Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి, లక్ష్మీలు లక్ష్మీ గదిలో ఉండగా అంబిక గదికి తాళం వేసేస్తుంది. విషయం తెలిస్తే ఇంట్లో పెద్ద సునామీనే వస్తుందని లక్ష్మీ టెన్షన్ పడుతుంది. ఇక విహారి టెన్షన్ పడొద్దని కూల్‌గా ఉండమని అంటాడు. ఇక విహారి తనకు బాగా ఆకలేస్తుందని అంటాడు. రోజు ఈ టైంకి నువ్వు వండే వంట తిని హాయిగా పడుకునే వాడినని ఇప్పుడు ఆకలికి ప్రాణం అలమటిస్తుందని అంటాడు. దాంతో లక్ష్మీ ఆలోచించి తాను చేసిన పూజలో పెట్టిన ప్రసాదం పులిహోర, స్వీట్స్ విహారికి ఇస్తుంది.


విహారి: ఇవన్నీ ఎక్కడివి హఠాత్తుగా వీటితో అన్నపూర్ణ దేవిలా ప్రత్యక్షం అయ్యావ్.
లక్ష్మీ: మా అమ్మానాన్న ఊరి నుంచి పంపించారు కదా ఆ స్వీట్స్ ఇవి తినండి. 
విహారి: ప్రతీ చోట నేను నీకు రుణ పడేలా చేస్తున్నావ్ లక్ష్మీ. విహారి తినడానికి కూర్చొని చేయి నొప్పి అనడంతో లక్ష్మీ దగ్గరుండి విహారికి తినిపిస్తుంది. విహారి సగం తిని లక్ష్మీకి తినమంటాడు. డోర్ సంగతేంటో చూస్తానని తీయడానికి వెళ్తాడు. 
లక్ష్మీ: నా భర్త తిన్న ప్లేట్‌లో నేను తిని వ్రతం విడవాలి అని నాకు ఈవిధంగా అవకాశం కల్పించావా భగవంతుడా. 


విహారి తిన్న మిగతా సగం లక్ష్మీ తింటుంది. ఎంత ప్రయత్నించా డోర్ రావడం లేదని విహారి చెప్తాడు. బయట నుంచి ఎవరైనా వెళ్తే పిలుద్దామా అని విహారి అంటే ఇంకేమైనా ఉందా పిలిచి పిలిచి బాణం వేయమని అన్నట్లుంటుందని లక్ష్మీ అంటుంది. మరోవైపు వసుధ పాలు తీసుకొని వెళ్తుంటే సహస్ర ఎదురు పడి బాబాయ్‌ కోసమా అని అడిగితే దానికి వసుధ ఇది మీ బావకి అని అంటుంది. దాంతో సహస్ర నేను తీసుకెళ్లి ఇస్తానని పాలు తీసుకొని విహారి గది వైపు వస్తుంటుంది. ఇక లక్ష్మీ విహారితో మీ మీద ఎవరైనా నిందలు వేస్తారేమో విహారి గారు అంటుంది. నా గురించి ఆలోచిస్తున్నావ్ నీ గురించి ఆలోచించుకోవా అంటాడు. ఇక కనకం దానికి మీరు నాకు నా కుటుంబానికి చాలా సాయం చేశారు మీ సంతోషమే నేను కోరుకుంటానని అంటుంది. మరోవైపు సహస్ర విహారి గదికి వచ్చి చూస్తే విహారి ఉండడు. ఫోన్ కూడా చేస్తుంది. లక్ష్మీని అడగాలి అని లక్ష్మీ గదికి వెళ్తుంది. ఇంతలో సహస్రకి ఫోన్ వస్తుంది. ఆ రింగ్‌ టోన్ విని అది సహస్ర అని అంటాడు.  ఇద్దరూ డోర్ దగ్గరకు వెళ్లి మాటలు వింటారు. 


విహారి సహస్ర అని చెప్పి సహస్రని పిలవబోతే లక్ష్మీ విహారి నోటి మీద తన చేతిని అడ్డు పెట్టి బుద్ధుందా అని అంటుంది. ఇక సహస్ర పెళ్లికి రాకపోతే చంపేస్తా అని ఫోన్‌లో అనడం విన్న విహారి పెళ్లికి రాను అంటే చంపేస్తా అంటుంది ఇక మా ఇద్దరినీ ఇలా చూస్తే అంతే అని అనుకుంటాడు. సహస్ర వెళ్లిపోతుంది. ఇక విహారి లక్ష్మీకి తన జడకు ఉన్న పిన్ను అడుగుతాడు. ఆ సైడ్ పిన్‌లో డోర్ తీయడానికి ప్రయత్నిస్తాడు. డోర్ రాకపోవడంతో ఇక దీనితో పని లేదు నువ్వే పెట్టుకో అని లక్ష్మీకి ఇచ్చేస్తాడు. విహారి డోర్ లాగుతూ ఉంటే లక్ష్మీ చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండకుండా పట్టుకొని లాగొచ్చు కదా అంటాడు. విహారి చేయి పట్టుకోగానే దెబ్బ మీద తగిలి కెవ్వు మంటాడు. ఇక నడుం పట్టుకొని లాగమని అంటాడు. లక్ష్మీ అలా లాగగానే ఇద్దరూ బెడ్ మీద ఒకరి మీద ఒకరు పడిపోతారు. ఇక ఏం చేయాలో తెలీక ఇద్దరూ కూర్చొండిపోతారు. కాసేపు అయిన తర్వాత విహారి లక్ష్మీ ఒడిలో పడుకుండిపోతాడు. లక్ష్మీ జో కొడుతూ కూర్చొంటుంది. 


ఉదయం అంబిక ఇంటికి వస్తుంది.. రాత్రంతా విహారి, లక్ష్మీ ఒకే గదిలో ఏం చేస్తున్నారో అనుకుంటుంది. ఇక ఎదురుగా పద్మాక్షి, సహస్ర కనిపిస్తారు. పొద్దున్న లేవనే లేవవు అలాంటిది ఇంత ఉదయం ఎక్కడికి వెళ్లావంటే అంబిక రాత్రి ఆఫీస్ పని మీద వెళ్లానని అంటుంది. దాంతో సహస్ర అయితే బావ కూడా నీతో వచ్చాడా అని అడుగుతుంది. బావ రాత్రింతా ఇంట్లో లేడని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: అసలు నువ్వు ఎవరు? నన్ను పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారు: త్రినేత్రికి విశాల్ ప్రశ్నలు