Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి వీ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కోసం క్లైంట్స్ వస్తారు. ప్రజంటేషన్ ఇవ్వమని కంగారు పెడతారు. మరోవైపు లక్ష్మీ సహస్ర ఇద్దరూ సమయానికి రారు. అంబిక లక్ష్మీని కిడ్నాప్ చేయమని చెప్పిన రౌడీలకు అంబిక లక్ష్మీ ఫొటో పంపే టైంకి సెల్ ఫోన్ స్విఛ్ ఆఫీ అయిపోతుంది. ఛార్జింగ్ పెట్టడంతో చారుకేశవ సీక్రెట్‌గా లక్ష్మీ ప్లేజ్‌లో సహస్ర ఫొటో పెట్టేస్తాడు.
సహస్ర వెళ్తుంటే ఆ రౌడీలు సహస్రని కిడ్నాప్ చేసేస్తారు. గోనెలో పెట్టి సహస్రని తీసుకెళ్లిపోతారు. మరోవైపు ఆటో డ్రైవర్ లక్ష్మీని అటూ ఇటూ తిప్పుతుంటాడు. త్వరగా తీసుకెళ్లమని లక్ష్మీ చెప్తుంది. ఇక క్లైంట్స్ కంగారు పెడుతుంటారు. లక్ష్మీ ఆటో ఆపమని చెప్తుంది. డ్రైవర్ ఆపకపోవడంతో లక్ష్మీ ఆటో డ్రైవర్ జుట్టు పట్టుకొని ఆపమని అంటుంది. ఆయన ఆపకపోవడంతో ఆటోలో నుంచి గెంటేస్తుంది. కింద పడిపోవడంతో లక్ష్మీ తలకు గాయం అవుతుంది. ఆటో డ్రైవర్ లక్ష్మీని ఆపడానికి ప్రయత్నిస్తే అతన్ని నెట్టేసి పారిపోతుంది.
మరోవైపు రౌడీలు సహస్రని చితక్కొడతారు. లక్ష్మీ వేరే ఆటో ఎక్కి ఆఫీస్‌కి బయల్దేరుతుంది. సహస్ర వద్దని ఎంత బతిమాలినా చూడకుండా చితక్కొడతారు. తర్వాత అంబిక రౌడీలకు కాల్ చేస్తుంది. దాన్ని చావగొట్టమని చెప్తుంది. ఒకసారి ఫొటో తీసి పెట్టమని అంటుంది. దాంతో రౌడీలు సహస్ర ఫొటో తీసి అంబికకు పెడతారు. అంబిక సహస్రని చూసి షాక్ అయిపోతుంది. వెంటనే కాల్ చేసి తనని కొట్టొద్దని నేను చెప్పింది ఒకరు మీరు మా అమ్మాయిని కొట్టారేంటి అని అడుగుతుంది. మీరు పంపిన ఫొటో చూడండి అంటాడు రౌడీ. అంబిక కోపంతో 5 నిమిషాల్లో తను ఆఫీస్ దగ్గర ఉండాలి అని అంటుంది. రౌడీలు సహస్రని తీసుకొని బయల్దేరుతారు. ఇంట్లో అందరూ టీవీలు వేసుకొని ముందు కూర్చొంటారు. ఇంకా ప్రజంటేషన్ స్టార్ట్ అవ్వలేదు ఏంటా అనుకుంటారు.
పద్మాక్షి అంబికకు కాల్ చేస్తే అంబిక జరిగింది చెప్తుంది. సరిగా చూసుకొని ఫొటో ఇవ్వడం తెలీదా అని పద్మాక్షి అంబికను తిడుతుంది. ఇంతలో సహస్ర వస్తుంది. అంబిక సహస్రకు సారీ చెప్తుంది. క్లైంట్స్ వెళ్లిపోయే టైంకి సహస్ర వస్తుంది. దాంతో విహారి సహస్రకు ప్రజంటేషన్ మొదలు పెట్టమని అంటాడు. లక్ష్మీ తన ప్రజంటేషన్ ఇస్తుంది. ఇంతలో లక్ష్మీ ఆఫీస్‌కి వస్తుంది. చారు కేశవ లక్ష్మీని చూసి ఆ బ్లడ్ ఏంటి అని అడుగుతాడు. ప్రజెంటేషన్ మొదలైందా అని లక్ష్మీ అడిగితే బ్లడ్ తుడుచుకోమని రుమాలు ఇచ్చి లక్ష్మీని లోపలికి తీసుకెళ్తాడు. లక్ష్మీ వెళ్లే సహస్ర రౌడీలు కొట్టిన దెబ్బలకు సహస్ర తల తిరుగుతూ ప్రజెంటేషన్ సరిగా చెప్పలేకపోతుంది. దాంతో క్లైంట్ అరుస్తారు. ఇక చెప్పొద్దు అని అంటారు.
సహస్ర ఐడియా వర్కౌట్ అవ్వదు అని చెప్తారు. తర్వాత లక్ష్మీ తన ప్రజెంటేషన్ ఇస్తుంది. లక్ష్మీ ప్రజెంటేషన్ అందరికీ బాగా నచ్చుతుంది. ఇంట్లో కూడా వసుధ, యమున క్లాప్స్ కొడితే కాదాంబరి, పద్మాక్షి కోపంగా చూస్తారు. క్లైంట్స్ హ్యాపీ ఫీలవుతారు. లక్ష్మీ, విహారిలకు కంగ్రాట్స్ చెప్తారు. క్లైంట్స్ వెళ్లిపోయిన తర్వాత విహారి ఆఫీస్‌లో అందరి ముందు లక్ష్మీకి కంగ్రాట్స్ చెప్తాడు. విహారి వాళ్లు రాత్రి ఇంటికి వస్తారు. చారుకేశవ భార్యని హారతి తీసుకురమ్మని చెప్తాడు. విహారి పక్కన సహస్ర ఉంటే సహస్రని పక్కకు జరిపి విహారి పక్కన లక్ష్మీని నిల్చొపెట్టి ఇద్దరికీ హారతి ఇవ్వాలి అంటాడు. వసుధ విహారి, లక్ష్మీలకు హారతి ఇస్తుంది. సహస్రతో పాటు అందరూ చిరాకు పడి కోపంగా చూస్తారు.
వసుధ లక్ష్మీకి శాలువా వేసి కప్పుతుంది. ఇక నుంచి నువ్వే ఎండీ అని చారుకేశవ అంటాడు. సహస్రతో పద్మాక్షి బాగా ప్రిపేర్ అయ్యావు కదా ఏమైందే అంటే ఇప్పటి వరకు ప్రజంటేషన్ ఇచ్చే అలవాటు లేక తడబడ్డాను అని అంటాడు. త్వరలోనే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్‌లో కంపెనీ మొదలవుతుందని 5 వేల మందికి ఉపాధి దొరుకుతుందని విహారి అంటాడు. దాంతో కాదాంబరి అంతా సహస్ర ఇంటి కోడలిగా వచ్చిన వేలా విశేషమే అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథునని ఎవరు ఏం అన్నా తట్టుకోలేనమ్మా.. ప్రేమ బయట పెట్టేసిన దేవా!