకీని జీవన్ నుంచి కాపాడుకోవాలని అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటారు. 


రాజు: రాఘవ ఎక్కడున్నాడో కనుక్కొని విజయాంబిక గారి బండారం బయట పెట్టి మీ అమ్మానాన్నల్ని కలపాలి.
రఘు: వయసులో చిన్న వాళ్లు అయినా బాగా ఆలోచిస్తున్నారు. ఇలాంటి వైద్యాలు నా దగ్గర చాలా ఉన్నాయి. విజయాంబికలో మార్పు తీసుకొస్తా. 
రూప: రాఘవ ఎక్కడున్నాడో దీపక్, అత్తలకే తెలుసు మామయ్య. రాఘవ దొరికితేనే అమ్మానాన్నల్ని కలిపించొచ్చు.
రఘు: రాఘవతో కాదు విజయాంబికతోనే నిజం చెప్పిస్తా కాకపోతే విరూపాక్షి మీద బావగారికి కోపం ఉంటుంది. అది తగ్గించే బాధ్యత మీదే.
రాజు: మేం పెద్దయ్య గారి మనసు మార్చుతా.


గోపీ గురించి అమ్మానాన్నలకు చెప్దామని రాజు రూపతో చెప్తాడు. గోపీని డిప్రెషన్ తగ్గేవరకు తన ఇంట్లో ఉంచుదామని అంటాడు. రాజు, రూపలు ముత్యాలు ఇంటికి వెళ్తారు. అందరూ సంతోషించినా పైకి మాత్రం కోపంగా మాట్లాడుతారు. ముత్యాలు ఇంట్లోకి రావొద్దని అంటుంది. మేం ఎందుకు రాకూడదో చెప్పండని రూప ప్రశ్నిస్తుంది. 


రూప: మేం ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాం.
ముత్యాలు: మనసులో కొంప తీసి విడిపోతాం అంటారు అలా అంటే నా గుండె ఆగిపోతుంది దేవుడా.
రూప: మీ గోపీ గోడలు దూకుతుంటే పట్టుకొని కొడుతున్నారు. తమ్ముడిని కొడుతుంటే అన్న చూస్తూ ఉండలేకపోతున్నాడు.
రాజు: గోపీ ఒక అమ్మాయిని ప్రేమించాడు నాన్న.
అప్పలనాయుడు: మీ నాన్న రేయి పగలు కష్టపడుతుంటే నువ్వు ప్రేమలు ఏంట్రా.
రాజు: నేను అలా చెప్తే చనిపోవడానికి రెడీ అయ్యాడు పెళ్లి చేస్తాం అని చెప్తే ఇలా బతికాడు. వాడు ప్రేమించింది ఎవర్నో కాదు.
అప్పలనాయుడు: ఎవర్ని ప్రేమించావురా.
గోపీ: పెద్దయ్యగారి తమ్ముడు కూతురు పింకీని ప్రేమించాను పెద్దనాన్న అందరూ షాక్ అయిపోతారు.


అప్పలనాయుడు చిన్నమ్మగారిని ప్రేమిస్తావా అని కొడతాడు. రూప, రాజులు ఆపుతారు. పెళ్లి అయిన అమ్మాయిని ప్రేమించడం ఏంట్రా అని తిడుతుంది. ఒక అమ్మాయిని ఈ ఇంటి అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల చాలా దూరం అయిపోయాం ఇప్పుడు నువ్వు ఏంట్రా అంటే రూప అలా కాదు అని సర్ధి చెప్పబోతే విరూపాక్షి రూపని తిడుతుంది. మీ వల్ల రెండు కుటుంబాలు బాధ పడ్డాయి అని చెప్తుంది. ఆ ఇంటి వైపు వెళ్లొద్దని తిడతారు. పింకీ కూడా గోపీని ప్రేమిస్తుందని రూప చెప్తుంది. దాంతో అందరూ మళ్లీ షాక్ అయిపోతారు. అప్పలనాయుడు వాళ్లు గోపీకి బుద్ధి చెప్తే వాడు ఆ స్థాయి దాటిపోయాడని రాజు అంటాడు.


ఇక రూప గోపీ గురించి మీకు చెప్పాలని అనుకున్నాం మీరు సాయం చేయరని తెలిసి ఇక్కడ గోపీని వదలం అని గోపీని తీసుకెళ్లిపోతారు. అప్పలనాయుడు, ముత్యాలు బాధ పడితే విరూపాక్షి రాజు, రూపలు తప్పుడు నిర్ణయాలు తీసుకోరని అంటుంది. ఇక గోపీ మా గురించి ఎవరూ ఒప్పుకోరు నన్ను వదిలేయండి నా చావు నేను చస్తా అని గోపి అంటే రాజు కొట్టి తిడతాడు. ఇక రాజు ఆ రోజు ఏదో జరిగింది అది ఏంటో తెలుసుకోవాలని అందుకు జీవన్ వల్లే తెలుసుకోవాలని అంటాడు. శ్వేతని వాడుకొని విషయం తెలుసుకోవాలని అంటాడు. జీవన్ పింకీ మెడలో తాళి కట్టి బెదిరించినట్లు మనం కూడా చేయాలని రాజు తన ప్లాన్ రూప, గోపీలకు చెప్తాడు. అనుకున్నట్లు రాజు శ్వేతతో మాట్లాడాలని పిలుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారి, లక్ష్మీలకు సంబంధం ఉందని రచ్చ రచ్చ చేసిన పద్మాక్షి.. ఫుటేజ్‌లో అంబిక దొరికిపోతుందా!