KCR Movie: రేవంత్ రెడ్డి పాలనలో కేసీఆర్‌ను పొగిడితే ఎలా... రాంగ్ స్టెప్ వేసిన 'జబర్దస్త్' రాకేష్

Jabardasth Rakesh: 'జబర్దస్త్' రాకేష్ హీరోగా వచ్చిన 'కేసీఆర్' సినిమాలో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి పాలనలో కేసీఆర్‌ను పొగుడుతూ తీసిన ఈ సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసా?

Continues below advertisement

రోమ్‌లో రోమన్‌లా ఉండాలి అని పెద్దలు చెబుతారు. విదేశాలు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలనేది పక్కన పెడితే... తెలుగు రాష్ట్రాల్లో అధికార ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించేలా నడుచుకుంటే ఎలా ఉంటుందో ఏపీలో అధికార మార్పిడికి ముందు టాలీవుడ్ చూసింది. అది తెలిసీ... తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డిని పొగుడుతూ సినిమా తీసిన 'జబర్దస్త్' రాకేష్ (Jabardasth Rakesh)ను హరీష్ రావు పొగిడారు. కానీ, జనాలు మాత్రం సినిమాను చూడటం లేదు. 

Continues below advertisement

ఇప్పుడు కేసీఆర్ మీద సినిమా తీస్తే ఎలా?
'జబర్దస్త్' ప్రోగ్రాం, ఇంకా టీవీ రియాలిటీ షోస్ ద్వారా పాపులర్ అయిన 'రాకింగ్' రాకేష్ హీరోగా యాక్ట్ చేసిన సినిమా 'కేశవ చంద్ర రామావత్' (Keshava Chandra Ramavath Movie). షార్ట్ కట్‌లో కేసీఆర్ (KCR Movie). నిజం చెప్పాలంటే... ఈ మూవీ ఫస్ట్ టైటిల్ కేసీఆర్. అప్పుడు భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధికారంలో ఉంది. కేసీఆర్ మీద అభిమానం కావచ్చు లేదంటే ప్రభుత్వ పెద్దలను కాకా పట్టడం కోసం కావచ్చు... టీవీ షోస్ చేసుకునే రాకేష్ ఏకంగా సినిమా తీశాడు.

మనది ప్రజాస్వామ్య దేశం కనుక ఎవరి మీద ఎవరికైనా సినిమా తీసే స్వేచ్ఛ ఉంది. కేసీఆర్ మీద సినిమా ఎందుకు తీశారని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. కాకపోతే... ఆ సినిమా చేసిన టైమ్, రిలీజ్ అయిన టైమ్ మధ్య గ్యాప్ వచ్చింది. దాంతో రాకేష్ వేసిన స్టెప్ రాంగ్ స్టెప్ అయ్యింది. 

తెలంగాణ ఎన్నికలు ముగిశాక... కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), ఆయన పార్టీ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆయన్ను పొగుడుతూ తీసిన సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఎన్నికలకు ముందు తీసి ఉంటే ఎవరైనా సినిమాలో ఏం చెప్పారోనని థియేటర్లకు వచ్చేవారు ఏమో!? ఇప్పుడు ఎవరూ ఈ సినిమా చూడటం లేదు. కేసీఆర్ పత్రిక నమస్తే తెలంగాణకు చేసిన వెబ్ మీడియాలో తప్ప మరొక చోట రివ్యూ రాలేదు.

Also Readమహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు... మొదటి రోజే షోస్ క్యాన్సిల్, కలెక్షన్స్‌ అయితే మరీ ఘోరం

కేసీఆర్ చేసిన అభివృద్ధి గురించి సినిమాలో పేజీలకు పేజీలు డైలాగులు చెప్పారు రాకింగ్ రాకేష్. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి ఆ డైలాగులు పనికి వస్తున్నాయి. అంతే తప్ప థియేటర్లకు జనాలను తీసుకు రావడం లేదు. కేసీఆర్ అభివృద్ధి చేశారని ప్రజలు నమ్మితే మెజారిటీ కట్టబెట్టి అధికారంలోకి తీసుకు వచ్చేవారు కదా! 

కేసీఆర్ (KCR)ను ఓడించిన ప్రజలు... ఆయన మీద తీసిన సినిమా చూడటానికి థియేటర్లకు వస్తారని ఎలా అనుకోవాలి? పెళ్ళాం పుస్తెలు అమ్మి సినిమా తీశానని ఎమోషనల్ డైలాగులు చెబితే జనాలు థియేటర్లకు వచ్చే రోజులు పోయాయి. తమ టికెట్ రేటు తగ్గ వినోదం వస్తుందో? లేదో? అని ఆలోచించే రోజులు వచ్చాయి. ఈ చిన్న లాజిక్ రాకేష్ ఎలా మర్చిపోయాడో మరి! ఈ సినిమాకు పోస్టర్ ఖర్చులు వస్తాయో రావో కూడా డౌటే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

Also Readదేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?

Continues below advertisement