Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర కండీషన్ పద్మాక్షి డాక్టర్‌కి చెప్పి పిల్లలు పుట్టే మార్గం చూపమని అంటే మీ కూతురు, అల్లుడిని తీసుకురమ్మని డాక్టర్ చెప్తుంది. నా కూతురికి గర్భసంచి లేదు అని నేను నా కూతురికి ఎప్పుడో ఒకసారి చెప్తా కానీ నా అల్లుడికి తెలీకూడదు.. ఖర్చు ఎంత అయినా నేను భరిస్తాను కానీ పుట్టబోయే బిడ్డ నా కూతురు, అల్లుడు డీఎన్‌ఏతో పుట్టాలి అని చెప్తుంది.
డాక్టర్ ఇలా చేయడం కాస్త రిస్క్ అంటూనే సరే అంటుంది. కానీ విహారి, సహస్రల్ని హాస్పిటల్‌కి తీసుకురమ్మని చెప్తుంది. దాంతో పద్మాక్షి డాక్టర్‌కి థ్యాంక్స్ చెప్పి ఎలా అయినా ఇద్దరినీ తీసుకొస్తా అని అంటుంది. ఇద్దరినీ ఎలా హాస్పిటల్‌కి తీసుకురావాలా అని ఆలోచిస్తుంది. మరోవైపు అంబికకు ఆఫీస్ నుంచి రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్‌లు లిస్ట్ పంపిస్తారు. జేఆర్ కంపెనీ ప్రాజెక్ట్‌ని లక్ష్మీ రిజెక్ట్ చేసిందని గవర్నమెంట్ కూడా ప్రాజెక్ట్ ఇల్లీగల్‌గా ఉందని రిజక్ట్ చేశారని చెప్తాడు. ఇదే కరెక్ట్ ప్రాజెక్ట్ అని అది నాకు కావాలని 3 గంటల్లో టెండర్ మనమే వేస్తున్నాం అని అంటుంది. మేనేజర్ సరే అని ఫైల్ తీసుకొస్తానని అంటాడు.
విహారి మేడ మీద నుంచి వస్తుంటే సహస్ర చూసి హగ్ చేసుకొని హ్యాపీగా నవ్వుకుంటుంది. పద్మాక్షి అది చూసి హ్యాపీగా ఫీలవుతుంది. విహారి సహస్రని దూరం పెడతాడు. దాంతో సహస్ర ఏంటి బావ మనిద్దరం అంత దగ్గరైనా నువ్వు నాకు దూరం పెడతావేంటి.. మనిద్దరికీ కవల పిల్లలు పుట్టినట్లు కల వచ్చింది బావ.. ఇద్దరితో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావ్ అని కల వచ్చింది.. బావ నా కల నిజం అవుతుందా.. నిజం అవుతుంది బావ.. మనకు అందమైన పిల్లలు పుడతారు అని సంతోషం వ్యక్తం చేస్తుంది. బావ నీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని అడుతుంది. విహారి ఏం చెప్పకుండా నేనే వేరే టెన్షన్లో ఉన్నా మనం తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు.
పద్మాక్షి మనసులో నీకు గర్భసంచే లేదే అది తెలియక నువ్వు ఎంత సంతోషపడుతున్నావే అని అనుకుంటుంది. విహారిని నువ్వు నా కూతురిని దూరం పెడుతున్నావ్ కదా.. మీ ఇద్దరినీ మాయ చేసి అయినా హాస్పిటల్‌కి తీసుకెళ్తా మీరే ఈ ఇంటి వారసుడిని ఇచ్చేలా చేస్తా అని అనుకుంటుంది.
పండు లక్ష్మీ కోసం భోజనం తీసుకొస్తాడు. లక్ష్మీ తినను అని అంటుంది. పండు బతిమాలడంతో తింటుంది. లక్ష్మీ ఏడుస్తూ ఏంటి పండు నా బతుకు ఎవరో ఒకరు సాయం చేస్తే కానీ నేను ఏ పని చేయలేను.. ఇలాంటి బతుకు నాకు వద్దు నాకు ఇప్పుడే చచ్చిపోవాలి అని ఉంది అని ఏడుస్తుంది. ఇంతలో యమున అక్కడికి వస్తుంది. యమున లక్ష్మీకి తినిపిస్తుంది. లక్ష్మీ నువ్వు నీ జీవితంలో ఇంత కంటే కష్టాలను సమస్యల్ని చూసి వచ్చావ్ వాటితో పోల్చుకుంటే ఈ చీకటి ఎంత అని యమున అంటుంది. లక్ష్మీకి ధైర్యం చెప్పి అన్నం తినిపిస్తుంది. చీకటితో పోరాడు ఆ దేవుడే నీకు అండగా నిలుస్తాడు.. ఇంకెప్పుడూ చచ్చిపోతా అనొద్దు అని చెప్తుంది.
విహారి హాల్‌లో ఆలోచిస్తూ సేద తీరుతుంటే అంబిక వస్తుంది. ఇక మేనేజర్ ఫైల్ తీసుకొని వస్తారు. అందరూ ఇంత బాధ్యతారహితంగా ఎలా ఉంటారు. మీరు ఉన్నానాకు తప్పదు కదా అని అంటుంది. ఏమైందని విహారి అడిగితే ఈ రోజు టెండర్ ఉంది కదా ఆ లక్ష్మీ ఆ విషయం వదిలేసింది అని చెప్తుంది. నేను వస్తా టెండర్ వేద్దాం అని విహారి సంతకాలు పెట్టేస్తాడు. అంబిక, విహారి వెళ్తాడు. పండు లక్ష్మీకి విషయం చెప్పి ఈ రోజు టెండర్ ఉందని విహారి, అంబికమ్మా పరుగులు తీశారని అంటారు. లక్ష్మీకి డౌట్ వస్తుంది. తన ఫోన్ తీసుకురమ్మని పండుకి చెప్పి మూర్తి గారికి ఫోన్ చేయమని పండుకి చెప్తుంది. పండు చేసి ఇవ్వగానే లక్ష్మీ ఆయనతో మాట్లాడుతుంది. మనకి ఈరోజు ప్రాజెక్ట్స్ ఏం లేవని జేఆర్ ఇండ్రస్ట్రీస్లో టెండర్ ఉందని చెప్తారు.
రిజక్ట్ చేసిన ఫైల్ ఎవరో ప్రాసెప్ చేశారని లక్ష్మీకి తెలియడంతో విహారి ఆ టెండర్ వేయకుండా నేను ఆపుతా అని లక్ష్మీ అంటుంది. యమున రాగానే విషయం చెప్తుంది. విహారికి ఫోన్ చేయమని లక్ష్మీ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.